Menu

Kerala Floods Humanity: పరిఢవిల్లిన మానవత్వం.. కష్టకాలంలో ఐక్యతా రాగం!

Praja Dhwani Desk
wayanad floods

Wayanad Landslide Rescue: ఓ తల్లి అనాధలుగా మారిన వేరొకరి పిల్లలకు పాలు పట్టిస్తోంది.. అటు ఆపద సమయంలో కులమతాలు, రాజకీయ భావజాలాన్ని పక్కనపెట్టి అంతా కలిసికట్టుగా సహాయిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళ ప్రజలంతా వయనాడ్‌వైపే అడుగులు వేస్తున్నారు. తమతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకు సాయం చేసేందుకు అంతా కదిలి వెళ్తున్నారు. కేరళ అంతా వయనాడ్‌లోనే ఉంది. కేరళ ప్రజల ఆలోచనలన్ని వయనాడ్‌ వరదల బాధితులను ఆదుకోవడంపైనా ఉంది. సినీ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అంతా వయనాడ్‌ బాధితులకు భరోసా ఇస్తున్న దృశ్యాలు అక్కడి ప్రజల మానవత్వానికి అద్దం పడుతున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్న సమయంలో ఇటు కేరళలో సామాన్య ప్రజలు మాత్రం సహాయిక చర్యల గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించడం లేదు.

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 350 దాటింది. కేరళ ప్రకృతి విపత్తులకు మానవ తప్పిదాలే కారణం.. ప్రభుత్వాల అత్యాశే కారణం.. టూరిజంపై ఎక్కువగా ఆధారపడే కేరళ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో అటవీ సంపదను నాశనం చేస్తూ పోతోంది. ఇక్కడ ప్రకృతిపై నిందలు వేసి తమ తప్పేది లేదని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ సమయంలో ఇలాగా మాట్లాడేది? :
అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఆపదలో ఆదుకోకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. తప్పు ఎవరిదైనా కేంద్ర ప్రభుత్వ తక్షణ బాధ్యత కేరళను ఆదుకోవడం. వందల సంఖ్యలో మరణాలు, వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఇలాంటి సమయంలోనూ నిందలు వేయడం దుర్మార్గం. ప్రస్తుత లెఫ్ట్‌ ప్రభుత్వం, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ఎత్తిచూపే ప్రయత్నం ఈ సమయంలో చేయడం కరెక్టేనా ? అసలు కేంద్రం కేరళకు చేసింది ఏముంది? బడ్జెట్‌లో నిధులు కేటాయింపు కూడా కేరళకు అంతంతమాత్రమే.. స్వశక్తితో ఎదిగిన రాష్ట్రం అది.. అయితే కేరళ అంటే మాత్రం బీజేపీకి
కమ్యూనిస్టు, కాంగ్రెస్‌కు మాత్రమే ఓటు వేసే ప్రజలున్న ప్రాంతం మాత్రమే..అందుకే కాబోలు సాయం చేయడానికి కూడా అహం అడ్డొస్తుంది కావొచ్చు!

ప్రభుత్వ ఏజెన్సీలు, సైన్యం, వాలంటీర్ల మధ్య సమన్వయం అద్భుతంగా ఉంది. సహాయక చర్యలు సజావుగా సాగడానికి ఈ ఐక్యమే కారణమైంది: మేజర్ జనరల్ వీటీ మాథ్యూ.

ఐక్యతతో ముందుకువెళ్తున్న కేరళ సమాజం:
2018 తర్వాత కేరళ ఘోర విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో అక్కడి ప్రజలంతా ఏకతాటికిపైకా రావడాన్ని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. సంక్షోభ సమయాల్లో రాజకీయాలకు, మతాలకు అతీతంగా కేరళీయులు ఏకమవుతారని మరోసారి రుజువు అయ్యింది. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, పోలీస్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, సివిల్ సర్వీస్ వాలంటీర్లతో పాటు యూత్ కేర్, ఎస్వైఎస్, ఎస్కేఎస్ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, సేవా భారతి లాంటి పలు సంస్థలు గాలింపు చర్యల్లో ముందున్నాయి. పొరుగు జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా వాలంటీర్లు స్వచ్చందంగా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజకీయ భావజాలన్ని పక్కన పెట్టి మరి సహాయిక కార్యక్రమాలు చేస్తున్న వాలంటీర్ల అంకితభావాన్ని భారత సైన్యం కూడా ప్రశంసించింది.


Also Read: కొండచరియలు కింద చితికిపోయిన బతుకులు.. కారణం ఇదే!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *