ఎలక్ట్రిక్ కార్లు రోజురోజుకీ పాపులర్ అవుతున్నాయి కదా కానీ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఒక సరసమైన, ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ SUV కోసం ఎదురుచూస్తున్నారా? ధర కూడా 15 లక్షల లోపే ఉంటే ఎలా ఉంటుంది? మరి పర్ఫార్మెన్స్ సూపర్ ఫాస్ట్ ఉంటే? సేఫ్టీ ఫీచర్స్ టాప్ క్లాస్ ఉంటే? ఇంకా రేంజ్ సిటీ డ్రైవింగ్‌కి పర్ఫెక్ట్ ఉంటే? మహీంద్రా ఇప్పుడు అదే చేసింది. వాళ్ల పాపులర్ XUV 3XO మోడల్‌ని ఎలక్ట్రిక్ వెర్షన్‌గా లాంచ్ చేశారు. దీని పేరు మహీంద్రా XUV 3XO EV. ఇది ఎలా ఉంది, ధర ఎంత, ఫీచర్స్ ఏమిటి అని పూర్తిగా చూద్దాం.
మహీంద్రా XUV 3XO EV ధర ఎంతంటే?
బేస్ వేరియంట్ AX5 ధర ఎక్స్ షోరూమ్‌లో 13.89 లక్షలు మాత్రమే. టాప్ వేరియంట్ AX7L కి 14.96 లక్షలు. రెండు వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది పాత XUV400 మోడల్‌ని రీప్లేస్ చేస్తోంది. డెలివరీస్ ఫిబ్రవరి 23, 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. పెట్రోల్ డీజిల్ XUV 3XO ఏప్రిల్ 2024లో లాంచ్ అయ్యి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు దీని ఎలక్ట్రిక్ వెర్షన్ సిటీ యూజర్స్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు మహీంద్రా.
ఇప్పుడు పవర్‌ట్రెయిన్ గురించి చూద్దాం.
ఇందులో 39.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. రియల్ వరల్డ్ రేంజ్ 285 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 150 హార్స్‌పవర్ , 310 Nm టార్క్ ఇస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ కేవలం 8.3 సెకన్లలో చేరుకుంటుంది. ఇది సెగ్మెంట్‌లోనే అతి త్వరగా యాక్సిలరేట్ అయ్యే SUV ఉంటుంది. మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్. మీ డ్రైవింగ్ స్టైల్ ప్రకారం మార్చుకోవచ్చు. 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం కేవలం 50 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. సస్పెన్షన్‌లో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డ్యాంపింగ్ ఉంది కాబట్టి రైడ్ క్వాలిటీ చాలా మంచిది. టర్నింగ్ సర్కిల్ 10.6 మీటర్లు మాత్రమే, సిటీలో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు.
అవుట్‌సైడ్ లుక్ ఎలా ఉందంటే?
LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRLs, ఇన్ఫినిటీ LED టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, రియర్ స్పాయిలర్ ఉన్నాయి. 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ కూడా ఉంది. టాప్ వేరియంట్‌లో స్కైరూఫ్ పనోరమిక్ సన్‌రూఫ్, 17 ఇంచ్ అలాయ్స్, LED ఫాగ్ ల్యాంప్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. గ్రిల్ క్లోజ్డ్ ఆఫ్, EV బ్యాడ్జింగ్ వంటివి ఎలక్ట్రిక్ అని చూపిస్తాయి.
ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం..
రెండు 10.25 ఇంచ్ HD స్క్రీన్స్ ఉన్నాయి, ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. డ్యూయల్ జోన్ AC, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ రియర్ USB పోర్ట్స్, రియర్ AC వెంట్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అన్నీ ఉన్నాయి. అడ్రెనాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో 80కి పైగా ఫీచర్స్, బిల్ట్-ఇన్ అలెక్సా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆన్‌లైన్ నావిగేషన్ స్టాండర్డ్. టాప్ వేరియంట్‌లో హార్మన్ కార్డన్ 7 స్పీకర్ సౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్, 65W USB-C ఫాస్ట్ ఛార్జింగ్, లెదరెట్ సీట్స్, సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్ వంటివి ఎక్స్‌ట్రా.
సేఫ్టీ గురించి భయమే లేదు..
సేఫ్టీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. బేస్ వేరియంట్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, టైర్ ప్రెషర్ మానిటరింగ్, రియర్ వ్యూ కెమెరా, క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో లెవెల్ 2 ADAS ఉంది. లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్. ప్లస్ 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ కూడా ఉన్నాయి.
మార్కెట్‌లో దీని ప్రధాన కంపిటీటర్స్ టాటా నెక్సాన్ EV, MG విండ్సర్. మహీంద్రా ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ అయిపోయింది. సిటీ డ్రైవింగ్ కోసం పర్ఫెక్ట్, ఫీచర్స్ ఫుల్ లోడెడ్, ధర కూడా అఫోర్డబుల్.
ALSO READ: ఈసారైనా న్యూఇయర్ రిజల్యూషన్ పాటిస్తారా? బిస్కెట్ చేస్తారా?
