అది 2024 జనవరి 22..
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ రోజు..
దేశమంతా రామ నామస్మరణతో మారుమోగిన రోజు..
కోట్లాది హిందూవుల కల సాకరమైందని బీజేపీ తెగ ప్రచారం చేసిన రోజు…!
రామమందిర నిర్మాణం పేరుతో దశాబ్దాలుగా ఉత్తరాదిన హిందూవుల ఓట్ బ్యాంక్ కొల్లగొట్టిన బీజేపీ మరోసారి అదే రిపీట్ అవుతుందని భావించింది. అందుకే రామ మందిర నిర్మాణాన్ని ట్రంప్ కార్డ్‌గా అటు విశ్లేషకులు సైతం భావించారు. కానీ సీన్ కట్ చేస్తే గుళ్లు, గోపురాలు ఉద్యోగాలు ఇవ్వవని ఉత్తరప్రదేశ్ యువతకు తెలిసివచ్చింది. కడుపు కాలి, ఉద్యోగాలు లేక విధిన పడ్డ ఎంతమంది యువత మోదీపై ఏకంగా యుద్ధమే ప్రకటించాయి. ఇది ఓటు రూపంలో స్పష్టంగా కనిపించింది. ఉత్తరప్రదేశ్ యువత బీజేపీని తన్నితరిమేసినంత పని చేసింది.. ఉద్యోగ కల్పనలో ఘోరంగా విఫలమైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఫలితాలు పెద్ద చెంపపెట్టు. అయోధ్య రామమందిరం కోలువై ఉన్న ఫైజాబాద్‌లోనే బీజేపీ ఓడిపోయిందంటే అక్కడి ప్రజలు బీజేపీని ఎంతలా విస్మరించారో అర్థం చేసుకోవచ్చు!
గుళ్లు కాదు కావాల్సింది.. ఉద్యోగాలు:
ఉత్తరప్రదేశ్‌లో 2019లో 80 లోక్‌సభ స్థానాల్లో 64 గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో కేవలం 36 సీట్లకే పరిమితమైంది. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి యూపీకి ఎన్నో నిధులు వచ్చాయి. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.. ప్రపంచంలో అది పెద్ద క్రికెట్ గ్రౌండ్‌ను కూడా నిర్మించారు. అటు బీజేపీ ఓటు బ్యాంక్ గుడి రామమందిరం కూడా సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందే ప్రారంభోత్సవం చేసుకుంది. ఇదంతా బీజేపీకి భారీగా సీట్లు సంపాదించి పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ యూపీలో పెరిగిపోయిన నిరుద్యోగత రేటు ఆదిత్యనాథ్‌పై వ్యతిరేకతకు కారణమైంది. డిగ్రీలు పూర్తి చేసుకున్నా ఎవరికీ ఎక్కడ ఎలాంటి జాబ్ రాకపోవడం.. అసలు ఎలాంటి జాబ్ క్రియేషనే లేకపోవడం.. ఎంతసేపు మతం మతం అంటూ రాజకీయాలు చేయడం లాంటివి చూస్తూ వచ్చిన యువత బీజేపీకి తగిన బుద్ధి చెప్పింది.
అగ్రకులాల ఓట్లు తప్ప ఏమీ పడలేదు:
బీజేపీ భారీగా సీట్లు కోల్పోవడానికి యువతతో పాటు దళితులు ఒక ప్రధాన కారణం. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. 400 మార్క్‌ను టచ్ చేస్తామంటూ మోదీ పదేపదే ఉత్తరప్రదేశ్ సభల్లో చెప్పుకొచ్చారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీకి పడ్డ దళిత ఓట్లు సమాజ్‌వాది-కాంగ్రెస్ కూటమికి పడ్డాయి. అటు ముస్లింలు ఈసారి కాంగ్రెస్‌ను బలంగా నమ్మారు. ఇటు బీసీలు ఎస్పీవైపు మొగ్గుచూపారు. దీనిబట్టి చూస్తే బీజేపీకి పడిన ఓట్లలో ఎక్కువగా అగ్రకులాల వారివే ఉన్నాయి.
పనిచేయని బుల్డోజర్ పాలిటిక్స్:
నిజానికి గుజరాత్ తరహాలో యూపీకి ఓ మోడల్ తీసుకోద్దామని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది. అందుకే భారీగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఫోకస్ చేసింది. కానీ అదే సమయంలో సామాన్య జనాల కష్టాలను విస్మరించింది. ఇటు మోదీ తర్వాత ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రమోట్ చేస్తూ వచ్చింది. మీడియాను అడ్డం పెట్టుకోని యోగి ఏం చేసినా విపరీతమైన భజన చేసింది. బుల్డోజర్లతో ఇళ్లు, బిల్డింగులు కూల్చిన యోదీ అనాగరిక చర్యలను గ్లోరిఫై చేసింది. కానీ ఇవన్ని బెడిసికొట్టాయి. బుల్డోజర్లతో బీజేపీ అమాయకుల ఇళ్లను కూల్చితే ప్రజలు యోగి సర్కార్ ఓటు బ్యాంకును ఏకంగా గల్లంతే చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించినదాని కంటే దాదాపు 30 సీట్లు తక్కువ రావడంతో దేశంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి దిగజారింది మోదీ టీమ్. దీంతో మోదీ భక్తులకు కోపం కట్టలు తెంచుకుంది. యూపీ ప్రజలను ఇష్టారీతిన తిడుతున్నారు. హిందూవులే హిందూత్వ పార్టీకి వెన్నుపోటు పోడిచారని ఆవేశపడుతున్నారు.
Also Read: మోదీ రాముడా? హనుమంతుడా? లేదా జీససా? సమాధానం ఇదిగో!