Menu

స్నేహానికన్న మిన్న ఏమున్నది రా కన్నా! సాయం చేసిన వారిని మరువని ధోని !!

Sumanth Thummala

మహేంద్ర సింగ్ ధోని క్రీడా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ సామ్రాజ్యంలో తనకంటూ ఒక గొప్ప చరిత్రను సృష్టించుకున్న అమోఘమైన ఆటగాడు ధోని. దేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రీడాకారుల్లో ఒకడిగా ఉంటూ తను ఏం చేసినా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

అయితే తను వ్యక్తిగా బంధాలకు, స్నేహానికి ఎంతో విలువిస్తాడని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. విరాట్ కోహ్లీ సురేష్ రైనా జడేజా లాంటి క్రికెటర్లు ఈ విషయం అనేక వేదికల్లో పంచుకున్నారు.

చిన్ననాటి స్నేహం!

 

తాజాగా ఐపీఎల్ 2024 కోసంి ప్రాక్టీస్ మొదలుపెట్టిన మహేంద్రుడు తన బ్యాట్ స్టిక్కర్ తో వార్తల్లోకి ఎక్కాడు. ప్రైమ్ స్పోర్ట్స్ అనే స్టిక్కర్ అన్న బ్యాట్ తో నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ప్రైమ్ స్పోర్ట్స్ ఎవరా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే ధోని చిన్ననాటి స్నేహితుడు పరంజిత్ సింగ్ రాంచీలో నడుపుతున్న స్పోర్ట్స్ షాప్ పేరే “ప్రైమ్ స్పోర్ట్స్” అని వెంటనే నెటిజన్లు పసిగట్టారు. ధోని చిన్నతనంలో సాయం స్నేహితుడి కోసం ఆ స్టిక్కర్ను వేసుకొని తన స్నేహాన్ని చాటుకున్నాడు.

గుర్తుపెట్టుకున్న సహాయం;

దాంతోపాటు తనకు బ్యాట్ స్పాన్సర్ చేసిన BAS(Beat All sports ) కంపెనీ ఓనర్ సుమిత్ కోహ్లీ ధోని గురించి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నాడు. 2019 ప్రపంచ కప్ లో తను BAS కంపెనీ స్పాన్సర్ చేసిన బ్యాట్ వాడాడు. అయితే దానికి సంబంధించి తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తను ఎంత చెప్పినా ధోని ఒప్పుకోలేదని, పైగా తాను ధోని భార్య సాక్షి, తల్లిదండ్రులకు స్నేహితులకు చెప్పిన వినలేదని చెప్పారు. బ్యాట్ స్పాన్సర్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న ధోని స్నేహం కోసం తన కెరీర్ మొదట్లో సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆ కంపెనీ స్టిక్కర్‌ ని 2019 ప్రపంచ కప్ లో తన ఆఖరి ఇన్నింగ్స్ వరకు వాడాడు. అలా తన కెరీర్ మొదట్లో వాడిన స్టిక్కర్ నే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ లో వాడాడు.

ఇలా ధోని తన వ్యక్తిత్వంతో ఎంతో ఆదర్శంగా నిలిచాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐపీఎల్ లోనే విజయవంతమైన కెప్టెన్ గా, డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపిఎల్ లో 17వ ఎడిషన్లో అడుగు పెడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన జట్టును ముందుకు తీసుకెళ్లనున్నాడు. గత సంవత్సరమే తను రిటైర్ అవుతాడని భావించినప్పటికీ తనను అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారని వారి కోసం తన ఫిట్నెస్ ను కాపాడుకొని మరొక ఏడాది ఆడేందుకు ప్రయత్నిస్తానని 2023 ఫైనల్ విజయం తర్వాత వాఖ్యానించాడు. ఈ ఏడాది ఆ మాటను నిలబెట్టుకోవడానికి చెమటోడుస్తున్నాడు.

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *