Menu

Pawan Kalyan vs DMK: నీ పప్పులు అక్కడ ఉడకవ్ పవను.. అది పెరియార్ గడ్డ తమ్ముడు!

Tri Ten B
Sanatana Dharma row

‘తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజున ఆలయాల ముందు ఏర్పాటు చేసిన పెరియార్ విగ్రహాలను తొలగిస్తాం…’ 2023 నవంబర్‌లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఈ కామెంట్స్‌ అక్కడ పెను ప్రకంపనలు సృష్టించాయి. పార్టీలతో సంబంధం లేకుండా బీజేపీ మినహా దాదాపు ప్రతీ పార్టీ నేతా అన్నామలై వ్యాఖ్యలను ఖండించారు.. ఎందుకంటే తమిళనాట ఏ పార్టీ పుట్టినా.. ఏ నాయకుడు ఆవర్భించినా అందరూ పెరియార్ వారసులే. పెరియార్ భావజాలాన్ని ముందుకు నడిపించేవారు. తమిళ ప్రజలది కూడా ఆయన ఐడియాలజీనే. వాళ్లు ఏ మతాన్ని ఆరాధించినా పెరియార్‌ని మాత్రం విడిచిపెట్టరు. అలాంటి రాష్ట్రంలో ఒక్క లోక్‌సభ స్థానమైనా సంపాదించాలని ప్రయత్నించిన బీజేపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. ఇక 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. బీజేపీ అందులోనైనా ముందుడగు వెయ్యాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం, సనాతన ధర్మ కొత్త రక్షకుడు పవన్‌ కల్యాణ్‌ని రంగంలోకి దింపినట్టుగా అర్థంమవుతోంది.

సనాతనా, సనాతనీ, సనాతనం

డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు ఏం చేశారో ఎవరికి తెలియదు.. ఏదో పండక్కి మాత్రం చీరలు పంచారు.. ఆ ముందు.. ఆ తర్వాత ఏవో దీక్షలు చేశారు.. ఇదంతా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని పనులు. తిరుమల లడ్డూలో నాడు వైసీపీ పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిపిందని ప్రాయశ్చిత దీక్ష చేసిన పవన్‌ అక్టోబర్‌ 3న తిరపతిలో బహిరంగ సభ పెట్టారు. డిప్యూటీ సీఎంగా ఆ సభ పెట్టలేదట.. ఓ సనాతన ధర్మ రక్షకుడిగా పెట్టారంట.. అక్కడికి వచ్చిన ఆయన అభిమానులతో ఏవో ప్రతిజ్ఞలు చేయించారు. సభలో ఎక్కడా కూడా ప్రజాసంక్షేమం గురించి ఊసే ఎత్తలేదు. సనాతనా, సనాతనీ, సనాతనం, సనాతన ధర్మమంటూ ఒక్కటే మాట మాట్లాడారు. ఇక్కడితో ఆగిపలేలు. తమిళ రాజకీయాల్లో వేలు పెట్టారు. నాడు సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారే ముందుగా నాశనం అయిపోతారని చెప్పారు. గతంలో కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన వారున్నారని.. భవిష్యత్‌లో కూడా వస్తారని.. అయితే తన ధర్మం మాత్రమే శాశ్వతమంటూ పరోక్షంగా పెరియార్‌ భావజాలాన్ని విమర్శించారు.

ద్రవిడ సిద్ధాంతాలపై బురద చల్లితే ఊరుకుంటారా?

ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ చేయాల్సిందేంటి? ఆయన చేస్తున్నదేంటి? ఏపీలో ఎన్నో సమస్యలుండగా తమిళ రాజకీయాలు ఆయనకేందుకు? ఎందుకంటే అక్కడి ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేను మళ్లీ బీజేపీతో కలిపేందుకు..! నిజానికి గతంలో బీజేపీ-అన్నాడీఎంకే మధ్య కొన్నాళ్లు పొత్తు నడిచింది. అయితే అన్నామలై కారణంగా ఆ పొత్తు పెటాకులైంది. అన్నాడీఎంకే మాజీ సీఎంలపై అన్నామలై చేసిన కామెంట్స్‌తో ఆ పార్టీ బీజేపీతో పొత్తు తెంచుకుంది. ద్రవిడ వాదాన్ని బహిరంగంగా తప్పుబడుతున్న బీజేపీ నేతలతో కలిసి వెళ్తే అక్కడి ప్రజలు క్షమించరని ఆ పార్టీకి తెలుసు. అందుకే బ్రేకప్‌ చెప్పింది. ఆ తర్వాత కూడా బీజేపీ మారిందా అంటే లేదు.. ఆ తర్వాత కూడా అన్నామలై కానీ అక్కడి బీజేపీ నేతలు కానీ ద్రవిడ సిద్ధాంతాలపై బురద జల్లడం మానుకోలేదు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమిళులు బీజేపీగా బాగానే బుద్ధి చెప్పారు. అయితే అక్కడ అన్నామలై వల్ల కానిది ఏపీలో ఉండే పవన్‌ కల్యాణ్‌ వల్ల ఎలా అవుతుందన్నది మిస్టరీనే!

సమానత్వం వర్సెస్ సనాతనం

అన్నాడీఎంకేపై మునుపెన్నడూ లేని విధంగా పవన్ కల్యాణ్‌ ప్రేమ వలకబోస్తుండడానికి ఇదే కారణం కావొచ్చు. అన్నాడీఎంకేకు మద్దతుగా పవన్‌ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ నెల 17న అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం ఉండగా.. పది రోజులు ముందుగానే పవన్‌ ప్రేమ నటిస్తున్నారు. అన్నాడీఎంకే మాజీ సీఎంలను పొగిడేస్తున్నారు. అయితే పవన్‌ ఎంత చేసినా అన్నాడీఎంకే సనాతనవాదాన్ని భుజంపై వేసుకుంటుందా అంటే డౌటే. ఎందుకంటే డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా వాటి సిద్ధాంత మూలాలు ఒక్కటే. ఈ విషయం పవన్‌కు తెలియకపోవచ్చు.. బీజేపీకి అర్థంకాకపోవచ్చు.. సమానత్వంపై సనాతన ధర్మం ఎక్కడైనా విజయం సాధించవచ్చు కానీ అది తమిళనాట సాధ్యంకాకపోవచ్చు!

ఇది కూడా చదవండి: ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు..’ సుప్రీంకోర్టులో ఏపీ సీఎంకు ఘోర అవమానం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *