Menu

Entry To Temples: అలా ధ్వజస్తంభం దాటి అన్యమతస్తులు, నాస్తికులు రావొద్దని దేవుడు చెప్పాడా? న్యాయస్థానాల్లో ‘ధర్మ’ తీర్పులు!


భక్త, ఉన్మాద నినాదాలు, పండుగుల వేళ లౌడ్‌ స్పీకర్ల నుంచి వినిపించే ‘శృతి’మించిన అసహజ శబ్దాలు నాస్తికులకు సహజంగా అనిపిస్తాయి కదా. ఈ తీర్పు ప్రాక్టికలిటీకి ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే!


Tri Ten B
temple not a picnic spot

Madras High Court on Entry to Temples: ఎన్నో చారిత్రక, అపూరూప కట్టడాలకు నిలయమైన భారత్‌లో పురాతన ఆలయ నిర్మాణాలు నేటి సాంకేతిక యూగంలోనూ అద్భుతాలగానే కనిపిస్తాయి. బడా, నయా ఇంజినీయర్లు సైతం ఆశ్చర్యపోయేలా గుడి కట్టడాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా తమిళనాడులోని మధురై, తాంజావుర్‌లో ఆలయాలకు వెళ్లిన వారు వాటి నిర్యాణశైలి చూసి ఔరా అనకుండా ఉండలేరు. ఇవి భారతీయ వారసత్వ సంపదకు చిహ్నాలు. దీన్ని కాపాడుకోవడం ప్రభుత్వ, ప్రజలందరి బాధ్యత కూడా. వాటిని చూసి తరించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే మతం మాటున ప్రజల స్వేచ్ఛను హరించాలని చూస్తే? చారిత్రక గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చిల ప్రవేశం మతాల ఆధారంగా అనుమతివ్వాలని నిర్ణయిస్తే? ఇది మన వారసత్వ సంపదను అవమానించినట్టే, అగౌరవరిచినట్టే. అన్యమతస్తులకు, నాస్తికులకు తమిళనాడులోని ఆలయాల ప్రవేశంపై మద్రాస్‌ హైకోర్టు(Madras HighCourt) ఇటీవలి ఇచ్చిన తీర్పు చూస్తే అహేతుకంగా అనిపించక మానదు.

అలా వెళ్లకూడదని దేవుడు చెప్పాడా?
మా దేవుడు అందరివాడని.. ఇతర మతాలలా కాకుండా నాస్తికులను కూడా తమ మతం గౌరవిస్తుందని చెప్పుకునే కొందరు మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమర్థిస్తుండడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఇతర మతాల వారికి, నాస్తికులకు ఆలయ ధ్వజస్తంభం దాటి లోపలికి అనుమతి లేదని.. ఇది తమిళనాడులోని అన్ని దేవాలయాలకు వర్తిస్తుందని మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆలయాలు పిక్నిక్ స్పాట్స్ కావని జడ్జిగారు చెప్పుకొచ్చారు. నిజమే ఆలయాలు భక్తికి కేంద్రాలు.. అవి పిక్నిక్ స్పాట్స్‌ కావు.. అయితే ఈ ఆలయాలు కట్టినవారిలో అన్యమతస్తులు, నాస్తికులు లేరా? రాళ్లు, రప్పలు మోసి.. ఒళ్లు హూనం అయిపోయేలా చెమటొడ్చిన శ్రమిక జీవులంతా హిందూవులేనా? ధ్వజస్తంభం దాటి తనని నమ్మనివారు ఆలయం లోపలకి రావొద్దని ఏ హిందూ దేవుడు ఎక్కడ చెప్పాడు?

ముఖంపై రాసి ఉంటదా?
పేరు చూసి ఏ మతస్తుడో కొన్నిసార్లు, కొన్నిమతాల్లో సాధ్యం కావొచ్చు. ఈ పేరు పెట్టుకున్నారు కాబట్టి.. అతను/ఆమె ఈ మతానికి చెందినవారే అని చెప్పడం కూడా సాధ్యపడదు. పార్శిలు, ముస్లింల పేర్లు ఒకలాగే ఉంటాయి. ఇక పెరిగిన తర్వాత మతమార్పిడిలు చేసుకున్న హిందూవులకు పుట్టినప్పటి పేరే ఉంటుంది. కొంతమంది హిందు కుటుంబాల్లో పుట్టి నాస్తికులగా పెరుగుతారు. వీరంతా హిందూ దేవుళ్లని విశ్వసిస్తారో లేదో చెప్పడం ముఖం చూసి సాధ్యం కాదు. ప్రభుత్వ ఆధారిక ఐడీల్లో వీరి మతం హిందూగానే ఉండొచ్చు. కోర్టు తీర్పు ప్రకారం ఆ సంబంధిత ఆలయంలో దేవుడిని విశ్వసించని వారు ధ్వజస్థంభం దాటి లోపలికి వెళ్లవద్దు. కానీ ఈ పైన చెప్పిన క్యాటగిరీల్లోని వర్గాలు దేవుడిని నమ్ముతాయో లేదో ముఖం చూసి ఎలా చెప్పగలరు? జడ్జిగారి ప్రకారం వారంతటా వారే ఈ విషయాన్ని చెప్పకోవాలేమో.. అయినా నాస్తికులు జైశ్రీరామ్‌ అనడానికి, అవసరం అయితే బొట్టుపెట్టుకోవడానికి మసీద్‌కు వెళ్లాలంటే ‘అల్లా’ అనడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఈ భక్త, ఉన్మాద నినాదాలు, పండుగుల వేళ లౌడ్‌ స్పీకర్ల నుంచి వినిపించే ‘శృతి’మించిన అసహజ శబ్దాల నాస్తికులకు సహజంగా అనిపిస్తాయి కదా. ఈ తీర్పు ప్రాక్టికలిటీకి ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే!

Also Read: ఇదేనా మోదీ గారు అవినీతి నిర్మూలన అంటే.. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో దిగజారిన ఇండియా ర్యాంకు !

 

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *