కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు దోమ కాటుకు చావు దెబ్బ అయిపోయింది. ఉన్నట్టుండి వణికించే చలి.. ఆ వెంటనే జ్వరంతో కాలిపోయే శరీరం..! ఇలా ఉండగానే ఆ నొప్పి ఈ నొప్పి అంటూ రకరకాలుగా హింసకు గురవుతాం. కొన్నిసార్లు ప్రాణాలే పోతాయ్. ఇదంతా మలేరియా గురించే చెబుతున్నానండి. ఇది ఒక పరాన్నజీవి వ్యాధి. మచ్చల మస్కీటోల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది జ్వరం, చలి, ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది కానీ చికిత్స లేకపోతే తీవ్రమవుతూ ప్రాణాలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 6 లక్షల మంది మలేరియాతో మరణిస్తున్నారు. వీరిలో ఎక్కువగా ఆఫ్రికాలోని 5 ఏళ్ల లోపు పిల్లలే. 25 సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 20 లక్షలకు పైగా ఉండేది కానీ కొత్త ఔషధాల వల్ల తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ వ్యాధి కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పరాన్నజీవి మన ఔషధాలను తట్టుకునే రెసిస్టెన్స్‌ను పెంచుకుంటోంది. అయితే ఈ సమయంలోనే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ ఏంటా మందు? ఇది మలేరియాకు చెక్ పెట్టగలదా?
నిజానికి 2000వ సంవత్సరంలో క్లోరోక్విన్ అనే ఔషధం చాలా ప్రభావవంతంగా ఉండేది కానీ పరాన్నజీవి దానికి రెసిస్టెన్ట్ అయ్యింది. తర్వాత ఆర్టెమిసినిన్ ఆధారిత ఔషధాలు వచ్చాయి అవి మరణాలను గణనీయంగా తగ్గించాయి. ఇవి ఇప్పటికీ ప్రాధాన్య చికిత్సల్లో భాగంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆర్టెమిసినిన్‌కు కూడా పార్షియల్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. దీని వల్ల చాలా దేశాల్లో మరణాలు స్థిరంగా ఉండటం లేదా పెరగటం జరుగుతోంది. ఇలాంటి సమస్యలు మలేరియా పోరాటాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి.
ఇక ఇక్కడే ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. నోవార్టిస్ అనే స్విస్ ఔషధ కంపెనీ మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్ అనే నాన్-ప్రాఫిట్ సంస్థ సహకారంతో గాన్‌లమ్ అనే కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇది గానప్లాసైడ్ అనే కొత్త మాలిక్యూల్‌ను ల్యూమెఫాంట్రిన్ అనే ఇప్పటికే ఉన్న ఔషధంతో కలిపి తయారు చేసిన కాంబినేషన్. ఇది మలేరియా పరాన్నజీవిని చంపడమే కాకుండా వ్యాప్తిని కూడా అడ్డుకుంటుంది. ముఖ్యంగా రెసిస్టెన్ట్ స్ట్రెయిన్‌లపై బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.
అయితే ఇది మూడు రోజులు రోజుకు ఒకసారి ఫైన్ పౌడర్ ప్యాకెట్ రూపంలో ఇస్తారు. కానీ సమస్య ఏంటంటే చాలా మంది మొదటి రెండు డోసుల తర్వాత మంచిగా ఉన్నట్టు అనిపిస్తే మిగిలినవి తీసుకోరు. ఇది రెసిస్టెన్స్‌ను మరింత పెంచుతుంది. మరో అద్భుతమైన విషయం ఏంటంటే మరొ అధ్యయనంలో నాలుగు సాధారణ మలేరియా ఔషధాల కాంబినేషన్‌ను ఒకే డోస్‌గా ఇచ్చి చికిత్స చేసినప్పుడు అది కూడా బాగా పనిచేసింది.
మరోవైపు ఈ ఔషధం పరీక్షలు ఎలా జరిగాయో కూడా తెలుసుకోవాలి. 2025 నవంబర్ 12న నోవార్టిస్ తన ఫేజ్-3 ట్రయల్ ఫలితాలను ప్రకటించింది. ఆఫ్రికాలోని 12 దేశాల్లో 34 సైట్లలో 1688 మంది పెద్దలు, పిల్లలపై ఈ పరీక్ష జరిగింది. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఇది 99 శాతం మందిని క్యూర్ చేసింది. సాధారణ ఆర్టెమిసినిన్ ఔషధాల కంటే కొంచెం బెటర్. ఇది మ్యూటేటెడ్ పరాన్నజీవులపై కూడా ప్రభావవంతంగా పనిచేసింది. ఇది గామెటోసైట్స్‌ను త్వరగా చంపి మలేరియా వ్యాప్తిని అడ్డుకుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్.. జ్వరం.. ఎనీమియా వంటివి సాధారణం. కానీ పౌడర్ రుచి వల్ల కొంచెం వాంతింగ్ ఎక్కువ. దీన్ని మెరుగుపరచడానికి ఫ్లేవరింగ్ జోడిస్తున్నారు.
ఇక ఈ ఫలితాలతో నోవార్టిస్ త్వరలో రెగ్యులేటరీ అప్రూవల్ కోసం అప్లై చేయబోతోంది. ఇది 25 సంవత్సరాల్లో మొదటి పెద్ద అడుగు. మలేరియా పోరాటంలో కొత్త ఆయుధం. ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇది లక్షలాది ప్రాణాలు కాపాడగలదు. కానీ ఇంకా రెసిస్టెన్స్‌ను పూర్తిగా ఎదుర్కోవడానికి మరిన్ని రీసెర్చ్ అవసరం. మనం అందరం మలేరియా అవేర్‌నెస్ పెంచి ప్రతి రోగి పూర్తి చికిత్స తీసుకోవాలని ప్రోత్సహించాలి.
ALSO READ: నిజమైన ప్రేమంటే ఏంటో మర్చిపోయిన తరానికి ఓ జ్ఞాపకం! ఇంతకీ ప్రేమంటే బాధ్యతా… లేదా భారమా?

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?