Menu

Game Changer: అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు ప్రేక్షకులను ముంచాడు.. గేమ్‌ ఛాంజెర్‌ సినిమా టికెట్‌ రెట్ల పెంపుపై రేవంత్‌ షాక్!

Praja Dhwani Desk 1 year ago
ram charan movie game changer

డిసెంబర్‌ 21, 2024.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) సినిమా ఇండస్ట్రీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సంధ్యాథియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం, ఈ కేసులో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఏ1 నిందితుడిగా ఉండడం పట్ల రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ను విమర్శిస్తూనే ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇకపై సినిమా టికెట్ల రెట్లు పెంచేది లేదని.. బెనిఫిట్‌ షోలకు అనుమతి ఉండదని బలగుద్ది చెప్పారు. ఆ తర్వాత నిర్మాత దిల్‌ రాజు, పలువురు నటులు, సినీ పెద్దలు రేవంత్‌ను కలిసి టికెట్ల రెట్ల విషయంపై మరోసారి ఆలోచించాలని రేవంత్‌ని రిక్వెస్ట్ చేశారు. అయినా అసెంబ్లీలో చెప్పిందే ఫైనల్‌ అని రేవంత్‌ కుండబద్దలు కొట్టారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి. అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేశాడు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా అసెంబ్లీలో, కిమ్స్ ఆసుపత్రి బయట ప్రెస్ మీట్ లో . తెలంగాణ ఇక బెనిఫిట్‌ షోలో ఉండవని, అంతేకాదు సినిమా రిలీజ్‌కి ముందు ప్రదర్శించే షోలను రద్దు చేస్తున్నామని, టికెట్‌ రేట్లు పెంచడం కూడా జరగదని అన్నాడు

https://x.com/KomatireddyKVR/status/1870457974524907989?t=HqXuIb4X96j9wrG31N8yZA&s=19

దీంతో రేవంత్‌ మాట తప్పడు, మడమ తిప్పడని కాంగ్రెస్‌ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. అయితే ఇక్కడే ట్విస్ట్‌..!


సీన్‌ కట్ చేస్తే జనవరి 9, 2025.. రామ్‌ చరణ్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ మూవీకి టికెట్‌ రెట్లను పెంచింది రేవంత్‌ సర్కార్. ఈ మేరకు ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఈ రూల్‌ ప్రకారం జనవరి 10 నుంచి మల్టిప్లెక్స్‌లో టికెట్ ధరలు రూ.400 వరకు పెరిగినట్టు లెక్కా. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.275కి పెరిగింది. అంటే మల్టిప్లెక్స్‌లపై రూ.150, సింగిల్‌ స్క్రీన్లపై రూ.100 పెరిగినట్టు అవుతుంది. ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయిలో టికెట్ రెట్లు పెంపు మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన సలార్, కల్కి 2898 AD లాంటి సినిమాలకు టికెట్ ధరలు రూ400 నుంచి రూ.600 మధ్య విక్రయించారు. ఇలా ప్రభుత్వాలు టికెట్ల రెట్లను పెంచడం అభిమానుల జేబుకు చిల్లు పెడుతుందన్న విమర్శలున్నాయి.

అటు బెనిఫిట్‌ షో లేదని చెబుతూనే తెల్లవారుజామున నాలుగు గంటల షోకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా విస్మయాన్ని కలిగిస్తోంది. అన్ని మాటలు చెప్పిన రేవంత్‌ రెడ్డి చివరకు సినిమా పెద్దలకు తలొగ్గాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: డేటింగ్‌ కోచ్‌లు.. లక్షలు సంపాదిస్తున్నారు.. పురుషులకు మాత్రమే..!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *