Menu

Kolkata Murder-Sexual Assault Case: దేశంలో హత్యాచార రాజకీయాలు .. నిజాన్ని దాటేందుకు మరెన్నో కుట్రలు!!

Tri Ten B
trainee doctor kolkata murder case

Kolkata Ra*pe Case:

ఒక హత్యాచారం.. వందల ప్రశ్నలు.. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు..! అటు రాజకీయ పార్టీలు ఇప్పటికీ తమ స్వార్థ ప్రయోజనాలు చేసుకుంటూ శవంపై చిల్లర ఏరుకునే రకంగా ప్రవర్తిస్తోంది. శవ రాజకీయాలు దేశంలో ఏ పార్టీకి కొత్త కాకపోయినా ఓ మహిళను పాశవికంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటనలోనూ రాజకీయాలు సెంట్రిక్‌గా మారడం అత్యంత బాధాకరం. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ మర్డర్‌ కేసులో పోలీసులు అదుపులో ఉన్న సంజయ్‌ రాయ్‌ అసలు నిందితుడు కాదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జరిగింది గ్యాంప్‌ రేప్‌ అయితే ఒక్కడినే మాత్రమే అదుపులోకి తీసుకోని పోలీసులు చేతులు దూలుపుకుంటున్నరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు పెదవి విప్పరేం?

ఓ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేశారు.. ఆమె కళ్లు, ముక్కుతో పాటు ఇతర అవయవాల నుంచి భారీగా బ్లీడింగ్‌ అయ్యింది. ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ చెప్పలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని డాక్టర్‌ రిపోర్టులు చెబుతున్నాయి. ఇది కచ్చితంగా సాముహిక అత్యాచారమేనన్నది డాక్టర్ల వాదన. అయితే కోల్‌కతా పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు పెదవి విప్పలేదు. తమ అదుపులో ఉన్న సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌రాయ్‌ ఈ దారుణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అతని మొబైల్‌లో పోర్న్‌ వీడియోలు ఉన్నాయని.. తాగిన మత్తులో సంజయ్‌ ఆ వీడియోలు చూసి ఈ ఘోరానికి ఒడిగట్టాడని అంటున్నారు.

అక్కడి సీసీటీవీలు ఎందుకు పనిచేయలేదు?

నిజానికి ఈ కేసులో మొదటి నుంచి కోల్‌కతా పోలీసుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. ఆగస్టు 9న ఈ ఘోరం జరగగా.. ముందుగా పోలీసులు ట్రైనీ డాక్టర్‌ది ఆత్మహత్యగా చెప్పారు. ఆ తర్వాత పోస్టుమార్టం నివేదిక బహిర్గతం కావడంతో హత్యాచారం కేసుగా నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సంజయ్‌రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన జరిగిన RG కర్ ఆసుపత్రిలో పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ట్రైనీ డాక్టర్‌ విధులు నిర్వహిస్తున్న రెస్పిరేటరీ మెడిసిన్ విభాగం వద్ద సీసీటీవీ పని చేస్తుండగా.. ఆమెను హత్యాచారం చేసిన సెమినార్ హాల్‌ వద్ద సీసీటీవీలు పనిచేయడం లేదు.

పోలీసులును నమ్మలేం: విద్యార్థులు

సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన సంజయ్‌ను అదుపులోకి తీసుకోవడం మంచి విషయమేనని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు.. అయితే కనిపించని వారి కోసం పోలీసులు ఏం చేస్తున్నారో చెప్పాలని విద్యార్థులు నిలదీస్తున్నారు. అసలు ఈ కేసులో దోషీ సంజయ్‌ కావచ్చు.. కాకపోవచ్చు.. ఇతర నేరస్తులు ప్రమేయం ఉండవచ్చు.. లేదా ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి కూడా కావచ్చని ఆస్పత్రిలోని ఓ రెసిడెంట్ డాక్టర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అక్కడి కాలేజీ విద్యార్థులు, వైద్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని కానీ పోలీసులను కానీ ముందు నుంచి నమ్మడం లేదు. సాక్ష్యాలను అణచివేయడానికి, వాటిని తారుమారు చేయడానికి ఎవరో వెనుక నుంచి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

మమత తీరు అత్యంత ఘోరం:


మరోవైపు ఈ కేసు విషయంలో పలు ఫేక్‌ న్యూస్‌లు విపరీతంగా సర్క్యూలేట్ అవుతున్నాయి. హత్యాచారం చేసింది ఒక ముగ్గురు ముస్లిం యువకులని పలు గ్రూపులు సోషల్‌మీడియాలో అసత్య వార్తలను తెగ షేర్ చేస్తున్నాయి. ఇటు రాజకీయ నాయకులు తీరు కూడా అత్యంత దారుణంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్‌ సీఎం మమతబెనార్జీ నడుచుకుంటున్న తీరును చాలామంది తప్పపడుతున్నారు. ఈ కేసు విచారణ ఇప్పటికే సీబీఐ పరిధిలోకి వెళ్లింది. ఇటు మమత మాత్రం నిందితుడిని వారంలోగా ఉరితీయ్యాలి లాంటి స్టేట్‌మెంట్స్‌ పాస్ చేస్తున్నారు. తన సొంత రాష్ట్రంలో జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా ఆమె నిరసనకు దిగుతుండడం హిపోక్రసీ కాకపోతే మరేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also Read: నాడు నెహ్రూ చేశారు.. నేడు మోదీ చేయలేకపోయారు.. అల్లర్లను కంట్రోల్ చేయడంలో బీజేపీ బిగ్‌ ఫెయిల్!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *