ఒక అమ్మాయి తన అవసరం కోసం బయటకు వస్తే.. ఎవ్వరైనా మగాడు వచ్చి సహాయం చేస్తే, మన సమాజం ఏమంటుంది?
ఆమె ఆడది కాబట్టే అతను హెల్ప్ చేశాడు..
ఏదో తేడాగా ఉందే..
సహాయం పేరుతో ఏదో ఒకటి ఆశిస్తాడు చూడు… ఇలా ఏవేవో అనుకుంటారు.
కానీ ఇదే సహాయం ఒక మగాడికి అవసరమైతే మాత్రం, ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే అతను సహాయం కోరడం నార్మల్ అని భావిస్తారు. అంటే, ఇందులో మీరు అడుగుతున్నది.. ఒక మహిళ తన అవసరం కోసం బయటకు వచ్చిందని, మరొకరు ఆమెకు సహాయం చేస్తే అది నిజమైన సాయమని.. ఎందుకంటే ఆమె ఆడది, అతను మగాడు కావడం వల్లనేనా?

ఒక పురుషుడు బయటకు వెళ్తే, అది సాధారణం. కానీ ఒక మహిళ అదే చేస్తే, దాన్ని తీవ్రమైన తప్పుగా చూస్తాం. ఒక భార్య నుంచి దూరంగా ఉన్న వ్యక్తి పరాయి స్త్రీతో ఉంటే పెళ్ళాం దూరం పెట్టింది కాబట్టి తన అవసరం కోసం వేరే ఆమెను చూసుకున్నాడు అంటారు…మరి అదే కోరిక స్త్రీకి వుండదా? ఎందుకు? ఇద్దరు సమానమే…ఇద్దరిది అవసరమే…కానీ ఇక్కడ విలువనివ్వాల్సింది ప్రేమకి బంధానికి కానీ.. ఆ బంధమే నచ్చకుంటే…? అదే భారం అయితే…? ఆమె కోరుకున్న ప్రేమ దొరకకపోతే…ప్రతి ఆడది అయినా మగాడు అయినా ప్రేమను వెతుక్కుంటారు…అవసరం అంటే అందరికీ ఉంటుంది. సహాయం కూడా అవసరాన్ని బట్టి రావాలి, లింగాన్ని బట్టి కాదు. ఇది లైంగిక సమానత్వం గురించి మన సమాజంలో ఉన్న దుష్ట దృష్టిని ప్రశ్నించడమే.
ఇక మహిళ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి… ఒక మహిళను చూసి మగాడు సహాయం చేయాలనిపించడం సహజమే. కానీ ఆ సహాయం ఆవసరమేనా, లేక ఆమెని బలహీనురాలిగా భావించి చేస్తున్న సహాయమా? ఇది ఆ మనస్సాక్షికి చెందిన ప్రశ్న.
అవసరం చూసి సహాయం చేయాలి… ఆడదా, మగాడా అనేది కాదు. కానీ మనసు సహాయం కోసం ముందుకెళ్తుందా, లేక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నదా? అది ముఖ్యమైన విషయం.
చివరగా ఒక్క మాట…అవసరం వచ్చినప్పుడు రోడ్డెక్కేది ఎవ్వరైనా కావచ్చు. అయితే అది ఆడదంటే ఆమె బలహీనమని భావించొద్దు. సహాయం చేసే మగాడు, సాయం పొందే ఆడదీ అనే దృష్టికోణం నీ సహాయం అనే మాటకు విలువే లేకుండా చేస్తుంది… అసలైన మార్పు అయితే, మన దృష్టిలోని మనిషిని చూడగలగడంలో ఉంటుంది.
“సహాయం చేయడం అనేది ఒక మనిషిగా చేయాలి కానీ… జెండర్ చూసి కాదు.ఆమె సాయం అడిగితే ‘బలహీనత’ అనిపించకూడదు.. ఆమెకు సాయం చేయాలని అనిపిస్తే అది కేవలం ‘ఆడది కాబట్టి’ అనే కోణం నుంచే కాకుండా ఆమెను ‘మనిషిగా’ చూసే దృక్పథం నుంచే రావాలి. ఎందుకంటే.. సాయం పొందే వ్యక్తి ఆడదా మగాడా అనేది కాదు.సాయం అవసరమైన పరిస్థితిలో ఉన్న మనిషి అని గుర్తించే దృష్టికోణం సమాజానికి అవసరం.
ALSO READ: ప్రశ్నించే హక్కు లేనప్పుడు…అది నీ జీవితమెందుకవుతుంది?

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!
Pulse Polio: రెండే రెండు చుక్కలు.. మిస్ చేసుకోవద్దు..! చిన్న తప్పు… పెద్ద నష్టం..! ఇది కేవలం వార్త కాదు.. హెచ్చరిక..!