Menu

Monarch Modi Part 2: మణిపూర్‌ అల్లర్లను ఆపలేదు కానీ.. యుక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపారట! ఆ యాడ్‌ను ఏం ముఖం పెట్టుకోని తీశారు భయ్యా!

Tri Ten B
A number of tweets started coming in hailing PM Modi, as reports emerged that Russia had stopped the war for India.

Did Modi Stopped Russia_Ukraine War? : గతేడాది మేలో మణిపూర్‌ అల్లర్లలో ఓ మహిళను వివస్త్రను చేసి రోడ్డుపై ఊరేగించి అత్యాచారం చేశారు. దాదాపు 10 నెలల నుంచి మణిపూర్‌ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య కేంద్రం పెట్టిన చిచ్చుకు అమాయకులు ఎందరో బలయ్యారు. ఇంకా బలవుతూనే ఉన్నారు. మణిపూర్‌ ఒకప్పటిలా లేదు..అక్కడి అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. దేశంలోని ఈశాన్య ప్రాంతమైన మణిపూర్‌ సమస్యను పరిష్కరించలేని కేంద్రం ఏకంగా అక్కడెక్కడో ఉన్న రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపిందంట. అది కూడా ఆరు గంటల పాటు మోదీ కంటి సైగతో, నోటి మాటతో యుద్దాన్ని నిలిపివేశారట. మన మోదీ గారు ఆపమంటే ఆయన మాట విని పుతిన్‌, జెలెన్‌స్కీ యుద్దానికి బ్రేక్ ఇచ్చారట. ఇదంతా మోదీపై అభిమానంతో ఆయన వీర భక్తుడు చేసిన, చేస్తున్న ప్రచారం కాదు. సాక్ష్యాత్తు కేంద్రమే ఎండోర్స్‌ చెస్తున్న పచ్చి అబద్దం. ఇటివలీ బీజేపీ ఓ యాడ్‌ను జనాలపైకి వదిలింది. మోదీ గారు యుద్ధాన్ని ఆపించారని అప్పుడే తమ బస్సు కదిలిందని యుక్రెయిన్‌లో చిక్కుకోని ఇండియాకు తిరిగి వచ్చిన ఓ అమ్మాయి వాళ్ల అమ్మని హత్తుకోని బోరున ఏడ్చింది. ఇది ప్రభుత్వ ప్రకటన.. పచ్చి అబద్దపు ప్రకటన.. జనాలను వెర్రొలని చేసి ఓట్లు దండుకునే ప్రకటన. ఇది అబద్ధమని చెబుతున్నది ఏ యాంటీ-బీజేపీ పార్టీల నేతలో కాదు. స్వయంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చెప్పిన పచ్చి నిజం.

 

View this post on Instagram

 

A post shared by Voice Of Atheist (@voice_of_atheist)


అది నిజం కాదుగా:
ఓ అబద్ధాన్ని కోట్లమంది నమ్మినంత మాత్రానా అది నిజమైపోదు. నమ్మకం వేరు.. నిజం వేరు.. అబద్దాన్ని నిజంలాగా ప్రజలపై రుద్ది అదే నిజమని నమ్మించడం వేరు. ప్రస్తుతం మోదీ చేస్తున్నదేంటో ఆయన్ను విశ్వగురువుగా కీర్తించే భక్తజనానికే తెలియాలి. మోదీ రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపించారని అప్పట్లో మన బండి సంజయ్‌ డప్పుకొట్టారు.. ఆ తర్వాత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అదే చెప్పారు. దీంతో ప్రజలంతా అదే నిజం అనుకున్నారు. ఎలాగో బీజేపీ ఐటి వింగ్‌, మోదీ పీఆర్‌ ఇలాంటి అసత్యాలను నిజాలుగా చూపించడానికి చేయాల్సిందంతా చేసింది. సోషల్‌మీడియా అంతటా మోదీ యుద్ధాన్ని ఆపారంటూ మారుమోగింది. సరిగ్గా అప్పుడే విదేశాంగ మంత్రిత్వ శాఖ సీన్‌లోకి దిగింది. నిజాన్ని నిర్మోహమాటంగా, భయపడకుండా, తడబడకుండా చెప్పింది. మోదీ యుద్ధాన్ని ఆపారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తేల్చిచెప్పారు. ఇదంతా 2022 ముచ్చట. అయితే మరోసారి అబద్ధాన్నే అస్త్రంగా బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. ఎన్నికల అడ్వెర్‌టైజ్‌మెంట్‌ ముసుగులో అబద్దాన్ని ప్రమోట్ చేస్తోంది.

నిజంగా మోదీకి రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపించే శక్తే ఉంటే భారత భూభాగమైన మణిపూర్‌లో రెండు వర్గాల సమస్యను ఎప్పుడో పరిష్కరించేవారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. అయితే రచ్చ గెలిచి కూడా ఇంట గెలవచ్చు.. తప్పెమీ లేదు కానీ ఇంటా, రచ్చ రెండు చోట్లా ఓడిపోయి ప్రతీచోటా నేనే గెలిచా అని జనాలను బురిడి కొట్టించడం మోదీకే చెల్లుతుంది.

Also Read: భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు.. అభివృద్ది ఏది మోదీ? గుడి, దేశభక్తితో ఇంకెన్నాళ్లు ఓట్లు దండుకుంటావ్?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *