Menu

Mood Of The AP: టైమ్స్ నౌ అలా.. ఇండియా టుడే ఇలా.. అసలు ఏపీ ఓటర్ల నాడి ఎలా ఉందంటే?

Praja Dhwani Desk

Mood Of The Nation vs Times Now: ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ ఇటు రాజకీయ పార్టీలతో పాటు అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకొచ్చిన క్షణాల్లో వైరల్‌ అవుతోంది. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీ మధ్య రానున్న ఎన్నికల్లో టఫ్‌ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన పోల్స్‌ ఆసక్తి రేపుతున్నాయి. టౌమ్స్‌ నౌ(Times Now) సర్వే, ఇండియా టుడే(India Today) మూడ్‌ ఆఫ్‌ ది నేషన్ ఫలితాలు భిన్నంగా ఉండడంతో ఓటర్లు అయోమయంలో పడ్డారు.


ఇండియాటుడే సర్వే లెక్కలివే:
ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే నిర్వహించే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌(Mood Of The Nation) లెక్కలు చాలా వరకు కరెక్ట్ అవుతాయన్న అభిప్రాయాలు ప్రజల్లో నెలకొని ఉంటాయి. గతంలో వారి లెక్కలు నిజమైన సందర్భాలు మిగిలిన సర్వేలతో పోల్చితే ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఇండియాటుడే ప్రీపోల్స్‌ నిర్వహించదు.. ఎగ్జిట్ పోల్స్‌ మాత్రమే నిర్వహిస్తుంది. అయితే అది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లెక్కల వ్యవహారం. ఇక తాజాగా ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయో చెప్పింది. రాష్ట్రాల వారిగా డేటాను రిలీజ్ చేసింది. ఇండియా టుడే లెక్కల ప్రకారం ఏపీలో అధికార పార్టీకి గట్టి షాక్‌ తగలనుందనే చెప్పాలి. 25 లోక్‌సభ ఎంపీ స్థానాల్లో టీడీపీ ఏకంగా 17 గెలుస్తుందని ఇండియాటుడే పోల్ చెబుతోంది. వైసీపీ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని డేటా రిలీజ్ చేసింది. 2019లో వైసీపీ 22 ఎంపీ స్థానాలను గెలుచుకోగా.. టీడీపీ మూడిటితోనే సరిపెట్టుకుంది.


టైమ్స్‌ నౌ సర్వే ఏం చెబుతోంది?
అటు ఇండియాటుడే ఫలితాలకు భిన్నంగా టైమ్స్‌ నౌ సర్వే రిజల్ట్స్‌ కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 19 గెలుచుకుంటుందని..టీడీపీ 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని టైమ్స్‌ నౌ సర్వే చెబుతోంది. కొన్ని గంటల వ్యవధిలో వచ్చిన ఈ రెండు సర్వేలతో ప్రజలు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. వైసీపీ ఏమో టౌమ్స్‌ నౌ సర్వేని ఎండోర్స్‌ చేసుకుంటుంటే.. ఇండియాటుడే పోల్స్‌ను భుజాన వేసుకుంది టీడీపీ. నిజానికి ఏపీలో ఓటర్ల నాడి ఎలా ఉందో ఇప్పటికైతే చెప్పడం కష్టమే. ఎందుకంటే సోషల్‌మీడియా పరంగా చూస్తే జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. తమ సంక్షేమ పథకాలు ప్రతీఇంటికి వెళ్తున్నాయని జగన్‌ టీమ్‌ గెలుపు పట్ల ఎంతో ధీమాగా ఉండగా.. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని.. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది.

Also Read: బూతుల సీఎంలు.. వీళ్లే ఇంతలా దిగజారిపోతే ప్రజలు ఎలా ఉండాలి?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *