Menu

Cine Stars: ఎవరిచ్చారీ బిరుదులు..? గ్లోబల్ స్టార్.. ఐకాన్‌ స్టార్? మెగా పీఆర్‌ మాములుగా లేదుగా!

Tri Ten B
mega pwer global star ram charan

రాంచరణ్‌ బర్త్‌డే సందర్భంగా సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ‘గ్లోబల్‌ స్టార్‌’ పదమే కనిపించింది. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అంతా గ్లోబల్‌ జపమే చేశారు. మొత్తానికి ఈ భూగోళానికి రాంచరణ్‌ను స్టార్ చేశారు. ఇండియా కాకుండా ఇతర దేశాల్లో నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా లాంటి వారికి కూడా ఆమె ఫ్యాన్స్‌ ఇలాంటి బిరుదులు ఇచ్చుకోలేదు. ఒక ఆర్‌ఆర్‌ఆర్‌తో రాంచరణ్‌ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడట. అలా అయితే రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్‌గా ఆయనకు ఆయనే ఫీల్ కావొచ్చు. ఎవరి ఫీలింగ్‌ వారిది.. అయితే ఈ రుద్దుడు ఏంటో అర్థంకావడంలేదు. వందసార్లు వందమంది ఒకటే విషయాన్ని చెబితే 101వ వాడు అదే నిజమాని నమ్ముతాడట. ఇది లోకం తీరు.. ఈ సూత్రాన్ని నమ్ముకునే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఐకాన్‌ స్టార్‌గా మారిపోయాడు. ఐకాన్‌ అన్నది చాలా పెద్ద పదం. మూడక్షరాలే కానీ ఆ పదానికి ఉన్న లెగసీ వేరు. ఇటు రాంచరణ్‌ని కూడా గ్లోబల్‌ స్టార్‌ అంటూ యావత్‌ టాలీవుడ్‌ కీర్తిస్తోంది. అసలు గ్లోబ్‌ అంటే మీనింగ్‌ తెలుసో తెలియదో ఎవరి దగ్గరైనా డిక్షనరీ ఉంటే మెగా అభిమానులకు, వారి మద్దతు కోసం వెంపర్లాడే సినీ ప్రముఖులకు కోరియర్‌ చేస్తే బావుండు!


మెగా పవర్‌ గ్లోబల్‌… తర్వాత ఏంటో:

నటనలో ఎక్కువ తక్కువలు పూర్తిగా వ్యక్తిగతం.. అందరికి ఒకటే టేస్ట్ ఉండదు. రజనీకాంత్‌పై పిచ్చితో కమల్‌ హాసన్‌ని తక్కువ చేసే మాట్లాడే తమిళ సినీ అభిమానులు కూడా ఉంటారు. ఆయనకు నటనే రాదన్నది వారి మాట. ఇది ఫ్యాన్‌ వార్‌లో భాగం. ఒకరిపై ప్రేమ పోటిదారుడుపై ద్వేషంగా మారడం ఈ భూమిపై మానవులకు మాత్రమే ఉన్న అవలక్షణం. అందుకే పోటిపడి ‘స్టార్‌’ బిరుదులు ఇచ్చేసుకుంటారు. ఫ్యాన్స్‌ ఇష్టంతో పిలుచుకోవడం వేరు.. పీఆర్‌ స్టంట్లు చేసి బిరుదులు ఇచ్చుకోవడం వేరు. అమితాబ్‌, మమ్ముటి, కమల్‌, చిరు, రజనీ లాంటివారు తమ కష్టంతోనే బిరుదులు దక్కించుకోని ఉండొచ్చు. అయితే రాంచరణ్‌కు రెండో సినిమాకే మెగా పవర్‌ స్టార్‌ బిరుదు ఇచ్చేశారు. అంటే చిరంజీవి ప్లస్‌ పవన్‌ కల్యాణ్ కాంబో రాంచరణ్‌ అని అభిమానులపై రుద్దే ప్రయత్నం చేశారు. ఇది చిరు, పవన్‌ ఫ్యాన్సే అంగీకరించినప్పుడు సామాన్యులు చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే.


వృక్షానికి కూడా ఈ బిరుదు లేదు పాపం:
వంశ వృక్షానికి ఉండే పండ్లకు అభిమానులు ఇచ్చే విలువ అలాంటిది. ఆ కాయ పుచ్చుదా మంచిదా అన్నది మొత్తం పెరిగిన తర్వాత కదా చూడాల్సింది. పుట్టిన రెండో రోజే ఆ పండును వృక్షంతో పాటు అప్పటికే పండిపోయిన మరో పండుతో పోల్చితే ఎలా? ఈ విజ్ఞత అభిమానులకు లేనప్పుడు మిగిలిన వారు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్‌ అయ్యాడు రాంచరణ్‌. అతని నటనలో మునపటితో పోల్చితే ఎంతో మెరుగయ్యాడన్నది మెజారిటీ సినీ ప్రేమికుల మాట. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఓ క్యాటగీరీలో ఆస్కార్ అవార్డు దక్కింది కాబట్టి గ్లోబల్ స్టార్‌ బిరుదు వారి దృష్టిలో కూడా వ్యాలిడే కావొచ్చు. అతన్ని గ్లోబల్‌ స్టార్‌ అంటే ప్రపంచానికి పోయిదేమీ లేదు కానీ గ్లోబ్‌ మీనింగ్‌ తెలియక ఇదంతా ఆలోచించాల్సి వస్తుందంతే!

Also Read: అభిమానులా? పిచ్చిపట్టిన జనాలా? ఎవరి కోసం ఈ వెర్రితనం? తెలుగు యువత బానిసత్వం

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *