Menu

Pawan-CBN: పొత్తులో అలకలు, లుకలుకలు.. చిన్నపిల్లల గొడవలని తలపిస్తోన్న టీడీపీ-జనసేన సీట్ల పంపకాల రచ్చ!


పొత్తులో తనదే అప్పర్ హ్యాండ్‌ అని ఫీల్ అయ్యే రకం. అందుకే చర్చాపాడు లేకుండా రెండు సీట్లకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిపడేశారు. మరి పవన్‌ ఊరుకుంటాడా? ఏం చేశాడో చూడండి!


Tri Ten B

ఏ పార్టీకైనా ఓ ఎజెండా ఉంటుంది.. సిద్ధాంతాలూ ఉంటాయి. వాటి కోసమే రాజకీయాల్లోకి వచ్చామని పదేపదే చెప్పుకునే అలవాటూ ఉంటుంది. అయితే ఏపీలో జనసేన(Janasena)కు మాత్రం రానున్న ఎన్నికల్లో ఒకటే ఎజెండా. అది జగన్‌(Jagan)ను గద్దె దించడం. పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan) తానేం చేస్తాడో చెప్పడు.. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని అసలు మాట్లాడడు.. జగన్‌ని ఓడించడమే టార్గెట్ అంటాడు. నిజానికి పవన్‌కళ్యాణ్‌కు రాజకీయాల పట్ల ఓ స్పష్టమైన అవగాహన ఉంది. అయితే ఆచరణలో మాత్రం ఆయన ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతుంటాయి. పొత్తు ధర్మంపై తాజాగా చంద్రబాబు(Chandrababu Naidu)కు చురకలంటిచాడు పవన్‌. తన క్యాడర్‌ని కూల్‌ చేయడం కోసమే ఈ పని చేసినా ఇది ఎంతవరకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి.


మండపేటలో రాజుకున్న మంట:
వాస్తవానికి చంద్రబాబుకు పవన్‌ సపోర్ట్ కావాలి.. ఇదే సమయంలో పవన్‌కూ చంద్రబాబు మద్దతు కావాలి. ఇద్దరు కలిసి పోటిచేయాలి.. మధ్యలో బీజేపీ ఎలాగో ఉంది. ఆ పార్టీ రోల్‌ ఏంటో.. అసలు పొత్తులో ఉందో లేదో కూడా అర్థంకాని దుస్థితి. ఏం చేసినా ముగ్గురు కలిసి మాట్లాడుకోవాలి.. చర్చించుకోవాలి.. తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ 40ఇయర్స్‌+ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఇవేవీ పట్టవు. పొత్తులో తనదే అప్పర్ హ్యాండ్‌ అని ఫీల్ అయ్యే రకం. అందుకే చర్చాపాడు లేకుండా రెండు సీట్లకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిపడేశారు. అరకు నుంచి దొన్నెదొరను, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావులను టీడీపీ అభ్యర్థులుగా బాబు ప్రకటించడంతో జనసేన అధినేతకు మండిపోయంది. ఎందుకంటే మండపేట సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయంపై జనసేన క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది.. రోడ్లపైకి వచ్చి గొడవలు కూడా చేసింది. దీంతో తన క్యాడర్‌కి సర్ధి చెప్పాల్సిన పరిస్థితి పవన్‌కు ఎదురైంది.

కాంప్రమైజ్‌ కానని చెప్పే ప్రయత్నం చేశారా?
చంద్రబాబు నిర్ణయంపై పవన్‌ చిందులేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలంటూ చురకలంటించారు. మీరు రెండు సీట్లు ప్రకటిస్తే నేను రెండు సీట్లు ప్రకటిస్తానని చెప్పడమే కాదు.. ఏకంగా ప్రకటించిపడేశారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పిన పవన్ ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి టీడీపీకి హెచ్చరికలు పంపారు. రాజానగరం రేసులో బత్తుల బలరామకృష్ణ, రాజోలు రేసులో బొంతు రాజేశ్వరరావు, వరప్రసాద్, డీఎంఆర్ శేఖర్ ఉన్నారని పవన్ చెప్పడంతో టీడీపీకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. పవన్‌ ఇంత అగ్రెసీవ్‌గా నిర్ణయాలు తీసుకుంటారని ఓవైపు జనసేన కార్యకర్తలు ఆనందపడుతుంటే మరోవైపు పవన్‌ ఆవేశపూరిత నిర్ణయాలు మొదటికి మోసం చేస్తాయని టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ అలకలను వైసీపీ క్యాష్‌ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏ సమస్యనైనా నాలుగు గొడల మధ్య మాట్లాడుకోని సరిదిద్దుకోవాల్సిన నేతలు ఇలా నువ్వు రెండు ప్రకటిస్తే నేను రెండు ప్రకటిస్తా అని చెప్పి అదే పని చేస్తే వైసీసీ దగ్గర చీప్‌ ఐపోతామని టీడీపీ భావిస్తోందట. అయితే పవన్‌ మాత్రం తన క్యాడర్‌ని కూల్‌ చేయడం కోసమే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. తానెక్కడా తగ్గనని..మనమే అప్పర్‌ హ్యాండ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు పార్టీల తీరు ఇలా ఉంటే రేపో, ఎల్లుండో బీజేపీ వచ్చి ఇంకో రెండు సీట్లు ప్రకటించకుంటే మొత్తానికి కామెడీ పొత్తుగా మారి నవ్వులపాలవడం పక్కా!

Also Read: ఒక చావు.. ఎన్నో ప్రశ్నలు.. ఏది నిజం?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *