Menu

Social Media Addiction: రాత్రివేళ ఇన్‌స్టాలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారా?


తల్లిదండ్రులు పిల్లల ముందు ఎక్కువ సేపు ఫోన్‌లో గడపకుండా వారితో సరదాగా గడపాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి.


Sumanth Thummala

స్మార్ట్ ఫోన్ మన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంట్లో అత్యవసరమైన మందులు అయినా ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రతి ఇంటా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో మొబైల్‌ అవసరాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం. ఒక పిల్లాడి హోం వర్క్ నుంచి ఆఫీసులో అప్డేట్స్ వరకు మందుల డెలివరీ నుంచి ఆహారం వరకు అనేక పనులు స్మార్ట్ ఫోన్ తో సులభంగా అవుతున్నాయి కాకపోతే ఈ మధ్య చాలా మందికి ఫోన్ వాడకం వ్యసనంగా మారి వాటికి బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని, మాట వింటారని ఫోన్‌ని వారంతట వారే పిల్లల చేతిలో పెడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే వీటికి అలవాటు పడి అందులోనే జీవితం గడిపేస్తున్న చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని వారి పెరుగుదలకు ఆటంకం కలుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

టీనేజర్స్ ఆ వయసు ప్రభావంతో రోజులో ఎన్నో గంటలు ఫోన్ తో సావాసం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లు అయిన ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, స్నాప్ చాట్ అంటూ అవే లోకంలా బతుకుతున్నారు. వారి వయసుకు మించిన కంటెంట్ కి బహిర్గతం అవుతున్నారు. సొంత వారి కంటే కళ్ళ ముందు లేని వ్యక్తుల మాటలు మెదడులో ఎక్కించుకుని ఎన్నో మానసిక రుగ్మతలకు, నిద్రలేమికి లోనవుతున్నారు.

మెటా నయా సొలూష్యన్:
ఇటువంటి వాటిని తగ్గించడానికి మెటా సంస్థ (ఫేస్బుక్) వాటి యాప్ లలో డిజిటల్ వెల్బీయింగ్ అని కొన్నాళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం టీనేజర్స్ వాడకం కోసం “నైట్ టైం నడ్జైస్” అనే ఫీచర్ ను తెచ్చింది.

ఏంటీ ఫీచర్?
టీనేజర్స్ లో నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణం ఈ సోషల్ మీడియా యాప్ లు కాబట్టి దాన్ని మెటా గుర్తించింది. పిల్లల ఆరోగ్యం గురించి తాము ఆలోచించామని చెబుతోంది. యువతకు నిద్ర చాలా ముఖ్యం కాబట్టే తాము కొత్త నైట్‌టైమ్ నడ్జ్‌ అని ప్రారంభించామని అంటోంది. ఇది టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినప్పుడు చూపించే రీల్స్ లేదా డైరెక్ట్ మెసేజ్‌ల లాంటి ప్రదేశాలలో అర్థరాత్రి కనిపిస్తుంది. మెటా లో అకౌంటెంట్ క్రియేట్ చేసుకోవాలంటే మనం వయసును నమోదు చేసుకోవాలి కాబట్టి దాని ఆధారంగా టీనేజ్ పిల్లలకు ఈ అలెర్ట్ అటోమేటిక్‌గా వస్తుంది.

ఆంక్షల భయంతోనే చేస్తున్నారా?
పిల్లల ఆరోగ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడానికి మెటా నియంత్రణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున వారికోసం భద్రతా అవసరాలు వచ్చాయి. కంపెనీ జనవరి 31న పిల్లల భద్రతపై యూఎస్ సెనేట్ ముందు సాక్ష్యమివ్వనుంది. ట్విట్టర్, టిక్‌టాక్, స్నాప్ అండ్‌ డిస్కార్డ్‌ల నుంచి ఎగ్జిక్యూటివ్‌లు కూడా సాక్ష్యమివ్వనున్నారు. ఆన్‌లైన్‌లో పిల్లలను రక్షించడంలో తమ ప్లాట్‌ఫారమ్‌ల అసమర్థతపై కమిటీ సభ్యులు కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్‌లను ప్రెస్ చేయాలని భావిస్తున్నారు. ఉ యాప్‌లు యువ వినియోగదారుల మానసిక ఆరోగ్య సమస్యలకు దోహదపడుతున్నాయని ఆరోపిస్తూ 40 కంటే ఎక్కువ రాష్ట్రాలు మెటాపై దావా వేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల భద్రతా సమస్యలపై కంపెనీ ప్రతిస్పందన గురించి మరింత సమాచారం కోరుతున్న యూరోపియన్ యూనియన్ రెగ్యులేటర్‌ల నుండి మెటా సమాచారం కోసం మరొక ఫిర్యాదు కూడా అందుకుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా యాప్ లు సరిగ్గా ఉండాలి అని మనం ఆశించడం కంటే మనం నియంత్రించడం అత్యవసరం. పేరెంట్స్ పిల్లలకు ఎక్కువ సేపు ఫోన్ ఇవ్వకుండా ఎంతసేపు ఫోన్ వాడుతున్నారనేది చూడాలి. బాహ్య ప్రపంచంతో ఎక్కువ మమేకం అయ్యేలా చూడాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల ముందు ఎక్కువ సేపు ఫోన్ లో గడపకుండా వారితో సరదాగా గడపాలి.

Also Read: బాదం గింజలతో గుండె సమస్యలు పరార్.. ఎలానో తెలుసా?

 

 


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *