ప్రేమ,
ప్రేమ అంటే ఒకరిని చూడటం, ఇష్టపడటం, తిరగడం, ఎంజాయ్ చేయడం అనుకుంటారు చాలా మంది. కానీ నిజంగా మనం ఎవర్నైనా ప్రేమిస్తే, మనలో చాలా మార్పులు వస్తాయి.
మనల్ని ఇష్టపడే వాళ్లందరినీ మనం ఎవరో ఒక అమ్మాయి/అబ్బాయి కోసం మర్చిపోతాం. మనం ప్రేమించిన వ్యక్తి కోసం మనమే మారిపోతాం. వాళ్లతో ఉండాలన్న ఆశతో మనం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉంటాం. మనలో ఉంటే కోపం, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ మరిచిపోతాం… సంతోషంగా ఉండిపోతాం.
అంత వరకు ప్రేమ బాగానే ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడితే మన మీద ఉన్న ప్రేమ తగ్గిపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. అవి మొదట నుంచే ఉండవచ్చు, కానీ అప్పట్లో కనిపించకపోవచ్చు.
“నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు” అన్న వాళ్లే
“నీ నుంచి దూరంగా వెళ్లిపోవాలి” అంటారు.
“నిన్ను ముట్టుకోకుండా ఉండలేను” అన్నవాళ్లే,
నువ్వు ముట్టగానే విసుక్కుంటారు.
నీ మాట కోసం ఎదురు చూసినవాళ్లే,
ఇప్పుడు నీ మాటలు పట్టించుకోరు.
“వెంట తిరిగితే బాగుంది” అన్నవాళ్లే
“నాకు స్వేచ్ఛ కావాలి” అంటారు.
నీ జోక్స్కి నవ్విన వాళ్లే,
ఇప్పుడు నీ సరదా మాటలకే చిరాకు పడతారు.
ఎందుకీ మార్పు???
మీకు కూడా అర్థం కాదు..
ఏం చేయాలో తెలీదు..
తానే మీ ప్రపంచం అనుకుంటారు.
మీ గుండెలో లోతుగా ఆమె/అతనితోనే ఉండాలనుకుంటారు.
ఇలాంటప్పుడు ఎలా స్పందించాలో తెలీదు,
ఎలా మాట్లాడాలో తెలీదు,
ఎలా వదిలేయాలో తెలీదు.
ఏం మాట్లాడినా గొడవే,
ఏం చేసినా తప్పే అనిపిస్తుంది.
“ప్రేమ మొదట్లో ఎంత అందంగా ఉంది… ఇప్పుడు ఎందుకు లేదు?” అన్న ప్రశ్న మీ మనసులో కొండంతగా నిలిచిపోతుంది.
మీరు కూడా ఇలాంటిదే అనుభవించారా?
ఇలానే అనిపించిందా?
ప్రేమ ఆనందాన్నివ్వాలి.. అయితే అంత బాధను ఎందుకు ఇస్తోంది?
అసలు మనం బంధించిన ఆనందకర క్షణాలు ఎక్కడికి పోయాయి?
నువ్వు నవ్విన ఆ రోజులు ఎందుకు మాయమయ్యాయి?
గుండెలో ఉన్న ఆ ప్రేమ ఇప్పటికీ బతికే ఉంది,
కానీ నీ దూరంతో అది ఒంటరిగా ఏడుస్తుంది.
ఏం చేయాలి, ఈ బాధను ఎలా మరవాలి?
నీ జ్ఞాపకాలను గుండె నుంచి ఎలా తొలగించాలి?
ఆఖరిగా చెప్పేది ఒక్కటే
ప్రేమ అంటే ఆనందమే కాదు, ఒక పాఠం,
ఆ పాఠంలోనే మనం మనల్ని చూపిస్తాం
ALSO READ: నా మనసంతా ప్రశ్నల వలలో చిక్కుకుంది.. ఒక హత్యకు శిక్షగా మనం ఇంకో హత్య చేస్తున్నామా?
