Menu

Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?

Lakshmi Aruna 2 months ago
PPF vs FD which is better

PPF, FDలో పెట్టుబడికి ఏది బెస్ట్ అనే డిబెట్‌ ఎక్కువగా జరుగుతుంటుంది. ముందుగా PPF గురించి తెలుసుకుంటే.. ఇది ప్రభుత్వ భరోసాతో వచ్చే ఒక దీర్ఘకాలిక సేవింగ్స్ స్కీమ్. ఇది ఒక్క రోజులో డబ్బు పెంచే స్కీమ్ కాదు.. కనీసం 15 సంవత్సరాల పాటు ఒక క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో కార్పస్‌ తయారవుతుంది. వడ్డీ రేటు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ముఖ్యంగా వచ్చిన వడ్డీకి పూర్తిగా పన్ను ఉండదు. పెట్టిన మొత్తానికి కూడా 80Cలో టాక్స్ మినహాయింపు లభిస్తుంది. అంటే ఇది పూర్తిగా టాక్స్ ఫ్రీ కేటగిరీలోకి వెళ్లే పెట్టుబడి.

ALSO READ: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్‌ లోన్స్.. పూర్తి వివరాలివే!

కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. మీకు మధ్యలో ఎప్పుడైనా మనీ కావాల్సినప్పుడు డబ్బు తీసుకోవడం అంత సులభం కాదు. ప్రత్యేకమైన షరతులు, కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే కొంతమొత్తంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే PPF అనేది లాంగ్‌-టర్మ్ ప్లానింగ్ ఉన్న వాళ్లకు మాత్రమే బాగా పనిచేస్తుంది. రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల ఉన్నత చదువులు, ఫ్యూచర్‌ సెక్యూరిటీ లాంటి లక్ష్యాలకు ఇది పర్ఫెక్ట్.

FDతో నెలా నెలా డబ్బు:

ఇప్పుడొకసారి FD సంగతి చూద్దాం. ఇది సింపుల్, సేఫ్‌తో పాటు ఎక్కువ ఫ్లెక్సిబిలిటి ఇచ్చే పెట్టుబడి. మీకు ఎన్ని రోజులకు మీ ఫండ్ కావాలో మీరు చెప్పొచ్చు. 7 రోజులు కావచ్చు, ఏడాది కావచ్చు, ఐదు సంవత్సరాలు కావచ్చు. వడ్డీ రేట్లు PPF అంత ఎక్కువ కాకపోయినా సేవింగ్స్ అకౌంట్‌ కంటే ఖచ్చితంగా ఎక్కువే.

నెల నెలా వడ్డీ కావాలంటే “నాన్-క్యూములేటివ్” పద్ధతి, చివర్లో మొత్తంగా వడ్డీ కావాలంటే “క్యూములేటివ్” పద్ధతి ఎంచుకోవచ్చు. త్యవసరంగా డబ్బు అవసరం పడితే, పెట్టిన డిపాజిట్‌ను మధ్యలోనే తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొద్దిగా జరిమానా కత్తిరిస్తారు. అయినా కూడా డబ్బు తేలికగా దొరుకుతుంది. డబ్బు అవసరమైనప్పుడు వెంటనే తీసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఇటు పన్నుల విషయానికి వస్తే స్పష్టంగా PPF గెలుస్తుంది. ఎందుకంటే FD వడ్డీ మొత్తం మీ ట్యాక్స్‌ స్లాబ్‌ ప్రకారం పూర్తిగా ట్యాక్స్‌బుల్‌. PAN ఉన్నా లేకపోయినా బ్యాంకు ఒక స్థాయి మేరకు TDS కట్ చేస్తుంది. కానీ PPFలో పెట్టిన అమౌంట్ కి టాక్స్ బెనిఫిట్, వచ్చిన వడ్డీకి టాక్స్ బెనిఫిట్, మెచ్యురిటీ అమౌంట్ కూడా టాక్స్-ఫ్రీ. అంటే పూర్తి మూడింతల టాక్స్ బెనిఫిట్.

ఏది బెస్ట్? PPFనా FDనా?

మీ అవసరం ఆధారపడి సమాధానం మారుతుంది. మీకు లాంగ్‌-టర్మ్ గోల్స్ ఉంటే, డబ్బు త్వరగా అవసరం రాని పరిస్థితి ఉంటే, ట్యాక్స్‌ ఫ్రీ గ్రోత్ కావాలంటే PPF ఉత్తమం. కానీ మీకు ఎమర్జెన్సీ ఫండ్ కావాలనుకుంటే, 1-3 సంవత్సరాల షార్ట్-టర్మ్‌ గోల్స్‌ ఉంటే, లేదా నిత్యం వడ్డీ పరంగా ఇన్‌కమ్‌ కావాలనుకుంటే కావాలనుకుంటే FD బెటర్. అయితే లాంగ్‌ టర్మ్ కోసం PPF, లిక్విడిటీ అండ్‌ ఎమర్జెన్సీ కోసం FD.. ఇలా రెండింటినీ కలిపి పెట్టుబడి పెట్టడం ఒక తెలివైన అడుగుగా చెప్పవచ్చు.

ALSO READ: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ ఆధార్‌ అడ్రెస్‌ను ఇలా అప్‌డేట్‌ చేసుకోండి!

 

 


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *