మన జాతీయ భాష ఏంటి అనగానే స్కూల్ పిల్లలు ఠక్కున చెప్పే సమాధానం హిందీ! మనకి చిన్నప్పుడు స్కూల్ బుక్స్‌లో కూడా ఇదే ఉండేది. జాతీయ భాష హిందీ అని ప్రింట్ చేసి ఉండేది. అయితే ఇది నిజం కాదా? అసలు ఇండియాకు జాతీయ భాషే లేదా? ఈ అంశం ఇప్పటికీ బిగ్ డిబెట్! మరోసారి ఇదే చర్చకు కారణమయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravi Chandran Ashwin). చెన్నైలోని రాజలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్, విద్యార్థులతో మాట్లాడుతూ హిందీ(Hindi) భాషపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హిందీ జాతీయ భాష కాదని.. కేవలం అధికారిక భాష మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అశ్విన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. అశ్విన్ వ్యాఖ్యలు తమిళనాడులో హిందీ భాషపై ఉన్న సున్నితమైన భావాలను మరొకసారి ముందుకు తెచ్చాయి. హిందీని దక్షిణ భారత రాష్ట్రాలపై రుద్దడానికి కేంద్ర ప్రభుత్వాలు నిత్యం ప్రయత్నిస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమాల పురిటిగడ్డ తమిళనాడుకు చెందిన అశ్విన్ ఈ కామెంట్స్ చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
లింక్ లాంగ్వేజ్ కూడా కాదా?
అశ్విన్ కామెంట్స్‌ను బీజేపీ వీర విధేయుడుగా పేరున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమర్థించడం మరో ఆసక్తికర అంశం. హిందీ జాతీయ భాష కాదు కానీ ఇది లింక్ లాంగ్వేజ్ అని చెప్పుకొచ్చారు అన్నామలై. లింక్ లాంగ్వేజ్ అంటే సంబంధాల మధ్య వారధి అని అర్థం. రెండు భిన్న భాషai మాట్లాడే ప్రజల మధ్య సంబంధాలను కలుపే భాష హిందీ అని అన్నామలై అంటున్నారు. అయితే హిందీ అసలు లింక్లాంగ్వేజ్ కూడా కాదన్న వాదన వినిపిస్తోంది. సౌతిండియాలో ప్రజల మధ్య లింక్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ ఉందని గుర్తుచేస్తున్నారు. హిందీ మాట్లాడే, అర్థం చేసుకునే ప్రజలు దక్షిణాదిన చాలా తక్కువ ఉంటారని చెబుతున్నారు.

అధికారిక భాష మాత్రమే
ఇక ఇండియాకు జాతీయ భాష లేదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం ఇండియాకు అధికారిక భాషలే ఉన్నాయి. జాతీయ భాషగా ఏ భాషనూ రాజ్యాంగం గుర్తించలేదు. భారత్‌లో 22 అధికారిక భాషలు ఉన్నాయి. అయితే హిందీ, ఇంగ్లీష్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషలుగా ఉపయోగించుకుంటుంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లీష్‌ను లింక్ లాంగ్వేజ్‌గా వినియోగిస్తారు. నిజానికి హిందీ, ఉత్తర భారతంలో చాలా ప్రాంతాల్లో మాట్లాడే భాషగా ఉంది. దేశంలో 53శాతం మందికి హిందీ అర్థమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉత్తర భారతంలో చాలా భాషాలు హిందీ రుద్దుడు కారణంగానే మాయమైపోయే స్థితికి చేరుకున్నాయన్న విమర్శలున్నాయి. విద్యా వ్యవస్థలో హిందీని తప్పనిసరి చేయడం వల్ల, స్థానిక భాషలలో చదువుతున్న విద్యార్థులు నష్టపోతున్నారన్న ఆరోపణలున్నాయి. అటు స్థానిక భాషను హిందీతో కేంద్ర ప్రభుత్వాలు బలవంతంగా ప్రయోగించాయని.. అందుకే పంజాబీ, మైతిలీ లాంటి భాషలు మాట్లాడే ప్రజలు తగ్గిపోతున్నారన్న ప్రచారముంది. మరోవైపు ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ భాషగా ఉంది. ఎడ్యూకేషన్, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ప్రధాన భాష ఇంగ్లీష్. ఇటు సౌతియాండియాలోనూ ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో బలవంతపు హిందీ భాష ప్రయోగాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటాయి.

హిందీ వ్యతిరేక ఉద్యమాల పురిటిగడ్డ
నిజానికి 1950ల కాలంలోనే తమిళనాడులో హిందీ భాష వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలు హిందీని తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా, స్థానిక భాషల పరిరక్షణ కోసం జరిగాయని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా తమిళులు తమ భాషా సంస్కృతిని కాపాడుకోవడానికి హిందీని అంగీకరించడానికి ఇష్టపడరు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇటీవల అశ్విన్ తరహా కామెంట్సే చేశారు. ఇలా హిందీ జాతీయ భాషా కాదా అనే అంశం నిత్యం తీవ్ర చర్చకు కారణం అవుతూ వస్తోంది.
ఇది కూడా చదవండి: టీనేజర్స్ జీవితాన్ని పెకలిస్తున్న సోషల్ మీడియాకు ఇక ముకుతాడు! రాబోతున్న కొత్త సోషల్ మీడియా నియంత్రణ చట్టంలో ఏముంది?

Language: ఆ భాష మాట్లాడే మనుషుల మీద సమాజం చిన్నచూపు.. ఎందుకిలా? ప్రతిభకు భాష కొలమానమా?
WPL 2026 Auction: ఆక్షన్‌లో మెరిసిన టీమిండియా చాంపియన్..! దీప్తి శర్మకు ఎందుకంత క్రేజ్?
WTC Finals 2025 : ఇక చోకర్స్ కాదు ఛాంపియన్స్! ఎన్నో ఏళ్ల ‘ఆశ ‘ను నిజం చేసిన బవూమా!!
CT Final 2025: టీమిండియా గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. లాస్ట్‌లో ట్విస్ట్!
Three Language Policy: మీ హిందీని మడిచి..! దేశవ్యాప్తంగా రగులుతోన్న భాషా వివాదం.. మరో ఉద్యమం తప్పదా?
Imran Khan: థ్రిల్లింగ్ క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోన్న ఇమ్రాన్ లైఫ్.. వరల్డ్ కప్ నుంచి జైలు శిక్ష వరకు..