Menu

Manubhaker: ఎవరీ మనుభాకర్‌..? 22ఏళ్లకే పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరిసిన ఈ షూటర్‌ కథ ఇదే!

Praja Dhwani Desk

Who is Manubhaker: సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో షూటర్‌ మనుభాకర్‌ ఎంతో బాధపడింది. అప్పటివరకు అద్భుతంగా ఆడిన మను సడన్‌గా గురి తప్పింది. తన షూటింగ్‌ గన్‌ పనిచేయడం ఆగిపోయింది. ఆడి ఓడిపోయి వచ్చే బాధ ఒకలా ఉంటుంది.. ఇలా గన్‌ పాడైపోయి వచ్చే బాధ వర్ణాణతీతం. అయితే ఆ బాధను తట్టుకోని ఈ మూడేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన మను భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ప్లేయర్‌గా నిలిచింది.

0.1 తేడా:
మను భాకర్ 22 షాట్ల తర్వాత 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన యెజీకు, మనుకు కేవలం 0.1 పాయింట్లు మాత్రమే తేడా. 22 ఏళ్ల మనుభాకర్ భారత తరుఫున షూటింగ్‌లో ఒలింపిక్‌ పతకం సాధించిన మొదటి మహిళగా నిలిచింది.


ఎవరీ మనుభాకర్?
మను భాకర్ పిస్టల్ షూటింగ్‌లో టీనేజ్‌లోనే భారత్ క్రీడాభిమానులకు దగ్గరైంది. అసాధారణ నైపుణ్యంతో అంతర్జాతీయ వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన మను 2002 ఫిబ్రవరి 18న పుట్టింది. చిన్నతనం నుంచే క్రీడల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్న మను బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ లాంటి గేమ్స్‌పై మొదట ఫోకస్‌ చేసింది. ఆ తర్వాత తన మనసు షూటింగ్‌ వైపు మళ్లింది. . 2017లో అంతర్జాతీయ షూటింగ్‌లోకి అడుగుపెట్టింది మను.


16ఏళ్లకే సత్తా చాటిన మను:
బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో మను తన సత్తా చూపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించి, యూత్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఈవెంట్లలో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ పోటీల్లో బంగారు పతకాలతో పాటు పలు పతకాలు సాధించింది. టీనేజ్‌ కూడా ముగియకపోతే ప్రపంచానికి మను తానేంటో చూపించింది.


2018లో గ్వాడలజరాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను 16 ఏళ్ల వయసులోనే స్వర్ణం సాధించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మను గోల్డ్‌ కొట్టింది. 2018 జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ అభిషేక్ వర్మతో కలిసి మను అదరగొట్టింది. ఈ జోడి అప్పుడు గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

చిన్న వయసులోనే షూటింగ్‌లో సత్తా చాటిన మనుభాకర్‌కు 2020లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. మను అచంచలమైన అంకితభావం, అసాధారణ ప్రతిభ, అద్భుతమైన విజయాలు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతాయి. షూటింగ్‌ వలర్డ్‌కప్‌లో ఇప్పటివరకు 8 మెడల్స్‌ సాధించింది మను.. ఇదే దూకుడుతో పారిస్‌ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మను భారత్‌కు బ్రాంజ్‌ మెడల్ అందించింది.

Also Read: ‘ది స్వీట్‌ కిస్‌..’ ముద్దుతో చిచ్చును ఆర్పేసిన రోహిత్‌!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *