Menu

Solar Storms: సౌర తుఫాన్లతో ఇంటర్నెట్‌ సర్వీసులు బంద్.. ఎలాన్‌ మస్క్‌కు భారీ దెబ్బ!

Tri Ten B 3 months ago
solar storms in india

ఇదిగో… ఇప్పుడు మనం వినబోయే విషయం నిజంగా ఆశ్చర్యపరిచే అంశం..! టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా ప్రకృతి ముందు అది ఎంత బలహీనమో తెలుసుకునే సమయం ఇదే. ఎన్నో వేల కోట్ల ఖర్చుతో భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్‌(Satellites)లు, ఒక్కసారి సూర్యుడి కోపానికి గురైతే ఏం జరుగుతుందో తెలుసా..? ఎలాన్ మస్క్(elon musk) బిల్డప్ చేసిన స్టార్‌లింక్(star link) శాటిలైట్‌లైనా.. ఇతర బడాబాబులు అంతరిక్షంలో నిర్మించిన శాటిలైట్‌లైనా ఏదో ఒక రోజు భస్మంకాక తప్పదండి..! ఎందుకంటే ఇప్పుడా శాటిలైట్లు భూమి వైపు జారిపోతున్నాయట. నిజానికి మనం సూర్యుడిని జీవానికి కారణమని మాత్రమే భావిస్తాం. కానీ అదే సూర్యుడు మనకు కనిపించని ఒక కొత్త మర్మాన్ని దాచుకుంటున్నాడు. అంతరిక్షంలో మెల్లగా కదిలే గాలుల మధ్య పుట్టే అజ్ఞాత తుపాన్లు మన జీవితాలను చిన్నాభిన్నం చేసేందుకు రెడీ అవుతున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది? శాటిలైట్లకు వచ్చిన ముప్పెంటి? సౌర తుఫాన్లతో పొంచి ఉన్న ప్రమాదమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రమాదమేంటి?

సూర్యుడి కాంతి వెనుక దాగి ఉన్న ఈ అంతరిక్ష తుపానులు మన సాంకేతిక ప్రపంచాన్ని సవాలు చేస్తున్నాయి. ఇవి కనిపించవు, కానీ వాటి ప్రభావం భూమి గుండెల్లోకి చేరుతుంది. ఈ ప్లాస్మా ప్రవాహాలు భూమి వైపు గుట్టుగా ప్రయాణిస్తున్నాయి. ప్రతి క్షణం అవి మన కమ్యూనికేషన్ వ్యవస్థల మధ్యలో దారి వెతుకుతున్నాయి. ఇక సూర్యుడు ప్రతి క్షణం తన గుండె నుంచి ఎగసే వేడి గాలులను అంతరిక్షంలోకి పంపిస్తూనే ఉంటాడు. ఆ గాలులు, ఆ విద్యుత్‌ కణాలు, భూమిని తాకే దారిలో ప్రయాణిస్తాయి. శాస్త్రవేత్తలు దీన్ని సౌర గాలి అని పిలుస్తారు. కానీ కొన్నిసార్లు ఆ సౌర గాలి అల్లకల్లోలమవుతుంది. సూర్యుడి ఉపరితలంపై జరిగే మహా విస్ఫోటనాలు, ప్లాస్మా మేఘాలు, అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి. వాటిని కొరొనల్ మాస్ ఎజెక్షన్లు అంటారు. ఈ తుపానులు భూమిని చేరినప్పుడు అవి మన ఉపగ్రహాలను కదిలిస్తాయి.. GPS సంకేతాలను గందరగోళం చేస్తాయి.. విమాన మార్గాలనూ మార్చేస్తాయి.

సైంటిస్టులు ఏం గుర్తించారు?

అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో కొత్త రహస్యాన్ని కనుగొన్నారు. సౌర గాలి మధ్యలో మరింత ప్రమాదకరమైన తుపానులు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇవి అంతరిక్ష తుపానులు.. సూర్యుడి ఉధృతి నుంచి విడిపోయిన ప్లాస్మా చక్రాలు. ఇవి సౌర తుపానుల కంటే చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి గుండెల్లో ఉన్న చుంబక శక్తి భూమి రక్షణ కవచాన్ని దెబ్బతీయగలదు. అవి కంటికి కనిపించవు, కానీ వాటి ప్రతి చలనం ఒక నిశ్శబ్ద ప్రమాదానికి సంకేతం. ఇక మెల్లగా సూర్యుని శ్వాస భూమివైపు కదులుతోంది. ఆ గాలుల్లో దాగి ఉన్న ఈ అంతరిక్ష తుపానులు ఏ దిశలో తిరుగుతాయో, ఎప్పుడు దాడి చేస్తాయో ఎవరికీ తెలియదు.

శాటిలైట్లు కుప్పకూలతాయా?

ఇక ఇదంతా 2020లోనే మొదలైంది. అప్పటి నుంచి ఎండవేడి బాగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి సూర్యుడి 11 సంవత్సరాల సైకిల్‌లో మాక్సిమం స్టేజ్‌కి చేరాడు. ఈ సమయంలో సూర్యుడి నుంచి బయటకు వస్తున్న మెగ్నటిక్ తుఫాన్లు భూమి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీని ప్రభావంతో వాతావరణం వేడెక్కి పైభాగం విస్తరించిపోతోంది. ఈ వేడి వల్ల శాటిలైట్‌లు ఎక్కడో అంతరిక్షంలో కాదు.. భూమికి దగ్గరగా ఉండే వాతావరణంలోకి వచ్చేస్తున్నాయి. దీని కారణంగా వాటిపై డ్రాగ్ పెరిగిపోతుంది. అంటే.. గాలి ఒత్తిడితో శాటిలైట్‌లు వేగంగా తన స్పీడ్ కోల్పోయి భూమి వైపు జారిపోతున్నాయి. సాధారణంగా ఒక స్టార్‌లింక్ శాటిలైట్ దాదాపు 5ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు సౌర తుఫాన్ల ప్రభావంతో దాని జీవితం 10 నుంచి 12 రోజులు ముందుగానే ముగుస్తోంది.

అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. శాటిలైట్‌లు ఇలా భూమికి దూసుకొస్తున్న వేగం సాధారణ రీఎంట్రీ కన్నా ఎక్కువగా ఉంటోంది. దీని కారణంగా మిగిలిన శాటిలైట్ భాగాలు పూర్తిగా కాలిపోవాలి కానీ… కొన్నిసార్లు అవి పూర్తిగా కాలిపోకుండా భూమిని తాకే ప్రమాదం ఏర్పడుతోంది. నిజంగా 2024లో కెనడాలోని చువాన్ అనే ప్రాంతంలో 5.5 పౌండ్ల బరువున్న స్టార్‌లింక్ శాటిలైట్ భాగం పడిపోయింది. అదృష్టవశాత్తూ అది ఎవరినీ గాయపరచలేదు కానీ.. ఇది భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందనే టెన్షన్ ఉంది. ఇంకా ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. ఇవన్నీ ఒక ఎత్తయితే… భూమి చుట్టూ ఇప్పటికే వందల సంఖ్యలో శాటిలైట్‌లు తిరుగుతున్నాయి. అంతరిక్ష రవాణా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్‌కి గురవుతోంది. ఒకదానికొకటి ఢీకొట్టే ప్రమాదం ఎక్కువైపోతోంది. ఎందుకంటే.. ఇవి ముందుగా తయారుచేసిన మార్గాల్లో తిరుగుతుంటాయి. కానీ సౌర తుఫాన్లు కారణంగా అవి అనూహ్యంగా తమ దిశను మార్చుకునే అవకాశముంది. దీంతో శాటిలైట్‌లు ఒకదానికొకటి ఢీకొనే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

ఇక ఈ అంతరిక్ష సౌర తుపానులు భూమిని ప్రభావితం చేయడం గతంలోనూ జరిగింది. 2024 మేలో అంతరిక్షంలో పుట్టిన ఒక తుపాను భూమిని తాకింది. నాడు విమానాలు దారి మళ్లించబడ్డాయి.. ఉపగ్రహాలు స్థిరత్వం కోల్పోయాయి.. జీపీఎస్ పరికరాలు మౌనమయ్యాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం లక్షల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంది. మనకు ఆ క్షణం తెలిసింది, మనం చూస్తున్న సూర్యుడు మాత్రమే కాదు, మనం చూడలేని అంతరిక్ష తుపానులు కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిసి వచ్చింది. ఆ ఘటన తర్వాత మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లతో కొత్త నమూనాలు తయారుచేశారు. ఆ నమూనాలు ఒక దృశ్యాన్ని చూపించాయి.

సూర్యుడు కొన్నిసార్లు తన లోపల ఉగ్రంగా పేలిపోతాడు. అప్పుడు భారీగా వేడి గాలులు, ప్లాస్మా అని పిలిచే విద్యుత్‌భరిత పదార్థం బయటకు ఎగిరిపోతుంది. ఇక ఆ వేడి మేఘాలు అంతరిక్షంలో ముందుకు దూసుకుపోతుంటే, వాటి వెనుక గాలులు కలగలిసి తిరుగుతూ చిన్న తుఫానులను తయారు చేస్తాయి. ఆ పెద్ద తుపానులు దూసుకెళ్తున్నప్పుడు, వాటి వెనుక చిన్న చిన్న తిప్పలు పుడతాయి. కొన్నిసార్లు అవి కాసేపటికే చెదరిపోతాయి.. కానీ మరికొన్ని మరింత బలంగా మారుతాయి. అవి వేగంగా కదిలే సౌర గాలులతో ఢీకొని, అంతరిక్ష తుపానుల్లా తిరుగుతూ భూమివైపు కదలడం మొదలుపెడతాయి.

మరింత ముప్పు తప్పదా?

ప్రస్తుతం మనం ఆధారపడే సౌర పరిశీలన వ్యవస్థ.. భూమి, సూర్యుని మధ్య ఉన్న లాగ్రాంజ్ పాయింట్-L1 వద్ద ఉన్న రెండు ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంది. అవి సూర్యుడిని ఎదురుగా చూసే ఒకే దిశలో ఉండటంతో, బయట జరిగే తుపానులను గుర్తించలేవు. ఇది చాలా పెద్ద సమస్య. దీనికి పరిష్కారం కోసం సైంటిస్టులు చాలా కష్టపడుతున్నారు. ఫలితం దక్కుతుందో లేదో తెలియదు కానీ.. మొత్తం ఇంటర్నెట్‌తో పాటు మన జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసే సౌర తుఫాన్లతో భవిష్యత్‌లో మరింత ముప్పు తప్పదని మాత్రం చెప్పవచ్చు. ఇలా సూర్యుడి అజ్ఞాత తుపానులు మన సాంకేతిక వ్యవస్థలను ఎంత సులభంగా దెబ్బతియ్యగలవో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే భవిష్యత్తులో అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడం, శాటిలైట్‌ రక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం మనకు తప్పనిసరిగా మారనుందండి..!

ALSO READ: మన తోటి ఉద్యోగిని బానిసగా కాదు… అవకాశమిచ్చి కూర్చొనిద్దాం…!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *