Menu

Telugu Journalism: టైటిల్ పెట్టడంలేదు.. ఎందుకంటే మాకు తెలుగు జర్నలిస్టుల్లా థంబ్‌నెయిల్ పెట్టడం, మాట్లాడడం రాదు..!

Masked Voice 2 weeks ago
mahaa vamsi, wise tv ramulamma, magadha tv lakshmi

మహా వంశీ: వాళ్లిద్దరు కలిసి ట్రావెల్‌ చేశారా?

రిపోర్టర్ : చేశారు సర్.. మీరు అడిగింది నాకు అర్థమైంది సర్.. కలిసి ట్రావెల్ చేశారు సర్..(కాస్త సిగ్గుపడుతూ)

మహా వంశీ: ఓ ట్రావెల్ చేశారు.. పెళ్లికాకముందే చేశారు..(వెటకారంగా నవ్వుతూ)

రిపోర్టర్: చేశారు సర్..
——————-

ఇది రీసెంట్‌గా ఓ టాలీవుడ్‌ తార విషయంలో మహా టీవీ యాంకర్‌ వంశీకి, ఆయన ఛానెల్‌ రిపోర్టర్‌కి మధ్య జరిగిన సంభాషణ. జర్నలిజమంటే జనాలను ఎంటర్‌టైన్ చేయడమని తెలుగు జర్నలిస్టులందరికీ తెలుసు కానీ.. ఇలా ఎంటర్‌టైన్‌ చేయడంలో మాత్రం మహావంశీది సపరేటు స్టైలని సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపిస్తుంటాయి. ఆ మధ్య ఓ AI వీడియోలో పులి వచ్చి మంచంపై పడుకున్న ఓ మనిషిని పట్టుకొని చంపి తింటుంది. అది AI వీడియో అని పక్కలో సుస్సుపోసుకునే పిల్లాడికి కూడా అర్థమవుతుంది కానీ..ఈ టాల్కమ్‌ వంశీగారికి, ఆయన పక్కన ఉండే మరో యాంకర్‌గారికి మాత్రం ఆ విషయం అర్థంకాలేదని ప్రజలు చర్చించుకున్నారు.

తుఫాన్లను, వరదలను స్టీరింగ్‌తో తిప్పే సామర్థ్యం చంద్రబాబుకు ఉందో లేదో తెలియదు కానీ..సీఎంగారి భజన బృందంలో ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 సాంబుడిని సైతం మించిపోయిన మహావంశీకి మాత్రం న్యూస్‌ను భ్రష్టుపట్టించడం అందరికంటే ఎక్కువే తెలుసన్నది విమర్శకుల మాట. బండి భగిరథ్‌ పోక్సో ఎపిసోడ్‌లో మహాటీవీ పెట్టిన థంబ్‌నెయిల్స్‌తో పాటు ఆ చానెల్‌ టేలిక్యాస్ట్ చేసిన వార్తలు విన్నా, చూసినా జర్నలిజంపై విరక్తి కలగకమానదట. ఏ ఛానెల్‌కి ఏ ముడుపులు వస్తాయో, ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు కానీ.. ఓ మైనర్‌కు సంబంధించిన విషయంలో కాస్త బాధ్యతగా ఉండడం కనీస జర్నలిజం ధర్మం. నిజానికి ఆడవాళ్ల విషయంలో మహాటీవీ పెట్టిన థంబ్‌నెయిల్స్‌పై చర్చ జరగడం ఇదేమీ తొలిసారి కాదు.. ఓసారి ఓ పార్టీ కార్యకర్తలు మహా ఆఫీసుపై రాళ్లు, రప్పలు విసిరారు కూడా. అయినా మనోడికి ఇవేవీ పట్టవు.. తానే ఓ అర్నబ్‌ గోస్వామి అని ఫీల్ అయ్యే తత్వం ఆయనది(నిజానికి ఈ పోలిక కూడా హేతుబద్ధమే అనుకోండి)..! పైగా ఏదో జోక్‌ వేసినట్టు కొన్నిసార్లు వెటకారంగా.. అషురెడ్డి లాంటి ఎపిసోడ్లలో కామకారంగా నవ్వుతుంటారని సోషల్‌మీడియా యూజర్లు కామెంట్స్ చేస్తుంటారు.

✨ Quick Read

  • డిజిటల్ మీడియాపై తీవ్ర విమర్శలు
  • థంబ్‌నెయిల్స్‌, సెటైర్లపై సోషల్‌మీడియా రచ్చ
  • ‘కుల-మత జర్నలిజం’పై కొత్త చర్చ

AI-assisted summary, newsroom reviewed

అచ్చతెలుగు కమ్మతనం:

కమ్మతన్నానే అస్త్రంగా, కమ్మభావజాల వ్యాప్తే లక్ష్యంగా.. జర్నలిజం అనే పదాన్ని పాతరేసి.. తన కులం కోసం యూట్యూబ్‌ మైకులు పట్టుకొని తిరిగే డిజిటల్ జర్నలిస్టుల్లో మగధ లక్ష్మిగారు కూడా ఒకరు. ఒకప్పుడు పండుగంటే ఊరు మొత్తం కలిసొచ్చేది.. ఇప్పుడు యూట్యూబ్ విశ్లేషకుల దయవల్ల పండుగలకు కూడా కుల సర్టిఫికెట్లు జారీ అవుతున్న రోజులొచ్చాయి. సంక్రాంతి అంటే రైతు పండుగ, పంట పండుగ, పల్లె సంబరం అని చిన్నప్పటి నుంచి వినిపించిందే గానీ.. అది “కమ్మవారి పండుగ” అని కొత్త సామాజిక శాస్త్రాన్ని కనిపెట్టిన మేధస్సు ఆమెకే సొంతం.

రేపు ఇదే లాజిక్‌తో బతుకమ్మను ఒక కులానికి, వినాయకచవితిని ఇంకో కులానికి, దీపావళిని మరొక వర్గానికి రిజిస్టర్‌ చేస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని కలిపే పండుగల కంటే.. విడగొట్టే నేరేటివ్స్‌కే మార్కెట్ ఎక్కువ. వ్యూస్ వస్తే చాలు.. వైరల్ అయితే చాలు.. సమాజం ముక్కలైనా పర్వాలేదన్నట్టుగా మాట్లాడే ఈ తరహా యూట్యూబ్‌ మేధావుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక మహిళల రక్షణ కోసం వచ్చిన చట్టాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయ్ అని.. పురుషులకే అన్యాయం జరుగుతోందంటూ.. ప్రతి సామాజిక సమస్యను మగవాళ్లపై కుట్రగా చూపించే మరో కొత్త సిద్ధాంతాన్ని కూడా ఆవిడ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి వారు వార్తలు చెప్పడం లేదు.. వర్గాలను తయారు చేస్తున్నారు. ఒక వీడియోకి ఒక శత్రువు కావాలి.. ఒక థంబ్‌నెయిల్‌కి ఒక టార్గెట్ కావాలి.. ఒక డిబేట్‌కి ఒక కులం కావాలి.. ఒక రీల్‌కి ఒక కోపం కావాలి. ఇదే కొత్త మీడియా మోడల్‌. కోపాన్ని కంటెంట్‌గా.. విభజనను వ్యాపారంగా.. వైరల్‌ను సిద్ధాంతంగా మార్చుకున్న లక్ష్మీగారి లాంటి జర్నలిస్టులు ఇప్పుడు తెలుగు జర్నలిజానికి కొత్త గురువుల్లా తయారవడం ఇక్కడి సమాజం చేసుకున్న దౌర్భాగ్యం.

తెలుగు డిజిటల్ మీడియాలో థంబ్‌నెయిల్ కల్చర్ ఎందుకు పెరిగింది?

యూట్యూబ్‌, సోషల్‌మీడియా ఆల్గోరిథమ్‌లలో క్లిక్స్‌, వాచ్‌టైమ్ కోసం సంచలనాత్మక థంబ్‌నెయిల్స్‌, ఆగ్రహపూరిత హెడ్డింగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని మీడియా విశ్లేషకులు చెబుతున్నారు.

డిజిటల్ జర్నలిజంలో ఫ్యాక్ట్‌ చెకింగ్ ఎందుకు కీలకం?

సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా వైరల్ అయ్యే అవకాశం ఉండటంతో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకంగా మారింది. ముఖ్యంగా మతం, కులం, మహిళలు, మైనర్లకు సంబంధించిన వార్తల్లో బాధ్యతాయుత జర్నలిజం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

యాస, భాష కాదు.. భావమే ముఖ్యం:

ఇక తెలుగు డిజిటల్ మీడియాలో మరో కొత్త జానర్ కూడా ఉంది. అక్కడ వార్తల కంటే విద్వేషానికే ఎక్కువ డిమాండ్. విశ్లేషణ కంటే ఆవేశానికే ఎక్కువ మార్కెట్. ఫ్యాక్ట్ అనే పదాన్ని బ్యానర్ మీద వేసుకొని మతం, దేశభక్తి, శత్రువులు, కుట్రలు అనే పదాలతో రోజూ యూట్యూబ్ స్టూడియోల్లో యుద్ధ వాతావరణం సృష్టించే ఈ తరహా జర్నలిజానికి వైజ్ టీవీ రాములమ్మగారు కూడా ఒక ప్రతినిధిలా కనిపిస్తారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి ‘పాకీ’ అంటూ ఆవిడ మాట్లాడిన సందర్భంలో ఆ పదానికి ఉన్న సామాజిక అర్థం గురించి కాస్తైనా తెలుసుకొని ఉంటే బాగుండేది. మైక్ పట్టుకున్నవాళ్లకు పదాల బరువు తెలియకపోతే సమాజంలో విషం ఎలా పాకుతుందో అర్థం చేసుకోవడం కూడా అవసరం.

ఇక ఏ ఘటన జరిగినా చివరకు పాకిస్తాన్, ముస్లింలు, దేశద్రోహం అనే మూడు మూలల చుట్టూనే కథనాలను తిప్పడం కూడా ఈ తరహా యూట్యూబ్ రాజకీయాల ప్రత్యేకతగా మారిపోయింది. ప్రజల భయాలను, కోపాలను, అనుమానాలను కంటెంట్‌గా మార్చుకొని దేశభక్తి పేరుతో కొత్త మార్కెట్ తయారు చేయడం ఇప్పుడు చాలా సులభమైన వ్యాపార మోడల్ అయిపోయింది.

ఇక ఇటీవల అభిషేక్ శర్మ ఘటనలో ఓ మహిళ అతని చేతిని లాగిన విషయంపై రాములమ్మ స్పందించారు. ఒక మహిళా క్రికెటర్‌ను పురుషుడు ఇలా లాగి ఉంటే దేశం మొత్తం కదిలిపోయేదని పోలికలు తీసుకువచ్చారు. నిజానికి ఇక్కడ ఆవిడ ప్రశ్నించాల్సింది చట్టాలను..! అవును..! చట్టాల్లో జెండర్ న్యూట్రాలిటీ లేనప్పుడు, అసలు మగాళ్లపై రే*ప్ జరిగినా శిక్షించే చట్టమే లేనప్పుడు ఆవిడ ప్రశ్నించాల్సింది ఆ చట్టాలను తెచ్చినవారిని కదా..! ఈ కొత్త బీఎన్‌ఎస్‌ చట్టాలను రూపొందించింది ఎవరో ఆమెకు తెలియదా?

ఇదే సమయంలో తులసి చందు లాంటి జర్నలిస్టులు ఫీల్డ్‌లో తిరిగి డాక్యుమెంట్లు, గ్రౌండ్ రిపోర్టులు, ప్రజల సమస్యలతో కథనాలు తీసుకొస్తుంటే వారిపైనే సెటైర్లు వేయడం కూడా రాములమ్మకే చెల్లింది. ఫీల్డ్‌లో ఎవరైనా మంచి చేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే అది కూడా కొందరికి ఇబ్బందిగానే కనిపిస్తోంది. ఒకరు సమాచారాన్ని వెతుకుతుంటే ఇంకొకరు శత్రువులను వెతుకుతున్నారు. ఒకరు నిజాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకొకరు కోపాన్ని తయారు చేస్తున్నారు. చివరికి యూట్యూబ్ స్టూడియోలు వార్తల కేంద్రాలా లేక రాజకీయ ఐటీ సెల్‌లా అన్న సందేహం వచ్చే పరిస్థితిని ఈ తరహా డిజిటల్ జర్నలిజమే తీసుకొచ్చింది. ఇందులో కేవలం ఒక్కరో, ముగ్గురో లేరు చాలామందే ఉన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మతం కోసమో, కులం కోసమో, పార్టీ కోసమో టీవీ స్టూడియోల్లో యుద్ధాలు చేస్తూ కూర్చున్న ఈ జర్నలిజం చివరికి సమాజాన్ని ప్రశ్నించే జర్నలిజంగా కాకుండా.. సమాజాన్నే విభజించే ప్రచార యంత్రాంగంగా మారిపోవడమే అసలు విషాదం.

ALSO READ: పనిచేసేవాడి చేతికి బొచ్చే…భజన చేసేవాడికి బిర్యానీ..! మీడియాలో కుల కంపు!

ALSO READ: జర్నలిస్టు విలువలను మంటగలుపుతున్న ‘అతి’వాద యాంకరింగ్‌!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *