Menu

Monarch Modi Part 4: మోదీ పచ్చి అబద్ధాలు.. ఏకంగా సుప్రీం తీర్పునే మార్చేస్తున్నారుగా!

Tri Ten B

Modi Lying On Electoral Bonds: ఏది చెప్పినా నమ్మే భక్తజనం ఉంటే నోటికి ఏది అనిపిస్తే అది అనేసే రకం మోదీ. నిప్పు లాంటి నిజాన్ని కూడా పచ్చి అబద్ధంగా సృష్టింగలడాయన. పచ్చి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించగల నేర్పరి మన విశ్వగురువు. ఆయన ఆస్కార్‌ నటన ఏ రేంజ్‌లో సాగుతుందంటే ఏకంగా సుప్రీంకోర్టు తీర్పునే మ్యాన్యుపులేట్ చేసే అంతలా. ఎలక్టోరల్‌ బాండ్స్‌ విషయంలో బీజేపీని సుప్రీంకోర్టు చివాట్లు పెడితే మోదీ మాత్రం బాండ్లతో అవినీతిని తరిమేశానని చెప్పుకుంటున్నారు. బాండ్లతో బ్లాక్‌ మనీని అరికట్టామంటున్నారు. ఎంత దారుణం.. ఎంత ఘోరం.. ఇంత డైరెక్టుగా పచ్చి అబద్ధం చెబుతున్న మోదీని ఏం అనాలి? అది నమ్ముతున్న ఆయన పరివారాన్ని ఏం అని పిలవాలి? ఏమో ఎవరికి నచ్చింది వారు పిలుచుకోవచ్చు.. అనుకోవచ్చు.. మోదీనే రాముడు అని అనుకోవచ్చు.. నమ్మేవారంతా భక్తులు కావొచ్చు!

ఇది తెలివైన పని కాదు.. నీతిమాలిన పని:
మోదీ చెబుతున్నదాని ప్రకారం బాండ్లతో నల్లధనం బయటపడిందట. ఓవైపు సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెబితే మోదీ మాత్రం ఇదంతా అవినీతి నిర్మూలనలో భాగంగా చెప్పుకుంటున్నారు. ఆయనకు కొమ్ముకాసే మీడియా సంస్థలతో మోదీ, షా ఇచ్చే ఇంటర్వ్యూలు చూస్తుంటే ఇన్నీ అబద్ధాలు ఇలాంటి స్థాయిలో ఉన్నవారు చెబుతారా అని అనిపించకమానదు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని పట్టుకోని గ్లోరిఫై చేస్తుండడంతో పాటు అసలు ఏదో తెలివైన పని చేసినట్టుగా మోదీ మీడియా ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే జనాల ఆలోచనలు ఎంతలా డైవర్ట్ చేస్తున్నారో క్లియర్‌కట్‌గా అర్థం అవుతుంది.

దొంగల డబ్బులు వాడుకున్న పెద్ద దొంగలు:
ఎలక్టోరల్ బాండ్ల వల్ల నల్ల డబ్బు జాడ దొరికందట. ఇదంతా మోదీ చెబుతున్న మాట. సరే.. బాండ్లు ఇచ్చినవారంతా అక్రమంగా సంపాదించినవారే అనుకుందాం. మరి ఆ డబ్బంతా ఎవరికి చేరింది? ఎలక్టోరల్‌ బాండ్లతో లాభపడింది బీజేపీనే కదా. అంటే అవినీతి సోమ్ము మొత్తం ఎవరికి చేరినట్టు? ఇలా అవినీతి సోమ్ముతో పార్టీని నడిపించడం కూడా అవినీతి కిందకే వస్తుంది కదా! ఏదో దొంగలు డబ్బులు తీసుకున్నామని అర్థం వచ్చేలా మాట్లాడితే ఎలా? దొంగల డబ్బులు వాడుకోవడానికి బీజేపీ ఎవరు? అయినా బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్లు ఎక్కువగా ఇచ్చినవారిలో మెజార్టీ వారంతా బీజేపీతో సత్ససంబంధాలు కలిగి ఉన్నవారే. మరి వాళ్లదే అవినీతి సోమ్ము అయితే ఇప్పటివరకు సంబంధిత డోనర్లపై చర్యలేవి?

ఎంత డబ్బు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి.. మీ పేర్లు బయటకు చెప్పం.. ఇది ఎలక్టోరల్‌ బాండ్స్ స్కీమ్‌. ఇది స్కీమా స్కామా అన్నది సుప్రీంకోర్టు ఏనాడో తేల్చేసింది. లీగల్‌గా ఇంత భారీ కుంభకోణానికి తెరలేపి, పార్టీ ఖాతాలో వేల కోట్లు జమ చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా సుప్రీం తీర్పును తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది.

Also Read: రూల్స్‌ అనామకులకేనా? పెద్దాయనకు వర్తించవా? ఏంటీ వివక్ష?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *