ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు..ఉన్నటుండి స్ట్రోక్ అని పడిపోతున్నారు..చిన్న వయసులోనే షుగర్లు..థైరాయిడ్లు..బీపీ డౌన్ అయిపోయి కింద పడుతున్నారు..ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అర్థం కానీ పరిస్థితి. మరోవైపు మనం కష్టపడి సేవింగ్స్ చేస్తున్నాం మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాం జీతం పెరిగే రోజుల కోసం ప్లాన్ చేస్తున్నాం. కానీ ఒక్కసారిగా ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఒక చిన్న ఆపరేషన్ లేదా హాస్పిటల్ బిల్ చూసి షాక్ అవుతాం. ఆ ఒక్క రోజు మన జీవితంలోని అన్ని ప్లాన్‌లు దెబ్బతింటాయి. మన సేవింగ్స్ ఖాళీ అవుతాయి మన డ్రీమ్స్ ఆగిపోతాయి. ఇది మాత్రమే కాదు భారత్‌లో రోజూ లక్షలాది మంది ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు. అయితే ఇలాంటి షాక్‌లను ఎలా అధిగమిస్తాం? మీ పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్‌లో మొదటి స్టెప్ ఏమిటి?
మెడికల్ ప్లాన్ తప్పనిసరి కదా?
ఇక మన భారత్‌లో పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడితే అందరూ ముందు స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్.. SIPలు.. గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తారు. ఇవి అన్నీ మంచివే డబ్బును పెంచుకోవడానికి గొప్ప రోడ్‌మ్యాప్. కానీ ఒక్క ఆరోగ్య సమస్య వచ్చినా ఈ అన్ని ప్లాన్‌లు వృథా అవుతాయి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ ఒక్కటే మీ సేవింగ్స్‌ను ఒక్క రాత్రికి శూన్యం చేయగలదు. ఇప్పుడు 2025లో భారత్‌లో హెల్త్‌కేర్ కాస్ట్‌లు గణనీయంగా పెరిగాయి. Aon రిపోర్ట్ ప్రకారం 2025లో మెడికల్ ఖర్చులు 13 శాతం పెరుగుతాయి ఇది గ్లోబల్ ఆవరేజ్ 10 శాతం కంటే ఎక్కువ. ఒక సాధారణ ఆపరేషన్ బిల్ రూ.2 లక్షలకు పైగా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అంటే లక్షలలో ఉంటుంది. ఇలాంటి రైజింగ్ కాస్ట్‌లు మన మధ్యలో లైఫ్‌స్టైల్ డిసీజెస్ డయాబెటిస్.. హార్ట్ ప్రాబ్లమ్స్ పెరగడంతో మరింత తీవ్రమవుతున్నాయి.
ఎంత కవర్ అవుతుంది?
ఇది కేవలం ఒక పాలసీ కాదు మీ ఫైనాన్షియల్ స్థిరత్వానికి బేస్. మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ 2025లో సుమారు 50 శాతం పాపులేషన్ మాత్రమే కవర్ అవుతోంది అంటే 55 కోట్ల మంది. కానీ ఇటీవలి మార్పులు దీన్ని మార్చాయి. సెప్టెంబర్ 22 2025 నుంచి GST కౌన్సిల్ డెసిషన్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం GST పూర్తిగా ఎక్సాంప్ట్ అయింది. దీంతో ప్రీమియంలు 18 శాతం తక్కువ అవుతున్నాయి డిమాండ్ 38 శాతం పెరిగింది. ఇప్పుడు యావరేజ్ కవరేజ్ అమౌంట్ రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెరిగింది ఇంకా 45 శాతం మంది రూ.15-25 లక్షల పాలసీలు ఎంచుకుంటున్నారు. ఇది మన మైండ్‌సెట్ మార్పును చూపిస్తోంది బేసిక్ కవరేజ్ కాదు రియల్ ప్రొటెక్షన్ కావాలి.
OPD కవరేజ్ అంటే?
మరోవైపు హాస్పిటలైజేషన్ మాత్రమే కాదు ఆధునిక హెల్త్‌కేర్ మరింత విస్తృతమైంది. ముఖ్యంగా అర్బన్ ఫ్యామిలీస్‌లో.. OPD కన్సల్టేషన్స్.. టెస్టులు.. క్రానిక్ కేర్ ఇవి పెద్ద ఎక్స్‌పెన్స్. యంగ్ పీపుల్లో లైఫ్‌స్టైల్ డిసీజెస్ పెరగడంతో రెగ్యులర్ చెకప్‌లు అవసరం. ఇవి హాస్పిటల్ బయట జరిగినా మీ బడ్జెట్‌ను డ్రైన్ చేస్తాయి. ఇప్పుడు మంచి పాలసీలు OPD కవరేజ్.. ప్రెవెంటివ్ చెకప్‌లు.. డయాగ్నస్టిక్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి. ఫ్యామిలీస్‌లో స్కూల్ గోయిల్స్ లేదా ఏజింగ్ పేరెంట్స్ ఉంటే ఇది మరింత ముఖ్యం. ఎల్డర్లీ కేర్..మెడిసిన్స్..చెకప్‌లు. కంటిన్యూస్ ఖర్చు. ఇలాంటి ప్లాన్‌లు ఈ రికరింగ్ ఎక్స్‌పెన్స్‌లను కవర్ చేసి మీ ఫ్యామిలీ బడ్జెట్‌ను సేఫ్ చేస్తాయి.
ప్రభుత్వ స్కీముల సంగతేంటి?
ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఇగ్నోర్ చేయకూడదో తెలుసా? అన్ని మెడికల్ కాస్ట్‌లు మీ పాకెట్ నుంచి వస్తాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగించాలి ఇన్వెస్ట్‌మెంట్స్ మధ్యలో రిడీమ్ చేయాలి లాంగ్-టర్మ్ గోల్స్ పోస్ట్‌పోన్ చేయాలి. ఇది మీ ఫైనాన్షియల్ ప్లాన్‌ను డిస్టర్బ్ చేస్తుంది. కానీ ముందుగా మంచి కవరేజ్ తీసుకుంటే రూటిన్ నుంచి క్రిటికల్ నీడ్స్ వరకు అన్నీ మేనేజ్ అవుతాయి. మీ హెల్త్ కండిషన్స్ మారినా ప్రొటెక్షన్ కంటిన్యూ అవుతుంది. మన గవర్నమెంట్ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తోంది. అయుష్మాన్ భారత్ PM-JAY స్కీమ్ 12 కోట్ల ఫ్యామిలీస్‌కు రూ.5 లక్షల కవరేజ్ ఇస్తోంది లో-ఇన్‌కమ్ హౌస్‌హోల్డ్స్‌కు ఫ్రీ హాస్పిటలైజేషన్. 2025లో ఇది మరింత విస్తరించింది సీనియర్ సిటిజన్స్‌కు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్. కానీ మిడిల్ ఇన్‌కమ్ ఫ్యామిలీస్ మన మధ్యలో చాలామంది ఇంకా ఎలిజిబుల్ కాదు. వీరికి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం గవర్నమెంట్ సపోర్ట్‌కు అదనంగా గ్యాప్‌లు ఫిల్ చేస్తుంది.
ఇక్కడ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది.. యంగ్ అయితే ప్రీమియంలు చౌక వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఎక్స్‌క్లూజన్స్ తక్కువ. ఇది కంటిన్యూటీ బిల్డ్ చేస్తుంది వయసు పెరిగినా హెల్ప్ అవుతుంది. ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రమే కాదు మైండ్ సెట్‌కు కూడా పీస్ ఆఫ్ మైండ్. మెడికల్ నీడ్స్ మేనేజ్ అవుతాయని తెలిస్తే మీరు బోల్డ్ కెరీర్ డెసిషన్స్ తీసుకుంటారు. బిజినెస్ స్టార్ట్ చేస్తారు. రిలొకేట్ అవుతారు. కానీ చాలామంది దీన్ని లేటర్‌కు పోస్ట్‌పోన్ చేస్తారు సింప్టమ్స్ కనిపించిన తర్వాత లేదా డయాగ్నోసిస్ వచ్చాక బై చేస్తారు. అప్పుడు ప్రీమియంలు ఎక్కువ కవరేజ్ రెస్ట్రిక్టెడ్. ఇన్సూరెన్స్ యూజెంట్ కాకుండా ప్లాన్డ్ అవ్వాలి
ఇక మడరన్ హెల్త్ ఇన్సూరెన్స్ గ్రేట్‌గా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ప్రెవెంటివ్ స్క్రీనింగ్స్ మెంటల్ వెల్‌నెస్ సపోర్ట్ టెలీకన్సల్టేషన్స్ హోమ్ హెల్త్‌కేర్ OPD బెనిఫిట్స్ డయాగ్నస్టిక్ అలౌన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇది రియాక్టివ్ ట్రీట్‌మెంట్ నుంచి ప్రోఆక్టివ్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు మార్పు. ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ప్రోత్సహిస్తుంది హెల్తీ రూటీన్స్ మెయింటైన్ చేస్తుంది. సమస్యలు పెద్దవకముందే సాల్వ్ చేస్తుంది. మెడికల్ లేదా ఫైనాన్షియల్ సెట్‌బ్యాక్స్ నుంచి రక్షిస్తుంది.
మరోవైపు మన భారత్‌లో ఫైనాన్షియల్ అవేర్‌నెస్ పెరుగుతోంది డైవర్సిఫికేషన్.. లాంగ్-టర్మ్ ఇన్వెస్టింగ్.. గోల్-బేస్డ్ ప్లానింగ్. కానీ ఇవ్వని ఒక స్టేబుల్ ఫౌండేషన్ మీదే ఆధారపడి ఉన్నాయి అది హెల్త్ సెక్యూరిటీ. రైజింగ్ హెల్త్‌కేర్ కాస్ట్‌లతో ఇన్సూరెన్స్‌ను ఇగ్నోర్ చేస్తే సంవత్సరాల కష్టం వృథా అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ రిటర్న్స్ ఇవ్వకపోయినా ఇది ఫైనాన్షియల్ కంటిన్యూటీ ఇస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రిజర్వ్ చేస్తుంది ఫ్యూచర్ గోల్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్‌ఫోర్సీన్ మెడికల్ షాక్‌ల నుంచి ఫ్యామిలీని షీల్డ్ చేస్తుంది.కాబట్టి ఏ రోబస్ట్ పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్‌లోనైనా హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ చెక్‌బాక్స్ కాకుండా మొదటి ఇన్వెస్ట్‌మెంట్ అవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ చేయండి మీ ఫ్యూచర్‌ను సేఫ్ చేయండి.
ALSO READ: SIPలో ఏది బెస్ట్? నెలకు రూ.5,000 లేదా? ఏడాదికి రూ.60,000? ఏది లాభం?

ITR: ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా? ఇలా చేయండి!
Debt Trap: పీకల్లోతు అప్పుల్లో చిక్కుకున్నారా? ఈ 5 మార్గాలతో ఈజీగా బయటపడవచ్చు!
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!
Investment Ideas: PPF బెటరా? FD బెటరా? మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఏది సరిపోతుంది?
Loan Offers: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్.. అమెజాన్, ఫ్లిప్‌కార్టు నుంచి బిజినెస్ లోన్స్.. పూర్తి వివరాలివే!
Aadhar Update: కాలు బయటకు పెట్టాల్సిన అవసరమే లేదు.. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌తో పాటు ఆధార్ అడ్రెస్‌ను ఇలా ఇలా అప్డేట్ చేసుకోండి!