Menu

Healthy Life: ఈ ఏడు పాటించండి చాలు, మీ జీర్ణవ్యవస్థకు ఏ సమస్యలూ రావు


శుభ్రత, నాణ్యత ఉన్న చోటనే తినాలి. అలాగే ఏం తింటున్నాం అనేది కూడా చూసుకోవాలి. బయట కలుషిత ఆహారం తిని జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Sumanth Thummala

Things to Do for Healthy Life: మనం మంచి రుచికరమైన తిండి కోసం ఏమైనా చేస్తాం. అన్ని రకాల ఆహార పదార్థాలు తింటూ మన జిహ్వ చాపల్యాన్ని తృప్తి పరుస్తాం. కానీ మనం తినే ఆహారమే మన కడుపు , పేగుల ఆరోగ్యం గురించి పట్టించుకోం. కానీ కొన్ని ఆహార అలవాట్ల వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. చాలా తక్కువ నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, ధూమపానం-మద్యం సేవించడం,. వంటి అనేక కారణాలు మన కడుపు ని, తద్వారా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం, పోషకాహార లోపం వంటివి రావచ్చు. మన కడుపు, పేగుల ఆరోగ్యం బాగుంటేనే మనకు అవసరమైన పోషకాలు సరైన రీతిలో అందుతాయి. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి చేయాల్సిన 7 పనులు ఏంటంటే..

1. ఉడికించిన ఆహారం తీసుకోవాలి:
తినే ఆహారం సరిగ్గా ఉడికిస్తేనే అందులో ఉండే హానికారక సూక్ష్మక్రిములు చనిపోతాయి. అందులోనూ మాంసాహారాన్ని తప్పకుండా 74° C ఉష్ణోగ్రత పైనే ఉడికించాలి. మేక మాంసం వంటివి 75°C పైన ఉడికించాలి. ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే బాక్టీరియా కొన్ని ఆహార పదార్థాలపై సులభంగా పెరుగుతుంది. అవి; పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు,సముద్ర ఆహారం,అన్నం, శుభ్రత పాటించని ప్రదేశాల్లో వండిన ఆహారం. కాబట్టి వీటిని సరిగ్గా ఉడికించి తినాలి.

2. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి:
మనం చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని డాక్టర్లు నిత్యం చెబుతుంటారు. చేతులు తరచూ కడుక్కోవడం ఎంత అవసరమో కరోనా తర్వాత సామాన్య ప్రజలకు బాగా తెలిసొచ్చింది. మనం రోజులో ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, చేతులతో తాకుతుంటాం. దాని వల్ల ఎన్నో రకాల క్రీములు మన చేతుల్లో ఉంటాయి. మనం చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే ఆ క్రీములు శరీరంలోనికి వెళ్లి అనారోగ్యానికి కారణం అవుతాయి. మలమూత్ర విసర్జన తర్వాత, మాంసాన్ని కడిగిన తర్వాత కూడా తప్పకుండా చేతులు కడుక్కోవాలి. అలాగే వంట గదిలో కూడా శుభ్రత కచ్చితంగా పాటించాలి.

3. పచ్చి ఆహారం ఉడికిన ఆహారం వేరు చేయడం:
మనం తినే ఆహారం ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా అవసరం. కొన్ని రకాల పచ్చి ఆహార పదార్థాల వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పచ్చి మాంసం, గుడ్లు వంటివి సాల్మొనెల్లా, ఈ కోలీ వంటి హానికారక బ్యాక్టీరియా ఉడికిన ఆహారం మీదకు వెళ్ళొచ్చు. అలాగే వీటికి వాడే వుంట సామాను కూడా వేరుగా ఉంచాలి.‌ అంతా అయ్యాక వాటిని తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.

4. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం :
మన ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం చాలా అవసరం. లేదంటే అవి పాడైపోయి, బ్యాక్టీరియా,ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది.‌ మాములుగా ఫ్రిజ్ ఉష్ణోగ్రత 5°c కంటే తక్కువ పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఇక పచ్చి మాంసం వంటివి 0°c వద్ద తప్పక నిల్వ చెయ్యాలి. అలాగే వేటికి వాటికి వేరు వేరుగా నిల్వ చేసుకోవాలి. సరైన పాత్రల్లో పెట్టుకోవాలి.

6.‌ తగిన ఫైబర్ తీసుకోవాలి :
మన రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు (fiber) కూడా తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మలబద్ధకం వంటివి రాకుండా చేయొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు,ఆకుకూరలు తీసుకుంటే కావలసిన పీచు పదార్థాలు లభిస్తాయి.

5. ఇంటి బయట సరైన ఆహారం ఎంచుకోండి:
అందరికీ అన్నివేళలా ఇంట్లోనే ఆహారం తీసుకోవడం సాధ్యం కాదు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ బయట ఆహారం తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి. శుభ్రత, నాణ్యత ఉన్న చోటనే తినాలి. అలాగే ఏం తింటున్నాం అనేది కూడా చూసుకోవాలి. బయట కలుషిత ఆహారం తిని జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

6. సరిపడా నీళ్ళు తాగాలి:
మనం రోజూ తాగాల్సినంత నీరు తాగితే ఎన్నో ఇబ్బందులు రాకుండా చేయొచ్చు. అలాగే తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి సరిపోను నీళ్ళు తాగడం అవసరం.

7. సరిపడా నిద్ర, వ్యాయామం ఉండాలి :
మనం రోజులో సరిపడా 6-8 గంటల నిద్ర తప్పకుండా పోవాలి. నిద్ర తక్కువగా పోతే కూడా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.‌ అలాగే తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి వ్యాయామం చేయడం కూడా అవసరం. అలాగే దాని వల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం కూడా తగ్గుతుంది.

సరైన జీర్ణవ్యవస్థ ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. దాని కోసం మనం నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

గమనిక: ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ప్రజాధ్వని న్యూస్‌’ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: బాదం గింజలతో గుండె సమస్యలు పరార్.. ఎలానో తెలుసా?


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *