ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో సమయం, సందర్భం, పనీపాటా లేకుండా పాతబస్తిని పాకిస్థాన్‌తో పోల్చుతాడు హీరో పవన్ కల్యాణ్..! భారత్ మాతాకి జై చెప్పమని గన్ పెట్టి కాల్చి బెదిరిస్తాడు కూడా! ఇదంతా డిప్యూటి సీఎంగారి పైత్యం. మనిషిని మనిషిలా చూడని ఈ సమాజంలో దేశభక్తిని రుద్దాలని పవన్ కిందామీదా పడడం వెనుక లాజిక్ ఏంటో అతని సనాతన బుర్రకే తెలియాలి. తన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి నోరు మెదపని ఈ పిఠాపురం ఎమ్మెల్యే సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ అనకపోయినా ఆవేశంతో ఊగిపోయిన సందర్భాలకు లెక్కే లేదు. అంత సనాతనవాది కాబట్టే కాబోలు దళితులను స్వయంగా తన సొంతపార్టీ నేతలే బండబూతులు తిడుతున్నా చూసిచూడన్నట్టు వ్యవహరిస్తున్నాడు. కేవలం బూతుపురాణంతోనే ఆగడంలేదు.. ఏకంగా మహిళలపై దాడులకు కూడా దిగుతులున్నారు జనసైనికులు. పైగా సనాతన ధర్మంలో మహిళలంటే అబల,తబల,దేవత, దెయ్యం,గాడిదగుడ్డు లాంటి ప్రచారాలు కూడా ఉన్నాయి. అయినా కూడా గౌరవం ఉండదు. ఎందుకంటే దళితలుంటే ఈ పొగరబోతు బలిసినకులాలకు చిన్నచూపు కదా..!
ఏప్రిల్ 4, 2026.. తాటిపర్తి గ్రామం..! ఒక సివిల్ సెటిల్‌మెంట్ పేరుతో మొదలైన వివాదం, చివరకు దళిత మహిళపై బహిరంగ దాడిగా మారింది. జనసేన నేత బారతాల గోవింద్ జోక్యం చేసుకుని, మాట్లాడటానికి వచ్చిన మహిళను అవమానించేలా ప్రవర్తించడమే కాకుండా, భౌతికంగా తోసిపడేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చి 31(2026)న పిఠాపురం మున్సిపల్ వ్యవస్థలోనే కుల వివక్ష ఎలా చొరబడిందో బయటపడింది. మున్సిపల్ కమిషనర్ ఒక దళిత శానిటేషన్ సెక్రటరీని ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో బయటకు రావడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇక గతేడాది(2025)డిసెంబర్ 3న పాఠశాలల్లోనే కులవివక్ష కనిపించిన ఘటన బయటపడింది. గురువే దళిత విద్యార్థులను వేరు చేసి.. ‘మీరు అంతే’ అనే భావనతో అవమానించడం తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని రేపింది. ఇక గతేడాది ఏప్రిల్‌లో మల్లం గ్రామంలో జరిగిన ఘటన అయితే ఇంకా దారుణం. ఒక దళితుడి మరణం తర్వాత న్యాయం కోరినందుకు మొత్తం దళిత వర్గాన్నే గ్రామం నుంచి బహిష్కరించే వరకు అగ్రవర్ణ అహంకారం వెళ్లింది. టీ, టిఫిన్ కూడా ఇవ్వొద్దని ఆంక్షలు విధించడం సంచలనం రేపింది.
పిఠాపురం నియోజకవర్గం లో రెచ్చిపోయిన @JanaSenaParty నాయకులు
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఒక సెటిల్‌మెంట్ లో తలదూర్చి దళిత మహిళపై జనసేన నేత బారతాల గోవింద్ భౌతిక దాడి
మహిళ శరీరంపై అనుచితంగా చెయ్యి వేసి నేల మీదకు నెట్టేసిన గోవింద్
మొన్న రైల్వేకోడూరులో దళిత… pic.twitter.com/I7CezYkECH
— YSR Congress Party (@YSRCParty) April 4, 2026
ఇంత జరుగుతుంటే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నాడనేదే అసలు ప్రశ్న. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ అనకపోయినా అన్నట్టు ఊహించేసుకొని ఆవేశంతో ఊగిపోతూ, విద్వేషాలు రెచ్చగొట్టే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? దేశభక్తి అనే పదం వినిపించిందంటే ఉపన్యాసాలు దంచే ఈ డిప్యూటీ సీఎం.. తన సొంత నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాత్రం ఎందుకు నోరు మెదపడు? తన పార్టీ నేతలే దళిత మహిళలను ఈడ్చి కొడుతున్నా… బండబూతులు తిడుతున్నా… అధికారంలో ఉన్న వ్యక్తిగా ఒక్క మాట చెప్పే ధైర్యం లేదా? ఇదే సనాతన రాజకీయం కాబోలు..!
అంబేద్కర్ చెప్పిన సమానత్వం, స్వాభిమానమే ఈ దేశ రాజ్యాంగానికి ప్రాణం. కానీ పిఠాపురంలో జరుగుతున్నది చూస్తే… ఆ ఆలోచనలను బహిరంగంగా అవమానిస్తున్నట్టే కనిపిస్తోంది. మనుషుల మధ్య తేడాలు కులాల పేరుతో సృష్టించి ఒక కులాన్ని ఎప్పటికీ తలదించుకునేలా ఉంచడమే వ్యవస్థ పనిలా కనిపిస్తోంది. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఆధిపత్యం ఎప్పుడూ కేవలం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగానే కాదు.. అది మానసికంగానూ కొనసాగుతుంది. పిఠాపురంలో జరుగుతున్న ప్రతి ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బలసిన కులాలకి అధికారమే ఆయుధం.. మిగతావారికి న్యాయం అడగడం కూడా నేరమే!
ఇదే సమయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు మరింత ఆలోచింపజేస్తోంది. హిందూమతం నుంచి ఇతర మతాలకు మారితే దళిత హక్కులు ఉండవని చెప్పడం, కుల వివక్ష అనేది కేవలం మతంతో ముగిసిపోయే సమస్య అన్నట్టుగా చూపించే ప్రయత్నం దారుణం. నిజానికి కుల వివక్ష అనేది మతంతో ముగిసిపోయే విషయం కాదు. అది సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా మనుషులని వెంటాడే వ్యవస్థ. మతం మార్చుకున్నా సమాజం చూపే చూపు మారదని పిఠాపురం ఘటనలే నిరూపిస్తున్నాయి.

Ebola outbreak: ఎబోలా వ్యాప్తికి కారణమైన అమెరికా? ట్రంప్ నిధుల కోతతో మరణాల మోత
Karnataka Politics: సీఎం పదవి నుంచి దిగిపోయిన సిద్ధరామయ్య.. దీని వెనుక ఉన్న కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
Petrol Price Hike:10 రోజుల్లో నాలుగో సారి పేలిన బాం*బు..కోట్లాది భారతీయులపై ధరల పిడుగు!
Cockroach Janata Party: కాక్రోచ్‌లతో పాటు పెంటపురుగులు కూడా ఏకం కావాల్సిందే! మీ బయాలజీ క్లాసులు తగలయ్యా..!
IRAN VS AMERICA: గోడకేసి కొట్టిన బంతిలా లేచిన ఇరాన్.. మరోసారి వార్‌కు రెడీ!
Gulf War: గల్ఫ్ దేశాలు రెండుగా చీలాయా..? యూఏఈకి సౌదీ షాక్!