Menu

New Year Plans: తెలంగాణ టూరిజం గోవా టూర్ ప్యాకేజ్‌.. న్యూఇయర్‌కి భలే ఆఫర్‌ బాస్‌.. పూర్తి వివరాలివే!

Lakshmi Aruna 2 months ago
goa tour package new year package

కొత్త సంవత్సరం ప్లాన్స్ ఏం చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎలా ఎంజాయ్ చెయ్యాలి?

కొత్త ఏడాదికి కౌంట్‌డౌన్ మొదలవడంతో న్యూఇయర్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలని ఆలోచించే వాళ్లకు ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ వచ్చింది. తెలంగాణా టూరిజం గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

సాధారణంగా గోవా(Goa) అంటే మనకి మొదట గుర్తొచ్చేది.. బీచ్‌లు, నైట్ లైఫ్, కార్నివల్స్. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో గోవా మొత్తం ఫెస్టివల్స్‌తో కళకళలాడిపోతుంది. అందుకే తెలంగాణ టూరిజం ఈ టైమ్‌ఫ్రేమ్‌నే టార్గెట్ చేస్తూ.. నాలుగురోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ విడుదల చేసింది. ఈ ప్యాకేజ్‌లో ఏం ఉన్నాయో తెలుసుకోవాలి.

ప్యాకేజీలో ఏం కవర్ చేస్తున్నారు?

మొదటిగా, ట్రావెల్. హైదరాబాద్ నుంచి నేరుగా AC బస్సుల్లో ప్రయాణం. రోడ్ ట్రిప్ ఫీలింగ్, కొత్త సంవత్సరం మూడ్.. ఇవన్నీ కలిసిన ప్రయాణమే ఓ సెలబ్రేషన్‌లా ఉంటుంది. తర్వాత, అక్కడ చేసే బస. గోవాలో డేస్‌ టూ డే ఎంజాయ్ చేయడానికి మంచి స్టే ఏర్పాటు చేస్తున్నారు.

ప్యాకేజీలో నార్త్ గోవా, సౌత్ గోవా.. రెండింటినీ కవర్ చేస్తారు. నార్త్ గోవాలో కలంగూట్, బాగా, అంజునా లాంటి బీచ్‌లు ఉన్నాయి. అక్కడి లోకల్ మార్కెట్లు.. బీచంతా లైవ్ మ్యూజిక్, పార్టీలు.
సౌత్ గోవా అయితే కాస్త శాంతమైన, క్లాసీ, బీచ్ వైబ్స్ కలిగిన ప్రదేశం. కొల్వా, మిరమార్ లాంటి బీచ్‌లతో పాటు అందమైన ల్యాండ్‌స్కేప్స్, ప్రశాంతమైన వాతావరణం. ఇవి పూర్తిగా గైడ్ ద్వారా చూపిస్తారు, కాబట్టి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఫుల్‌గా బీచ్‌ ఫెస్టివల్‌ ఎంజాయ్ చేయవచ్చు:

డిసెంబర్ 28 నుంచి 30 వరకు గోవా బీచ్ ఫెస్టివల్స్ అంటే… అతి పెద్ద క్రౌడ్, నాన్-స్టాప్ ఎంజాయ్‌మెంట్. హాలీవుడ్ స్టైల్ లైట్స్, DJ నైట్స్, ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. గోవాలో ఇది రోటీన్ కాదు.. ఇది ఒక ఎక్స్‌పీరియన్స్. ఈ ప్యాకేజ్ టైమింగ్స్ కూడా అదే దృష్టిలో ఉంచుకుని పెట్టారు. అంటే ప్రత్యేకంగా ఫెస్టివల్ సీజన్‌ను ఎంజాయ్ చేయడానికి ఇది పెర్ఫెక్ట్ టైమ్ అన్నమాట.

ఇక ఫేర్ విషయానికొస్తే… పెద్దల కోసం రూ.11,999.. పిల్లల కోసం రూ.5,999. ఈ బడ్జెట్‌లో ట్రావెల్, బస, సైట్‌సీయింగ్ అన్నీ కలిపి రావడం నిజంగా మంచి డీల్ అనే చెప్పొచ్చు కదా. అంతేకాదు, ప్రభుత్వ టూరిజం ప్యాకేజ్ కావడంతో సేఫ్టీ, ప్లానింగ్.. రెండూ బాగానే ఉంటాయి. ఏం ప్లాన్ లేకుండా కొత్త సంవత్సరం వచ్చేసింది అనుకుంటే.. గోవా బీచ్ మీద సూర్యాస్తమయం చూస్తూ కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెయవచ్చు. ఇది చాలా మందికి డ్రీమ్. తెలంగాణా టూరిజం మీ డ్రీమ్‌ని రియాలిటీగా మార్చే అవకాశం ఇస్తోంది. ఇంకెందుకాలస్యం… మీరూ కొత్త సంవత్సరాన్ని ఒకసారి గోవా స్టైల్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఈ ప్యాకేజ్ మీకోసమేనండి. మీరు వెళ్లాలనుకుంటే బుకింగ్స్ త్వరగా చేసేయండి.. ఎందుకంటే డిసెంబర్ ప్యాకేజీలు చాలా ఫాస్ట్‌గా ఫుల్ అయిపోతాయి.

ALSO READ: ప్రపంచాన్ని నడిపించే ఒక్కే ఒక్క శక్తి ఎంపతి.. బండరాళ్ల లాంటి మనసులను కూడా కరిగించగలదు!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *