Menu

Monarch Modi Part 5 : అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?

Sumanth Thummala
modi hate speech

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎలక్షన్ కమిషన్ నియమాలను అతిక్రమించారు. నిండు సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా, అబద్ధాలు ఆడుతూ అడ్డంగా దొరికాడు.
రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సభలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదం రేపుతున్నాయి.

లేని మాటలు పుట్టించిన ప్రధాని!
సభలో భాగంగా మోదీ మాట్లాడుతూ, “కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొత్తం ఆస్తి సర్వే చేసి, ఆడవారి దగ్గర ఎంత బంగారం ఉందని, ఆదివాసుల దగ్గర ఎంత వెండి ఉందని, ప్రభుత్వ అధికారుల దగ్గర దగ్గర ఎక్కడెక్కడ ఎంత భూమి, డబ్బు ఉందని లెక్కలు తీస్తారు. అంతే కాకుండా సోదరీమణుల దగ్గర ఉన్న బంగారం, ఇతర ఆస్తి అంతా సమానంగా పంచుతారని “అని వ్యాఖ్యానించారు. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా? బంగారం కేవలం చూపడానికి మాత్రమే కాదు, అది స్త్రీ ఆత్మగౌరవం. ‘మంగళసూత్ర’ విలువ కేవలం బంగారం ధరకే పరిమితం కాకుండా వారి కలలతో ముడిపడి ఉంది. మీరు (కాంగ్రెస్) దాన్ని తీసేయాలని మాట్లాడుతున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. “కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోగా మారింది” అని అక్షేపించాడు.

అయితే మేనిఫెస్టోలో ఆ పదాలను వెతకగా అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ప్రజల సంపదను పంచుతామని, వెండి,బంగారం/మంగళ సూత్రాల గురించి లేదు. మేనిఫెస్టోలో కేవలం సామాజిక- ఆర్థిక, కుల గణన చేపడతామని పేర్కొంది.
ఇక మేనిఫెస్టోలో ముస్లిం అనే పదం ఒక్కసారి కూడా లేదు.

వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం:

ఈ అబద్ధాలు అక్కడితో ఆగలేదు. యుపిఏ -1 ప్రభుత్వం ఉన్న సమయంలో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నట్టు చెబుతూ, ‘ఈ దేశంలో సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉంటుంది అని అన్నారు, దాని అర్థం మన సంపాదనంతా తీసుకెళ్లి ఎవరికీ ఇస్తారు? ఎవరికైతే ఎక్కువ పిల్లలు పుడతారో వాళ్ళకి పంచుతారు. “చొరబాటుదారులకు” పంచుతారు.
ఇది అర్బన్ నక్సల్ ఆలోచన విధానం.. మహిళల మంగళ సూత్రాలు కూడా ఉండనివ్వరు” అని బహిరంగంగా మత విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడాడు.

వాస్తవం వేరు!
అప్పటి ప్రధాని మాట్లాడిన పూర్తి స్పీచ్ ను, బిజెపి ఐటీ సెల్ కట్ చేసి దశాబ్దం క్రితం నుంచే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని వైరల్ చేశారు. దేశంలో సంపద పైన మొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అనేలా ఆ వీడియోను సృష్టించారు.

[OLD] [REPOST] Manmohan Singh on First Claim on Resources for particularly ‘MUSLIM’ Minority.
byu/EclecticIndividual99 inIndiaSpeaks


అయితే వాస్తవానికి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 డిసెంబర్ 9న జరిగిన 52వ జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మాట్లాడుతూ, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు మరియు చిన్నారుల అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేయాలి. మనం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, మైనార్టీలు అందులో ముఖ్యంగా ముస్లింలు అభివృద్ధి ఫలాలను సమానంగా పొందాలి. వీరు వనరులపై మొదటి దావా కలిగి ఉండాలి అని ఆ సభలో మాట్లాడారు.

దీనిపై PMO అప్పట్లోనే స్పష్టత ఇచ్చింది..
“వనరులపై మొదటి క్లెయిమ్” అనే ప్రధానమంత్రి సూచన, ఎస్సీలు, ఎస్టీలు, OBCలు, మహిళలు మరియు పిల్లలు మరియు మైనారిటీల అభ్యున్నతికి సంబంధించిన కార్యక్రమాలతో సహా పైన పేర్కొన్న అన్ని “ప్రాధాన్యత” ప్రాంతాలను సూచిస్తుందని PMO తెలిపింది.

CLICK HERE FOR OFFICIAL PMO STATEMENT

ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్ర!

ప్రధాని మోదీ చేసిన ఈ విద్వేషపూరిత అబద్ధపు వ్యాఖ్యలపై ఈసీ మొదట వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.
తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది. వారితో పాటు, సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) అనేక ప్రజా సంఘాలు, పౌరులు కలిపి 17 వేల పైచిలుకు ఫిర్యాదులు చేశారు.
ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై దృష్టి సారించింది.

చట్టాలు ఏం చెప్తున్నాయి?:

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్లు 8, 123(3) ప్రకారం:
“వాక్ స్వాతంత్య్రాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించుకున్నందుకు దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తుంది.”

“అభ్యర్థి లేదా అభ్యర్థి సమ్మతితో మరెవరైనా వ్యక్తి తన మతం, జాతి ఆధారంగా ఓటు వేయమని లేదా ఓటు వేయకుండా ఉండమని . , కులం, సంఘం లేదా భాష ను వాడుకోవడం నిషిద్ధం.

సెక్షన్ 123(3A) & 125 ప్రకారం ఎన్నికల సమయంలో ఈ కారణాలతో పౌరులలో శత్రుత్వం లేదా ద్వేష భావాలను పెంపొందించడానికి అభ్యర్థి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తుంది. అవినీతి ఎన్నికల వ్యవహారానికి పాల్పడిన ఎవరైనా గరిష్టంగా ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడతారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 153(ఏ) ,153(బి) ప్రకారం, రెండు జాతుల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంపొందించడం నేరం. అలాగే సెక్షన్ సెక్షన్ 295 (ఏ) ప్రకారం కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్లకు దాదాపు మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

చిచ్చు పెట్టి చలిమంట కాచుకోవడం :

గత పదేళ్లుగా అధికారంలో‌ ఉన్న నరేంద్ర మోదీ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే పనుల గురించి కాకుండా, అబద్ధాల మీద, మత విద్వేషాల మీద ఓట్లు దండుకోవాలనే సంస్కృతిని ముందుండి నడిపిస్తున్నాడు. ఐటీ సెల్ ద్వారా నిత్యం ఎన్నో ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తూ దేశమంతటా తప్పుడు సమాచారాలను,విద్వేషాన్ని పెంచి పోషించే స్థాయి నుంచి నేరుగా ప్రజల ముందే ఎన్నో సార్లు మోదీ, ఇతర బిజెపి నేతలు రెచ్చగొడుతున్నారు.
ఎన్నికల ప్రచారాలలో మతాలను, సైనికులను తప్పుడు ఏజెండాలతో తీసిన సినిమాలను సైతం వదలలేదు బిజెపి నాయకత్వం. రాజ్యాంగం,‌చట్టాలు, నిబంధనలు ఇవేవి వీళ్ళకి పట్టవు. గత పదేళ్ళలో డీమోనెటైజేషన్, నిరుద్యోగం, పేద ధనిక తారతమ్యాలు, మీడియా స్వతంత్రత, ద్రవ్యోల్బణం వంటి అంశాల గురించి అస్సలు మాట్లాడడానికి చేతకాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా వాళ్ల గొప్పతనం లా తప్పుడు ప్రచారం చేసుకోవడం తప్ప కనీసం పది ఏళ్లలో ఒక్క బహిరంగ ప్రెస్ మీట్ ను కూడా పెట్టని ఒకే ఒక్క ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు నరేంద్ర మోదీ.

చర్యలు తీసుకునే ధైర్యం ఈసీ కి ఉందా?

ఇదివరకు ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,ప్రధానమంత్రి, పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత కమిటీ ఆధ్వర్యంలో నియమింపబడేది. కానీ ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, ప్రకారం
ప్రస్తుతం ప్రధానమంత్రి, కాబినెట్ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కమిటీ నియమిస్తుంది.
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మినహా మిగతా ఇద్దరు కమిషనర్లను ఈ నూతన కమిటీ నియమించింది.
అయితే ఇప్పుడు ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

Also Read: మోదీ పచ్చి అబద్ధాలు.. ఏకంగా సుప్రీం తీర్పునే మార్చేస్తున్నారుగా!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *