Menu

FIITJEE: శవాలపై కూడా మార్కులు పీల్చే జలగలు.. వీళ్ళా మన దేశ భవిష్యత్తును తయారు చేసేది?

Tri Ten B
fiitjee advertisement

‘100కి 100 రావాలి.. 99 వచ్చినా మీ పిల్లలు వేస్ట్‌..! నాలుగో తరగతి నుంచే ఐఐటీ క్లాసులు చెబుతాం.. ఐఐటీ చదవకపోతే జీవితమే లేదు.. ఐఐటీ ర్యాంక్ రాకపోతే మీ పిల్లలు ఎందుకు పనికిరారు..’ ఈ మాటలు వింటుంటే బ్లడ్ బాయిల్ అవుతుందా? లేదా ఇదంతా నిజంలా కనిపిస్తుందా? మీకు ఇవి నిజాలుగా అనిపిస్తే మీరు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం. బ్లడ్ బాయిల్ అవుతుంటే జనజీవనానికి దూరంగా అడవుల్లో క్రూరమృగాల మధ్య బతకడం మంచిది. ఎందుకంటే ఈ నారాయణ, చైతన్య, FIITJEE లాంటి సంస్థలు సమాజంలో తిష్టవేసుకొని ఉన్నాయి. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అమూల్యమైన విద్యను భ్రష్టు పట్టిస్తున్నాయి. మార్కుల వెర్రితో, ర్యాంకుల పిచ్చితో విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. వీటి మధ్య బతకాలంటే ఉగ్రసంస్థలతో బతుకుతున్నట్టు అనిపిస్తుంది.

‘ఇంతటి మాటలా? ఉగ్రసంస్థలతో పోలికా’ అని ఆశ్చర్యపోవద్దు. విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి మించిన పాపం ఈ భూమండలంపై ఇంకోటి లేదు.

100కి 100.. రాకపోతే దండగ:
FIITJEE అని ఒక కోచింగ్‌ సంస్థ ఉంది. మన హైదరాబాద్‌తో పాటు దేశంలో చాలా చోట్ల దీనికి బ్రాంచులు ఉన్నాయి. IIT-JEEకి కోచింగ్‌ ఇస్తారు. నారాయణ, చైతన్య లాగే ఉంటుంది. స్కూల్ స్టేజీ నుంచే ఐఐటి అంటారు. ఈ సంస్థలో జాయిన్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌లో మార్కులు ఆధారంగా మీ పిల్లల ఫీజు ఎంతో డిసైడ్ చేస్తారు. ఎక్కువ మార్కులు వస్తే డిస్కౌంట్లు కూడా ఇస్తారు. భలే ఉంది బిజినెస్ కాదు. ఇంత విచ్చలవిడి వ్యాపారాన్ని తల్లిదండ్రులు నమ్మడం నిజంగా సిగ్గుచేటు. చదువుకోని తల్లిదండ్రులంటే వారికి తెలియదని జాలి పడవచ్చు. వారిని మాయమాటలు చెప్పి ఈ ఏజెన్సీలు మోసం చేశాయని బాధపడొచ్చు. కానీ అన్ని తెలిసిన పేరెంట్స్ కూడా కేవలం ఐఐటీ అనే పదాన్ని పరువుగా భావించి ఇలాంటి నీచమైన సంస్థల్లో పిల్లల్ని చేర్చి వారి జీవితాలని అంధకారంలోకి తోస్తున్నారు. 100కి 100 మార్కులు రాకపోతే వేస్ట్ అంటే ఒకే ఒక్క మాట మీ పిల్లల జీవితాంతం వెంటాడుతుంది.. వారిపై వారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. లక్షల్లో ఒకడు ర్యాంక్ తెచ్చుకుంటాడు. మిగిలిన 99,999 మంది జీవితాలు బుగ్గిపాలే.


విద్యాసంస్థలు కావివి.. నరకానికి రూట్లు:
ఇటీవలి FIITJEE ఇచ్చిన ఓ యాడ్‌ చూస్తే వీరి ఉగ్రబుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. FIITJEE నుంచి వేరే కోచింగ్‌ సెంటర్‌కు ఓ బాలికకు 100కు 100NTA వెళ్లి రాలేదంట.. 99.99NTA వచ్చిందంట. తమ దగ్గర చదివితే 100కి 100 స్కోరు వచ్చేదంట. ఇది పత్రికల్లో FIITJEE నుంచి వచ్చిన ఓ నీతిమాలిన ప్రకటన. కోటాలో విద్యార్థుల సూలు జరగడం గురించి స్పెషల్‌గా FIITJEE తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. విద్యార్థుల సూసైడ్లను కూడా తమ వ్యాపారానికి వాడుకోని అసలు సమస్యను సైడ్ ట్రాక్ చేసే పని చేసింది. ఓ మనిషిని శారీరంగా చంపడం, మానసికంగా చంపడం రెండూ నేరాలే. ఇందులో కోటాకు FIITJEE ఏం తక్కువ కాదు. ఇవన్ని కమిటీ హత్యలే. ధనదాహంతో విద్యార్థులను చిత్రహింసలు పెట్టి, టీచర్లను నరకంలోకి తోసి లక్షల్లో ఉండే క్లాసుల్లో ఒకరిద్దరు ర్యాంకులు చూపించి డబ్బులు దోచుకోని బిల్డింగ్‌లు కట్టుకునే ఈ ఉగ్రసంస్థలు ఎప్పుడూ మారుతాయో ఎవడూ చెప్పలేదు. అటు ప్రభుత్వాలు కూడా నిద్రపోతూనే ఉంటాయి.. ఎందుకంటే వారికి అందాల్సినవి అందుతూనే ఉంటాయి. పేపర్ ప్రకటనలకే తప్పు చర్యల్లో చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు దేశమంతా ఉన్నాయి. అందుకే ఈ విద్యా(లేని) ఇలాంటి బరితెగింపు యాడ్లు ఇస్తూనే ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఎలక్టోరల్ బాండ్ల ఊసే లేదు.. బీజేపీ కోసం మీడియా మౌన వ్రతం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *