Menu

Monkey Pox: మంకీపాక్స్ మానవ సృష్టా? అమెరికానే పుట్టించిందా?

Tri Ten B
monkey pox cases

మంకీపాక్స్‌(Monkey Pox)ను అమెరికా సృష్టించిందా? ఓ బయోలాజికల్‌ వెపన్‌లా దీన్ని ల్యాబ్‌లో పుట్టించిందా? ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఇది అగ్రరాజ్యం క్రియేట్ చేసిన వైరసేనా? ఇలా ఎన్నో ప్రశ్నలను ఓ వర్గం లేవనెత్తుతోంది. అయితే ఇందులో నిజమేంత?

ఇండియాలో తొలి అనుమానిత కేసు

మంకీపాక్స్‌.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది..! ఆఫ్రికాలో వణుకు పుట్టించిన ఈ వైరస్‌ తర్వాత యూరప్‌, ఆసియా దేశాలకూ వ్యాపించింది. ఇటు ఇండియాలోనూ ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు తేలింది. అతని రక్తనమూనాలను టెస్ట్‌ చేస్తున్నారు డాక్టర్లు. ఇక మంకీపాక్స్‌ 2024లో మొత్తం 120కు పైగా దేశాలకు విస్తరించింది. లక్ష మందికిపైగా కేసులు ఈ ఒక్క ఏడాదే రికార్డయ్యాయి. ఇందులో 220 మందిని బలిగొంది. ముఖ్యంగా ఆఫ్రికాలోని కాంగోలో ఈ వైరస్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

మానవ సృష్టా?

అయితే మంకీపాక్స్ అన్నది మానవ సృష్టి అంటూ చాలా మంది చైనీయులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా నిజం కాదని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చైనా ఇలా కావాలనే ఆరోపిస్తోందని చెబుతున్నాయి. చైనా అసత్య ప్రచారం వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రపంచాన్ని మూడేళ్ల పాటు ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ కేసు మొదటగా చైనాలోని వుహాన్‌లో రికార్డయింది. దీంతో ఇది చైనా సృష్టించిన వైరస్‌గా నాడు అమెరికా ప్రచారం చేసింది. దీని గురించి నిజనిజాలు తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో పర్యటించింది కూడా. అయితే కరోనా ల్యాబ్‌లో పుట్టిందని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు.

బిల్‌గేట్స్‌ హస్తం ఉందా?

నిజానికి కరోనాను చైనా వైరస్‌గా పిలిచి, అదే పేరును వ్యాప్తి చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది. నాటి పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకించిన చైనా.. ఇప్పుడు రీవెంజ్‌ మోడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే చైనీయులు సోషల్‌మీడియాలో ఈ రకమైన అసత్య ప్రచారం చేస్తున్నట్టు ఉన్నారు. ఇక బిల్ గేట్స్ ఈ మంకీపాక్స్‌ సృష్టికి కారణమని 2022లో రష్యా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఓ వ్యాధి విషయంలో నిజాన్ని పక్కనపెట్టి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం ద్వారా అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజకీయాలు చేయడం మానుకుంటే ఏ దేశానికైనా మంచిది.

ల్యాబుల్లో పుట్టించవచ్చా?

నిజానికి పరిశోధన ప్రయోజనాల కోసం ప్రయోగశాలలలో వైరస్‌లు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. సైంటిస్టులు తరచుగా ల్యాబ్‌లలో వైరస్‌లను వాటి పనితీరును అర్థం చేసుకోవడానికి, వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడానికి లేదా చికిత్సలను రూపొందించడానికి అధ్యయనం చేస్తారు. చారిత్రాత్మకంగా, కొన్ని దేశాలు వైరస్‌లను జీవ ఆయుధాలుగా ఉపయోగించడాన్ని అన్వేషించాయి. అయితే, ఇలాంటి కార్యకలాపాలను అంతర్జాతీయ చట్టాలు నిషేధించాయి. అయితే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వైరస్‌లు సృష్టించిన తర్వాత అవి లీక్‌ అయితే మానవళికి పెను ముప్పు వాటిల్లుతుంది. కరోనా వైరస్‌ విషయంలో చైనా ఈ తప్పిదమే చేసిందని పలు దేశాలు ఆరోపించగా అవి నిజాలు కాదని తేలింది.

ఇది కూడా చదవండి: ఇక నుంచి భారత్‌లో గంజాయి లీగలే..! ఈ నిర్ణయం ఎవరి కోసం? ఎందుకోసం?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *