క్రోమా(Croma) బ్లాక్ ఫ్రైడే సేల్(Black Friday Sale)లో ఐఫోన్-17పై వచ్చిన ఆఫర్ భారత్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ ధర రూ.82,900 ఉన్న ఈ ఫోన్‌ను కస్టమర్లు రూ.45,900కి పొందగలగటం ఈ సీజన్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన డీల్‌గా నిలిచింది. ఈ ధర పడిపోవడం మూడు ప్రయోజనాల కలయిక వల్ల సాధ్యమైంది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ రూ.1,000 లభిస్తుంది. పాత ఫోన్ ఇచ్చే ఎక్స్‌ఛేంజ్ విలువ గరిష్టంగా రూ.29,000 వరకు వస్తుంది. అదనంగా ఫిక్స్‌డ్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.7,000 అందిస్తుంది. ఈ మూడు విలువలు వరుసగా తగ్గుతూ చివరకు మొత్తం ధర రూ.45,900కి చేరుతుంది. కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ప్రత్యేకంగా బాగా మెయింటెయిన్ చేసిన పాత ఫోన్లు ఉన్న వారికి ఈ ఆఫర్ మరింత ప్రయోజనకరం. ఈ ఆఫర్ పూర్తిగా క్రోమా స్టోర్లలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది రూ.30 నవంబర్ 2025 వరకు అమలులో ఉంటుంది.
ఛార్జ్ స్పీడ్.. ఫోన్ అదుర్స్:
ఐఫోన్ 17 ఫీచర్ల విషయానికి వస్తే ఈ మోడల్ అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే స్క్రోలింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వీడియోలు గేమ్స్ సోషల్ మీడియా బ్రౌజింగ్ అన్ని స్మూత్‌గా కనిపిస్తాయి. ఏ19 చిప్ పనితీరును పెంచి రోజువారీ పనులు నుంచి గేమింగ్ వరకు ప్రతి విషయంలో స్పీడ్‌గా అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 18MPకి అప్‌గ్రేడ్ అయ్యింది. సెంటర్ స్టేజ్ ఫీచర్ వీడియో కాల్స్ సమయంలో యూజర్‌ను ఫ్రేమ్‌లో సరిగ్గా సెట్ చేస్తుంది. వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరా అలాగే 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఫొటోలు తీయడంలో మంచి డిటైల్ కలర్స్ అందుతాయి. బ్యాటరీ సెగ్మెంట్‌లో కూడా మెరుగుదల ఉంది. 40W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది.
ఈ ఫీచర్లు కలిసి ఐఫోన్-17ను ఇప్పటికే బలమైన ఎంపికగా మారుస్తున్నాయి. ఇప్పుడు క్రోమా ఇచ్చిన ఈ భారీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌తో ఈ ఫోన్ మరింత అందుబాటులోకి వచ్చింది. మంచి కండీషన్‌లో ఉన్న పాత ఫోన్ ఉంటే ఈ డీల్ ద్వారా చాలా మొత్తం ఆదా చేసుకోవచ్చు. అత్యాధునిక ఐఫోన్‌ను తక్కువ ధరలో పొందాలని ఆశిస్తున్న యూజర్ల కోసం ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ALSO READ: ఇల్లు అలకగానే పండగ కాదు.. కోచ్ అవ్వగానే విజయాలు రావు! సొంతగడ్డపైనే చెత్త పర్ఫామెన్స్!!

Apple iPhone offers: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. లెటెస్ట్ వెర్షన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
iPhone Offer: 50 వేలకే కొత్త ఐఫోన్!! అదిరిపోయే ఆఫర్లు, సూపర్ పెర్ఫార్మెన్స్ Flagship మొబైల్స్!