Menu

Wayand Landslides Death Reason: కొండచరియలు కింద చితికిపోయిన వందల బతుకులు.. కారణం ఇదే!

Tri Ten B

వయనాడ్ కొండచరియల విషాదం వెనుక దురాశ..! పచ్చని కేరళ ఏరుపురంగును మార్చుకోని శవాల గుట్టలను కళ్లకు చూపించడానికి కారణం టూరిజం..! అవును.. టూరిజం పేరిట అడ్డదిడ్డంగా హోటళ్లు, రిసోర్టులు కట్టడం, అందమైన చెట్లను నరకడం అక్కడి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణం! కేరళ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం 10శాతం వాటాను కలిగి ఉంది. కేరళలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా అదే టూరిజం పేరిట కేరళ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు అక్కడి మనుషులకు శాపాలుగా మారాయి. వయనాడ్‌ విషాద ఘటనలో 300కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి టూరిజం పేరిట జరిగిన ప్రకృతి విధ్వంసమే ప్రధాన కారణం!

కేరళలో అంతకంతకు ధ్వంసమవుతున్న అటవీ సంపద (File)

అడవులను నరికివేస్తున్న ప్రభుత్వం:
కేరళలో కొండచరియలు విరిగిపడి ప్రజలు బలైపోవడం ఏదో కొత్తగా జరిగిన విషయమేమీ కాదు.. 1961-2016 మధ్య కేరళలో కొండచరియలు విరిగిపడి 295 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు చనిపోయారు. ఇక 2018లో కేరళ ఘోరమైన వరదలను చవిచూసింది. అప్పుడు దాదాపు 500 మంది మరణించారు. ఇలా ప్రతీఏడాది కేరళలో ప్రకృతి వైపరిత్యాలకు ప్రజలు చనిపోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న అటవీ సంపద ధ్వంసమే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. కేరళకు అతిపెద్ద ఆదాయ వనరులలో ఒకటైన పర్యాటకమే ఈ విపత్తులకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పర్యావరణ క్షీణతకు టూరిజం పెరుగుదలే కారణమట!

కేరళలో పెరిగిన ఇల్లిగల్‌ మైనింగ్‌ (File)

టురిజం చాటున ప్రకృతి విధ్వంసం:
అటు వయనాడ్‌లో ఇన్ని రిసార్ట్‌లు, హోటళ్లను ఎందుకు అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. నిజానికి బీచ్‌లు, హిల్ స్టాప్‌లు , బ్యాక్ వాటర్‌ల కారణంగా ప్రతి సంవత్సరం కేరళకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. టూరిజంలో దూసుకుపోతున్న కేరళలో హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువగా వెలిశాయి. వీటి కట్టడాల పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని.. కనీస ప్రొటోకాల్స్ పాటించకుండా నిర్మాణాలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే అనేక మంది ప్రాణాలు బలికావడానికి కారణం అయ్యాయట.

వయనాడ్‌లో పెరిగిన మానవ-జంతు సంఘర్షణలు (File)

పెరిగిన మానవ-జంతు సంఘర్షణలు:
వ్యవసాయ భూమిని హోటళ్లు, రిసార్టులుగా మార్చడం అతిపెద్ద తప్పిదం. అటు టూరిజం పేరిట అడవులను నరకడం వల్ల మానవ-జంతు సంఘర్షణలు కేరళలో పెరిగాయి. ముఖ్యంగా వయనాడ్‌లో జరుగుతుంది ఇదే. అంటే జంతువులు అటాక్ చేసిన దాడులో మనుషులు ప్రాణాలు కోల్పోవడం లేదా మనుషులు దాడుల్లో జంతువులు చనిపోవడం లాంటి ఘటనలు పెరుగుతున్నాయి. 2014 నుంచి వయనాడ్‌లో ఈ కారణంగానే 149 మరణాలు నమోదయ్యాయి. ఒక్క 2022లోనే 8,873 దాడులతో పాటు 98 మరణాలు రికార్డయ్యాయి. 2017-23 మధ్య, అడవి మంటల కారణంగా 20,957 సార్లు పంట నష్టం వాటిల్లింది. ఈ కార్చిచ్చులో దాదాపు 1,000 జంతువులు మరణించాయి.

తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం:
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించచిన ఒక అధ్యయనం కేరళ ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపుతోంది. 1950- 2018 మధ్యకాలంలో వయనాడ్‌లో అటవీ విస్తీర్ణం 62 శాతం తగ్గింది. 1950 వరకు వయనాడ్‌ దాదాపు 85 శాతం అడవులతో కప్పబడి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక కేరళలోని అన్ని కొండచరియలు విరిగిపడే హాట్‌స్పాట్‌లు పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్నాయి. ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. కేరళలో దాదాపు 59 శాతం కొండచరియలు విరిగిపడటం ప్లాంటేషన్ ప్రాంతాల్లోనే సంభవించినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.


జీవనోపాధికి అడ్డంకి:
నిజానికి వయనాడ్ అనగానే పర్యాటకులకు అందమైన జలపాతాలు, గుహలు, చూడముచ్చటైన పక్షులు గుర్తొస్తాయి. అందుకే ఈ ప్రాంతమంటే టూరిస్టులకు చాలా ఇష్టం. అయితే పర్యాటకం చాటునా ఎన్నో నిర్మాణాలు వెలిశాయి. అవి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ విషయాన్ని పర్యావరణవేత్తలే కాదు.. వాయనాడ్‌కు వెళ్తున్న టూరిస్టులు సైతం గ్రహిస్తున్నారు. ఒకప్పటి వయనాడ్‌ అందాలకు నేటి అందాల్లో తేడాను గమనిస్తున్నారు. ఇక వాయనాడ్‌లో వేగవంతమైన పర్యాటక వృద్ధి అక్కడి ప్రజల జీవనోపాధికి అడ్డంకిగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి.

Also Read: ఆధునిక దేవాలయాలే మనకు శాపాలా ? వేలాది ప్రాణాలను తీస్తున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం..!!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *