Menu

Bulldozer Politics: ఆటవీకం.. అనుచితం.. అర్థరహితం.. అదే బుల్డొజర్‌ రాజకీయం!

Tri Ten B

Madhya Pradesh High Court raps bulldozer action: పవన్‌కల్యాణ్‌ నటించిన బాలు సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ‘నిర్మించడం కష్టం..కూల్చడం తేలిక’ అని. ఇది చాలా మంచి డైలాగ్‌. హీరోయిన్‌ హీరోపై కోపంతో మొబైల్‌ను ముక్కలుముక్కలు చేస్తే పవన్‌ శ్రేయాకు ఈ డైలాగ్‌ చెబుతాడు. కనీసం ఈ సినిమాను యోగి ఆధిత్యనాథ్‌ చూసి ఉండి ఉంటే బాగుండేది. ఎక్కడో ఎవడో తప్పు చేస్తే వాడి ఇంటిని కూల్చే అర్థరహీతమైన సంప్రాదాయాన్ని మొదలుపెట్టాడు ఈ యూపీ సీఎం. ఆయన్ను చూసి మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు సైతం అదే దారిలో నిడిచారు. తప్పు చేశారని అనిపిస్తే చాలు.. ఆ సంబంధిత వ్యక్తి ఇంటిని కూల్చుడే పని. ఇదేదో ఘనకార్యమైనట్టు పనికిమాలిన ఎలివేషన్లతో వ్యూస్‌ తెచ్చుకునే పలు మీడియా సంస్థలు బుల్డొజర్‌ పాలిటిక్స్‌ను సమర్థించాయి. గతేడాది నుంచి ఈ చర్యల విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా.. తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు(MadyaPradesh High Court) ఏకిపడేసినా భజనసముహానికి మాత్రం ఇల్లు, ప్రాపర్టీ కూల్చుడు ఇంకా సబబే అనిపిస్తోందట.. అంధత్వం ఊరికే పోదు కదా!

ఇందులో ఎక్కడా లాజిక్కు లేదు.. ఆటవీకం తప్ప:

నేరగాళ్ల ఇల్లు కూల్చుడు గురించి ఒక ఎగ్జాంపుల్‌ చెప్పుకుందాం. నలుగురు ఉండే ఓ ఇంట్లో ఓ అబ్బాయి ఏదో తప్పు చేశాడనుకుందాం. ఆ తప్పుకు ఇంట్లో వారికి ఎలాంటి సంబంధం లేదనుకుందాం. లోకల్‌ అధికారులు అప్పుడు ఇంట్లోకి వచ్చి మీరంతా బయటకు పోండి ఇల్లు కూల్చేస్తామని చెబితే ఎలా అనిపిస్తుంది? కనీసం నోటిసులు కూడా ఇవ్వరు. అదేంటో వచ్చి కూల్చిపడేస్తారు. ఆ ఇల్లు ఎవరు కట్టించారో.. ఎంత కష్టపడి కట్టించారో అనవసరం. ఇలా తప్పు చేసిన వారికి చెందిన ఇళ్లను కూల్చుకుంటే పోతే ఇండియాలో ఆ భవనాల తాలుకు రాళ్లు, రప్పలే మిగులుతాయి. ఇక్కడ ఇంకో విడ్డూరమైన విషయం ఉంది. సంబంధిత వ్యక్తి నేరం చేసినట్టు నిరూపణ కాకుండానే పెద్దరాయుడు తరహా జడ్జిమెంట్లు పాస్‌ చేస్తూ ఇల్లు కూల్చుతున్నారు.

ఈ రూల్‌ ధర్మశాస్త్రాల్లో ఉందా?

ఒకవేళ నేరమే చేశాడనుకుందాం.. అందుకు ఇంట్లో వారందరిని శిక్షిస్తారా? ఇదేం న్యాయం..! అవునులే ధర్మాన్ని గుడ్డిగా నమ్మేవాడికి న్యాయఅన్యాయాలతో సంబంధమేముంటుంది! అసలు నేరాలకు ఇల్లు, ప్రాపర్టీలు కూల్చమని ఏ చట్టం చెబుతోంది? అక్రమనిర్మాణాలను కూల్చాలన్న నియమాలు ఉన్నాయి కానీ.. నేరం చేసిన వాళ్ల ఆస్తి తగలబెట్టాలన్న రూల్‌ ఎక్కడుంది? అందుకే ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు త్వరతగిన విచారిస్తోంది. అయినా ఏం లాభం.. చట్టాలను చుట్టాలుగా చేసుకునే రాజకీయ పార్టీలకు ఇవేవీ పట్టవు. ముఖ్యంగా బీజేపీ, దాని అనుకూల పార్టీలకు ఇలాంటివి చర్యలు వ్యాలిడ్‌. వారి కొంప ఎవడో కూల్చితే ఆ నొప్పి తెలియవచ్చు.. ఆ రోజులు దగ్గరలోనే ఉండొచ్చు.. రోజులు ఎప్పుడూ ఒకరివి కాదు..ఈ నిజం తెలుసుకుంటే కూల్చుడ్లు ఉండవు..!

Also Read: వెర్రితనం.. ఇవేం నంబర్‌పేట్లు బాబోయ్.. ఎవడూ తగ్గట్లేదుగా!

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *