Menu

SSC JOBS: మీ కలల ఉద్యోగానికి గోల్డెన్ చాన్స్.. SSCలో 7,948 పోస్టుల భర్తీ!

Archana 2 months ago
latest jobs sss multitasking halwalder

యువతకు శుభవార్త..SSC తాత్కాలిక ఖాళీల జాబితాను విడుదల చేసింది. అసలు SSC అంటే ఏంటి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అన్ని మినిస్ట్రీలు..డిపార్ట్మెంట్లలో గ్రౌండ్ లెవల్ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ చేసే ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు 2025కి MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టులకు టెంటటివ్ వేకెన్సీలు ప్రకటించారు. మొత్తం 7,948 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఇది టెంటటివ్ అంటే డిపార్ట్మెంట్లు మార్చవచ్చు కానీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవకాశాలు మీ ముందుకు వచ్చాయి.

ఏ వయసు వారికి?

మరోవైపు MTS పోస్టులు రెండు ఏజ్ గ్రూపుల్లో ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు వాళ్లకు 6,078 పోస్టులు, 18 నుంచి 27 సంవత్సరాల వాళ్లకు 732 పోస్టులు. మొత్తం MTSకి 6,810 సీట్లు. మరోవైపు హవాల్దార్ పోస్టులు CBIC, CBN యూనిట్లలో 1,138 ఉన్నాయి. ఇవి కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కాటిక్స్ లాంటి డిపార్ట్మెంట్లలో ఉంటాయి. ఇక్కడ పోస్టులు ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం, కానీ మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి.

ఎన్నిపోస్టులున్నాయి?

ఇక కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే యూన్‌రిజర్వ్డ్‌కి 3,679 సీట్లు, OBCకి 1,973, SCకి 859, STకి 621, EWSకి 816 పోస్టులు. ప్రత్యేకంగా PwD కేటగిరీల్లో 310 వేకెన్సీలు ఉన్నాయి. ఓపెన్ హ్యాండిక్యాప్, హెయరింగ్ హ్యాండిక్యాప్, విజువల్ హ్యాండిక్యాప్ వంటివి. ఎక్స్ సర్వీస్‌మెన్‌కి 731 పోస్టులు రిజర్వ్ అయ్యాయి. అంటే అన్ని కులాలు, కేటగిరీల వాళ్లకు అవకాశం ఉంది. మీరు ఏ కేటగిరీకి చెందితే మీ షేర్ ఖచ్చితంగా ఉంది.

మరోవైపు రీజియన్ వైజ్ చూస్తే నార్తర్న్ రీజియన్ టాప్‌లో ఉంది. ఢిల్లీలో మాత్రమే 1,961 MTS పోస్టులు. వెస్టర్న్ రీజియన్‌లో మహారాష్ట్రకి 732 వేకెన్సీలు. ఈస్టర్న్ రీజియన్‌లో వెస్ట్ బెంగాల్‌కి 542 పోస్టులు. సౌతర్న్ రీజియన్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ కలిపి పెద్ద షేర్. ముంబై, చెన్నై, కోల్‌కతా, లక్నో వంటి సిటీల్లో హవాల్దార్ పోస్టులు మరిన్ని. మీ స్టేట్‌లో ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి, SSC వెబ్‌సైట్‌లో పూర్తి PDF అందుబాటులో ఉంది.

ALSO READ: ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు కట్‌.. ఎంతమందిని తొలగించారంటే?

ఇప్పుడు ఎవరు అప్లై చేయవచ్చో చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌గా 10వ తరగతి పాస్ అవ్వాలి.ఏజ్ లిమిట్ MTSకి 18 నుంచి 25 లేదా 27 సంవత్సరాలు, రిలాక్సేషన్‌లు SC/STకి 5 సంవత్సరాలు, OBCకి 3 సంవత్సరాలు ఉన్నాయి. హవాల్దార్‌కి అదనంగా ఫిజికల్ స్టాండర్డ్స్, మగవాళ్లు 157.5 సెం.మీ. హైట్, మహిళలు 152 సెం.మీ., చెస్ట్ మెజర్మెంట్స్ వంటివి. నేటివ్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే సులభం.

ఫీజు ఎంత?

ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్ మాత్రమే ssc.gov.in వెబ్‌సైట్‌లో. రిజిస్ట్రేషన్ జూన్ 2025లో స్టార్ట్ అయింది. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ చెక్ చేయండి. ఫీజు జనరల్‌కి 100 రూపాయలు SC/ST/PwDకి ఫ్రీ. డాక్యుమెంట్స్ స్కాన్స్ చేసి అప్లై చేయాలి. డెడ్‌లైన్ మిస్ చేయకండి. ఎందుకంటే ఈ అవకాశం మిస్ అయితే వెయిట్ చేయాలి.

మరోవైపు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే టియర్ 1 సెషన్ 1, 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 90 క్వష్చన్స్, 270 మార్కులు, రీజనింగ్, న్యూమరికల్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్. నెగెటివ్ మార్కింగ్ ఉంది, కానీ ప్రాక్టీస్ చేస్తే స్కోర్ చేయవచ్చు. MTSకి ఇక్కడితో డొక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ హవాల్దార్‌కి PET, PST కూడా. PETలో మగవాళ్లు 1.6 కి.మీ. 15 నిమిషాల్లో, మహిళలు 1 కి.మీ. 20 నిమిషాల్లో వాక్ చేయాలి. ఈ 7,948 వేకెన్సీలు మీ కలల ఉద్యోగానికి గోల్డెన్ చాన్స్. ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. SSC వెబ్‌సైట్‌లో PDF డౌన్‌లోడ్ చేసి మీ రీజియన్ డీటెయిల్స్ చూడండి.

ALSO READ: టీచర్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌..! CTET నుంచి కీలక అప్‌డేట్.. ముఖ్యమైన తేదీలివే!


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *