Menu

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఇండియా రాణించలేకపోవడానికి కారణం ఎవరు..? అత్యధిక జనాభా ఉన్నా ఫలితం సున్నా!

Tri Ten B

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్యానా నుంచి పాల్గొన్న ఆటగాళ్ల సంఖ్య 24.. అటు గుజరాత్‌ నుంచి పాల్గొన్న ప్లేయర్ల సంఖ్య 2..! ఈ లెక్కన చూస్తే ‘ఖేలో ఇండియా’ కింద యూనియన్‌ బడ్జెట్‌లో ఈ రెండు రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కచ్చితంగా హర్యానాకే ఎక్కువ నిధులు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారా? అయితే మీరు ఉప్పులేని పప్పులో కాలేసినట్టే..! దేశంలో స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేయడం కోసం, ఆటగాళ్ల కోసం ప్రతీఏడాది కేంద్రం ‘ఖేలో ఇండియా’ కింద బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుంటుంది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో 2168.78 కోట్లను కేటాయించింది. ఇందులో గుజరాత్‌కు 426.12 కోట్ల నిధులు ఇవ్వగా.. హర్యానాకు ఇచ్చింది కేవలం 66.59 కోట్లే. అదేంటి హర్యానా నుంచి ప్రతీసారి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కదా.. మరి గుజరాత్‌కు అంత ఇచ్చి హర్యానకు ఇంతే ఇవ్వడమేంటి? అదే కదా వివక్ష అంటే.. అదే కదా పక్షపాతమంటే..!

క్రెడిట్‌ స్టీలింగ్‌లో టాప్:
వివక్ష, పక్షపాతం.. ఈ రెండు ఉన్న చోట గెలుపే ఉండదు.. అంతా శున్యమే ఉంటుంది. రిజల్ట్‌ ఆర్యభట్ట నంబర్‌ లాగా జీరోకే పరిమితమవుతుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏ మాత్రం బాగాలేదు. ఒక్క గోల్డ్‌ మెడల్ లేకుండానే భారత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ను ముగించింది. ఒక సిల్వర్‌, 5 బ్రాంజ్‌లతో మొత్తంగా అరడజను మెడల్స్‌ను సాధించింది. ఇదంతా ఆటగాళ్ల వైఫల్యం కానే కాదు.. ఈ ఫెయిల్యూర్‌కు కారణం గత, ప్రస్తుత ప్రభుత్వాలది, బట్టి చదువులనే భాగ్యంగా భావించే పేరెంట్స్‌ది..! అవును.. బడ్జెట్‌లో స్పోర్ట్స్‌కి కేటాయించే నిధుల శాతం వన్‌ పర్సెంట్‌ కూడా ఉండదు.. 0.07 పర్సెంట్‌ ఉంటుంది.. మహా అయితే 0.1 పర్సెంట్ ఉంటుంది.. ఇది అసలు కేటాయింపే కాదు.. అది కేంద్రం పడేసే ముష్టి.. ఆ ముష్టిలోనే ఆటగాళ్లు ఎదగాలి.. మెడల్స్‌ కొట్టాలి.. కొట్టిన తర్వాత క్రెడిట్లు మాత్రం మోదీగారికే..! ఈ క్రెడిట్‌ స్టీలింగే ఒలింపిక్స్‌లో ఒక ఆట అయితే మోదీ ఎప్పుడో ఇండియాకు వందల మెడల్స్‌ తీసుకొచ్చేవారు.. స్విమ్మర్‌ మైఖల్‌ ఫెలిప్స్‌కు కూడా సాధ్యంకాని రికార్డులు సృష్టించేవారు!
ఇదెక్కడి వివక్ష:


ఆటలను ఎంకరేజ్‌ చేయరు కానీ మెడల్స్‌ మాత్రం రావాలి.. ఎలా వస్తాయ్.. ఎందుకొస్తాయ్.. ? నిధులు కేటాయింపులోనూ వివక్ష చూపించే కేంద్రానికి అసలు ఒలింపిక్ పతక విజేతలను అభినందించే నైతిక అర్హత కూడా లేదు. ఖేలో ఇండియా కింద అత్యధికంగా ఫండ్స్‌ అంతుకున్న రెండు రాష్ట్రాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్‌(438.27 కోట్లు), రెండోది గుజరాత్‌(426.13 కోట్లు). మరి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించారంటే కేవలం తొమ్మిది మందే..! యూపీ నుంచి 7, గుజరాత్‌ నుంచి ఇద్దరు..! మొత్తం 117 మందిలో కేవలం 10శాతం మంది ఆటగాళ్లు కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచి లేరు. నిధుల కేటాయింపులో మాత్రం 40శాతం ఈ రెండు రాష్ట్రాలకే ఇచ్చింది బీజేపీ. అటు అందరికంటే ఎక్కువగా 24 మంది ప్లేయర్లను పంపిన హర్యానాకు 66.59 కోట్లే ఇవ్వగా.. ఈ లిస్ట్‌లో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న పంజాబ్‌(19)కు ఇచ్చింది 78.02 కోట్లు.

జనాభా ఉన్నా ఫలితం సున్నా:



నిజానికి భారత్‌ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవారి సంఖ్య తక్కువే. ఈ సారి 117 మంది భారత్ ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో అమెరికా ఉంది. మొత్తం 593 మంది అమెరికా అథ్లెట్లు పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆతిథ్య దేశం ఫ్రాన్స్ 573 మంది ఆటగాళ్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (460), జర్మనీ (427), జపాన్ (404), ఇటలీ (403), చైనా (388), స్పెయిన్ (382), గ్రేట్ బ్రిటన్ (327), కెనడా (318) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్ట్‌ను గమనిస్తే ఈ దేశాల జనాభా మనకంటే ఎన్నో రెట్లు తక్కువ. ఒక చైనా మాత్రమే మన కంటే కాస్త తక్కువ జనాభాను కలిగి ఉంది.

ఆస్ట్రేలియాని చూసి నేర్చుకోవచ్చు:

కేవలం 2.6 కోట్లు జనాభా కలిగిన ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 460 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆస్ట్రేలియా జనాభా ఇండియాలో తెలంగాణ రాష్ట్ర జనాభా కంటే తక్కువ. అటు కేవలం 51 లక్షల మంది జనాభా కలిగిన న్యూజిలాండ్‌ నుంచి 195 మంది అథ్లెట్లు పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ జనాభాలో సగం ఉన్న న్యూజిలాండ్‌ జనాభా నుంచి 195 మంది పాల్గొంటే 140 కోట్ల జనాభా ఉన్న మొత్తం భారత్ దేశం నుంచి 117 మంది మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ లెక్కలు చాలు ప్రభుత్వాలు ఆటల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో తెలుసుకోవడానికి..!

పేరెంట్స్‌ మైండ్‌సెటే కారణం:


ఇక్కడ కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే తప్పు పడితే అది మహా తప్పే అవుతుంది.. ఇండియన్ పేరెంట్స్‌ మైండ్‌సెట్‌ కూడా ఇండియాలో ఆటలు, ఆటగాళ్లు ఎదగకపోవడానికి మరో అతి పెద్ద కారణం.. చైనాలో చిన్నతనం నుంచే ఆటలు నేర్పిస్తారు. ఏదో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ కోసం కాదు.. ఫిజకల్ ఫిట్‌నెస్‌ కోసం.. చదువుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆటలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది.. ఎండలో తిరిగితే కందిపోతావ్‌, నల్లబడిపోతావ్‌ లాంటి రెసిస్ట్‌ డైలాగులు వారి పేరెంట్స్‌కు తెలియవు.. ఫిజకల్‌ ఫిట్‌నెస్‌ ఉంటే చదువులోనూ రాణించవచ్చు అన్నది అక్కడి పేరెంట్స్‌ ఆలోచన. అటు ఎడ్యూకేషన్‌ సిస్టమ్‌ కూడా చదువులను ఆటలను బ్యాలెన్స్‌ చేస్తూ ఉంటుంది. మన దగ్గర ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు విద్యాసంస్థలు విద్యార్థులను జీవితాలను భ్రష్టుపట్టిస్తున్నాయి. ఆటలు ఆడితే ఎందుకు పనికిరాకుండా పోతావ్‌ అనే మాటలతో చిన్నతనం నుంచే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయి. అటు పేరెంట్స్‌ కూడా వారి మాటలనే నమ్ముతారు. అటు కొంతమంది పేరెంట్స్‌ ఆటలవైపు ఆసక్తి చూపినా అది క్రికెట్‌కే పరిమితమవుతుంది. ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు.. క్రికెటర్లు కోట్లకు కోట్లు సంపాదిస్తారు.. ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆలోచనతో పిల్లలను క్రికెట్‌ కోచింగ్‌లకు పంపుతారు. 2016 ఒలింపిక్స్‌లో పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో సిల్వర్‌ మెడల్ సాధించిన తర్వాత ఆమెకు అనేక రివార్డులు దక్కాయి. డబ్బులతో పాటు ఇంటి స్థలాలను కూడా ప్రభుత్వాలు కేటాయించాయి. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమీలకు గిరాకీ పెరిగింది. ఒక్క మెడల్‌తో ఇన్ని కోట్లు వస్తున్నాయి కదా అని కొంతమంది పేరెంట్స్‌ వారి పిల్లలను బలవంతంగా అకాడమీల్లో జాయిన్ చేశారు. అంతేకానీ వారి పిల్లలకు ఏం వచ్చు ఏం రాదు అని తెలుసుకోలేదు. ‘ఈ గేమ్‌ ఆడు లైఫ్‌ సెటిల్ అవుతుంది..’ ఇవే మాటలు.. అసలు ఇదేం పేరెంటింగ్‌?

సమాజం చూపించే వివక్ష:

ఆటగాళ్ల గెలుపు ఈజీగా కనిపించవచ్చు కానీ వారి కష్టాలు వారికే మాత్రమే అర్థమవుతాయి. ఫిట్‌నెస్ కోసం అథ్లెట్లు కష్టపడే తీరు చూస్తే వారికి ఎన్ని కోట్ల రివార్డులు ఇచ్చినా తప్పే లేదనిపిస్తది.. అయితే వారికి ఎంకరేజ్‌మెంట్‌ మాత్రం శూన్యం.. పైగా చదువు మానేసి ఈ ఆటలేంటని చుట్టు ఉన్నవారు సూటిపోటి మాటలతో వేధిస్తుంటాయి. గెలిచిన తర్వాత ఒకలాగా ఓడిపోతే మరోలా చూడడం ఇండియన్ సోసైటీకి బాగా అలవాటు. అందుకే ఈ గోల ఎందుకని ఆటలో ఆసక్తి ఉన్నా ప్రపంచాన్నే జయించే టాలెంట్‌ ఉన్నా వాటిని పక్కన పెట్టి అందరితో పాటే ముందుకు పోయే పిల్లలు, యూవత మన కళ్ల ముందే కనినిస్తుంటారు. ఇన్ని అవలక్షణాలు ఉన్న దేశానికి అరడజను మెడల్స్‌ కాకపోతే వందల మెడల్స్‌ వస్తాయా?

Also Read: ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియన్ హాకీ.. ఎవరీ శ్రీజేష్‌..?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *