ఇండోనేషియా(Indonesia)లో నిలబడి ఉన్న మౌంట్ సెమెరూ ఒక నిద్రలేని రాక్షసిలా కనిపిస్తుంది. తూర్పు జావాలో ఉన్న ఈ అగ్నిపర్వతం(Volcano) ఒక్కరోజులో అనేకసార్లు విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ద్వీపంలో ఉంది. రోజంతా జరిగిన విస్ఫోటనం కారణంగా అనేక గ్రామాలు బూడిదతో నిండిపోయాయి. సెమెరు(Semeru) పర్వతం మీదుగా పైకి ఎగసిపడుతున్న బూడిద మబ్బులు ఆకాశాన్ని నెమ్మదిగా మింగేస్తూ ఒక నల్లటి తెరలా మారుతున్నాయి. గ్రామాల్లో ఉన్న పిల్లలు ఆకాశం బూడిదగా ఎందుకు మారిందో అర్థం కాక భయంతో ఇళ్ల గుమ్మాల వద్ద నిలబడి ఉన్నారు. ఈ అగ్నిపర్వతం ఏ క్షణమైనా తన అంతరాళంలో దాచుకున్న అగ్ని ప్రవాహాలను విడుదల చేసేలా కనిపిస్తోంది.
రాళ్లు కూడా పగిలిపోతాయ్:
నిజానికి అగ్నిపర్వతం నిద్రలో ఉంటే.. అది శాంతంగా ఉంటుంది కానీ.. ఒకసారి మేల్కొంటే భూమి స్వరమే మారిపోతుంది. భూమి లోతుల్లో ఉన్న వేడి రాయి పైకి నెమ్మదిగా వస్తుంది. ఆ సమయంలో పర్వతం శరీరం అంతా ఒత్తిడితో నిండిపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చినప్పుడు బూడిద గాలిలా కాదు విషంలా గ్రామాల మీద పడి ప్రతిచోటా అంధకారాన్ని విస్తరిస్తుంది. ప్రజలు పరుగులు తీస్తూ బయటకు వచ్చిన వేడి మబ్బుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ.. పర్వతం శ్వాస మరింత వేగంగా మారుతుంది. ఆ గర్జన చెవుల్లో పిడుగులా పడుతూ ఎప్పుడు ఏ దిశలోనైనా మరొక విస్ఫోటనం జరగవచ్చని గుర్తుచేస్తుంది. అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి గాలి చెట్లపై పడగానే ఆకులు ఎండిపోతాయి. రాళ్లైనా ఆ వేడి తట్టుకోలేక పగిలిపోతాయి.
చరిత్రలో ఏం జరిగింది?
చరిత్రలో ఎన్నో పర్వతాలు తమ ఆగ్రహంతో గ్రామాలను అంధకారానికి అప్పగించాయి. ప్రపంచంలో పలుచోట్ల పూర్వకాలంలో జరిగిన విస్ఫోటనాలు చాలా పట్టణాలను ఒక్క క్షణంలో మాయం చేశాయి. పుస్తకాల్లో కనిపించే ఆ కథలు కేవలం చరిత్రలా అనిపించినా నిజంగా అవి భయంకరమైన గాయాల గుర్తులండి. ప్రతి అగ్నిపర్వతానికి తన సొంత గతం ఉంటుంది. అది శతాబ్దాలు పాటు నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా మేల్కొనే శక్తిని కలిగి ఉంటుంది. మౌంట్ సెమెరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా విస్ఫోటనాలు చేస్తూనే ఉంది. ప్రజలు ఆ ప్రమాదాన్ని తెలిసినా దాని పాదాల వద్ద జీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడి నేల చాలా సారవంతంగా ఉంటుంది. కానీ ఆ సారవంతమైన నేల కింద దాగి ఉన్న అగ్ని శక్తి ఎప్పుడు మళ్లీ పైకి లేస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఇటు భూమి అంతర్భాగంలో ఎప్పుడూ తీవ్రమైన వేడి ఉంటుంది. ఆ వేడి రాయి ద్రవంలా కరిగి మగ్గిన పదార్థంగా మారుతుంది. భూమి పొరలు పెద్ద పలకల్లా కదులుతూ ఒకదానిపై ఒకటి రుద్దుకుంటూ కొత్త పగుళ్లు తెరుస్తాయి. ఆ పగుళ్లలోంచే ఆ వేడి పదార్థం నెమ్మదిగా పైకి రావడం మొదలవుతుంది. అది పర్వతం లోపల చేరి అక్కడ ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. చివరికి ఆ ఒత్తిడి భరించలేక పర్వతం పైభాగంలో ఒక మార్గాన్ని తెరిచి అగ్ని ప్రవాహం బయటకు దూసుకెళ్తుంది.
తాజాగా జరిగిన విస్ఫోటనం కూడా అలానే జరిగింది. సెమెరు పర్వతం తన కోపాన్ని దాచుకోలేదు. బూడిద మబ్బులు గ్రామాల మీద పడి ఇళ్లను కప్పేశాయి. వేడి మిశ్రమాలు.. పర్వతం నుంచి బయటికి పరుగులు తీశాయి. కొన్ని ప్రవాహాలు 7కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్లాయి. ఆకాశంలో 2కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద కనిపించింది. ప్రజలు ఆ శబ్దాలను విని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా నేల గట్టిగా కంపించింది. అధికారులు అత్యంత అప్రమత్తతను ప్రకటించారు. ఎందుకంటే పర్వతం ఇంకా పూర్తి స్థాయిలో శాంతించలేదు. దాని గుండె ఇంకా వేడిగానే కొట్టుకుంటోంది. ప్రకృతి ముందు ఎప్పటికీ మనం పెద్దవాళ్లు కాదు. అగ్నిపర్వతం మనకు చూపే కోపం భూమి ఎంత శక్తివంతమో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. సెమెరూ లాంటి పర్వతాలు మనకు ఒకే సందేశం ఇస్తాయి. ఈ భూమి జీవించే ఉంటుంది కానీ.. దాని శ్వాస ఎప్పుడో ఒక రోజు మళ్లీ గర్జించవచ్చు. అందుకే మనం ప్రకృతిని గౌరవించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి కోపం ఒక్కసారిగా బయటపడితే మనం దానికి ఎదురు నిలబడలేమండి. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు..!
ALSO READ: SIPలో ఏది బెస్ట్? నెలకు రూ.5,000 లేదా? ఏడాదికి రూ.60,000? ఏది లాభం?

Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!
Indonesia: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
Indonesia: షేక్.. షేకాడిస్తోంది.. నెల రోజుల్లో 1400 భూకంపాలు.. ఆ దేశానికి ఏమైంది?
Hayli Gubbi Volcano: ఇథియెపియా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సంచలన నిజాలు.. శాటిలైట్ చిత్రాలు చెబుతున్నది ఏంటంటే?
Ethiopia Volcano Eruption: ఇండియావైపు దూసుకొచ్చిన భారీ బూడిద.. ఆ అగ్నిపర్వతం పేలుడుతో ముప్పు పొంచి ఉందా?
Volcano Eruption: భయం పుట్టిస్తోన్న అగ్నిపర్వతం.. సముద్ర గర్భంలో పేలనుందా?