Menu

Floods Causes: ఆధునిక దేవాలయాలే మనకు శాపాలా ? వేలాది ప్రాణాలను తీస్తున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం..!!

Tri Ten B
dams causing floods

Dams were built to control floods, they are now triggers:

డ్యాములు..! వరదలను కంట్రోల్ చేయడానికి నిర్మించబడ్డ కట్టడాలు..! అయితే అవే వరదలకు, మరణాలకు కారణం అవుతున్నాయి.. నేటి కేరళ వరదలైనా, నాడు ఉత్తరాఖండ్‌ జల ప్రళయానికి గాల్లో కలిసిపోయిన ప్రాణాలకైనా డ్యాములే కారణం..! అదేంటి డ్యాములే కదా వరదలను ఆపుతాయి.. ప్రజలను రక్షిస్తాయి.. మరి అవే ప్రాణాలు పోవడానికి ఎలా కారణం అవుతున్నాయి? ఈ సందేహం మీక్కూడా వస్తుందా? అసలు ఆనకట్టలు పరిష్కారాలే కావా..? అవే అసలైన సమస్యలా? తప్పు ఎక్కడ జరుగుతోంది? అసలు తప్పు ఎవరిది?

నిబంధనల ఉల్లంఘించి..:
డ్యామ్‌లను ఆధునిక దేవాలయాలు అన్నారు పండిట్ నెహ్రూ… కానీ అవే నేడు శాపంలా మారుతున్నాయి.. ఎందుకంటే నీళ్ళెంత ముఖ్యమో ఆ సరిహద్దుల్లో జీవిస్తున్న ప్రజలూ అంతే ముఖ్యం అనుకోవాలి. కానీ ప్రభుత్వాలు అలా అనుకుంటున్నట్టు లేవు. డ్యామ్‌లు కట్టేటప్పుడు అనేక ప్రాథమిక నిబంధనలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. నాటి 2018 కేరళ వరదల్లో ప్రజలు చనిపోవడానికి ఇదే అతి పెద్ద కారణం.. సమర్థవంతమైన డ్యాముల నిర్వాహణ లేకపోవడం కారణంగానే నేటికి కేరళలో భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి జనాలు మరణిస్తున్నారు. ఇది కేవలం కేరళకే పరిమితం కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డ్యాముల కట్టడమే నిబంధనల ఉల్లంఘించి చేశారని అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి.

పెరుగుతున్న అవక్షేపాల స్థాయి:
ఆనకట్టలు నదికి అడ్డంగా కట్టే మానవ నిర్మాణాలు. చాలా ఆనకట్టలు నదీ ప్రవాహాన్ని కంట్రోల్‌ చేయడానికి, నావిగేషన్‌ను మెరుగుపరచడానికి, వరదలను నియంత్రించడానికి నిర్మిస్తారు. ఆనకట్టల నిర్మాణంలో రాళ్ళు లేదా కాంక్రీటును ఉపయోగిస్తారు. డ్యాములు నది సహజ గమనాన్ని మారుస్తాయి. మరోవైపు నది నుంచి ప్రవహించే అవక్షేపాలు కూడా కృత్రిమంగా నిర్మించే డ్యాం దగ్గర నిలిచిపోతాయి. అవక్షేపాలు అంటే నదిలోకి కొట్టుకువచ్చే అడ్డంకులు.. అంటే అవి రాళ్లు, మట్టి, చెట్లు ఇలా ఏదైనా కావొచ్చు. అయితే వరదల సమయంలో రిజర్వాయర్‌లోకి చేరే అవక్షేపాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది వరదలను ప్రేరేపిస్తుంది. దీని కారణంగా రిజర్వాయర్‌లోని వరద నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుకొని ఊర్లకు ఊర్లను ముంచేస్తాయి.

చెన్నై వరదలకు ఆ రెండే కారణాలు:
డ్యాములు లోతట్టు ప్రాంతాలను ముంచేయడం గతంలో అనేకసార్లు జరిగింది. 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌లో వరద సంభవించి వేలాది మంది బలయ్యారు. చెన్నైలో తరుచుగా సంభవించే వరదలకు కూడా డ్యామ్‌ నిర్వహణ సరిగ్గా లేకపోవడం ఒక కారణం. అయితే దీంతో పాటు వరద నీరు ఇంకిపోవడానికి , సముద్రంలోకి మళ్లించడానికి సరైన వ్యవస్థ లేకపోవడంతో చెన్నై దాదాపు ప్రతీఏడాది వరదలకు గురవుతుంది. ఇలా డ్యామ్‌ల నిర్వహణలో అలసత్వం కారణంగా దిగువ ప్రాంతాల్లో వరద విపత్తులకు వేలాది మంది మరణిస్తున్నారు. అటు డ్యాముల కెపాసిటీ కూడా తగ్గుతూపోతోంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జున సాగర్‌లో మట్టి పేరుకుపోయి దాని కెపాసిటీ కూడా పడిపోయింది.

మానవ నిర్మిత కట్టడాలే కారణం:
భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు, తుపానులు, సునామీలు పాటు వరదలకు పురాతన కాలం నుంచే ప్రధాన కారణాలు. అయితే వ్యవసాయం, పట్టణీకరణ ప్రారంభమైనప్పటి నుంచి మానవ కార్యకలాపాలు నేరుగా వరదలకు కారణం అవుతున్నాయి. ఆనకట్టలు, బ్యారేజీలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, నిలకడలేని మైనింగ్, అటవీ నిర్మూలన, నదీగర్భాలలో ఆక్రమణలు లాంటి మానవ నిర్మిత కట్టడాలు వరదలకు ప్రధాన కారణాలగా నిలుస్తున్నాయి.

భారీ వర్షాలతో ఆనకట్టలు తెగిపోవడం వల్ల 1924లో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారు. ఇళ్ళు, రోడ్ల ధ్వంసం అయ్యాయి. 2018 కేరళ వరదల విషాదంలోనూ జరిగింది ఇది. నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు నిండి జనాలు చనిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. భారీ వర్షాలకుఅసమర్థమైన డ్యామ్ నిర్వహణ జోడైతే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుంది. శవాల గుట్టలే కనిపిస్తాయి.. శిథిలాల కింద పూడ్చుకుపోయిన మృతదేహాలే దర్శనమిస్తాయి!

Also Read: ప్రకృతి ప్రకోపం..! చరిత్రలో జీవితాలను ముంచేసిన కన్నీటి వరదలు..!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *