Menu

Jasprit Bumrah: క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. దిగ్గజ బౌలర్లకు సైతం సాధ్యం కాని ఘనత!

Tri Ten B
bumrah is also the Second Fastest Asian to reach 150th wicket, as he is just behind Pakistan's former pacer Waqar Younis, who achieved this feat in 27 Test matches. Bumrah reaches the spot in 34 Tests.

Jasprit Bumrah creates history: భారత్‌ ఉపఖండపు పిచ్‌లు సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. టెస్టుల్లో మన స్పీన్‌ బలం కూడా చాలా ఎక్కువ. నాటి హర్భజన్‌, కుంబ్లే నుంచి తర్వాత అశ్విన్‌, జడేజా వరకు ఇండియాలో స్పీన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లు హడలిపోయేవారు. ఇక ఓవరాల్‌గా టెస్టుల పరంగా చూసినా స్పిన్నర్లదే డామినేషన్‌. స్పిన్‌ మంత్రికుడు మురళిధరన్‌.. దివంగత దిగ్గజ స్పిన్నర్‌ షేర్‌ వార్న్‌ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ముందువరుసలో ఉన్నారు. ప్రాక్టికల్‌గా, ఫిట్‌నెస్‌ పరంగా ఆలోచిస్తే టెస్టుల్లో పేసర్లు లాంగ్‌ టర్మ్‌లో భారీగా వికెట్లు తియ్యలేరు. అయితే టీమిండియా యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాత్రం స్పిన్‌ యూగంలో, స్పిన్‌ పిచ్‌లపైనా వికెట్లు తియ్యగలడు. విశాఖ టెస్టులో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తర్వాత ఐసీసీ విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఫస్ట్‌ పొజిషన్‌కు దూసుకొచ్చాడు.


ఒకే ఒక బౌలర్:
ఇండియన్‌ టెస్టు క్రికెట్‌లో స్వదేశీ గడ్డపై స్పిన్నర్లదే రాజ్యం. గతంలో అశ్విన్‌, జడేజా, బిషన్‌సింగ్‌ బేడి టెస్టుల్లో నంబర్‌-1 పొజిషన్‌కు చేరుకున్నారు. ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లే. తాజా బుమ్రా ఫిట్‌తో భారత్‌ తరఫున టెస్టుల్లో నంబర్‌-1 పేసర్‌గా నిలిచిన రికార్డు సృష్టించాడు బుమ్రా. అంతేకాదు ఐసీసీ విడుదల చేసే మూడు ఫార్మెట్లలో నంబర్‌-1గా నిలిచిన ప్లేయర్ల జాబితాలో నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్లు పాంటింగ్‌, హేడెన్‌, టీమిండియా రన్‌ మెషీన్‌ కోహ్లీ మూడు ఫార్మెట్లలోనూ ఏదో ఒక సందర్భంతో నంబర్‌-1 స్థానంలో నిలిచారు. ఇందులో పాంటింగ్‌, హేడెన్‌ చాలా కొద్ది కాలమే టీ20ల్లో నంబర్‌-1 ప్లేస్‌లో కొనసాగారు. ఇక ఇలా మూడు ఫార్మెట్లలో నంబర్-1 బౌలర్ గా నిలిచిన ఏకైక బౌలర్ బుమ్రా మాత్రమే.


సపోర్ట్ తక్కువే:
టెస్టుల్లో కనీసం 150వికెట్లు తీసిన బౌలర్లలో రెండో బెస్ట్ బౌలింగ్‌ యావరేజ్‌ కలిగిన ప్లేయర్‌ కూడా బుమ్రానే. ఇలా అనేక రికార్డులు కలిగిన బుమ్రాకు భారత్‌ అభిమానుల నుంచి ఆశించిన మద్దతు ఉండదు. తరుచుగా గాయాలపాలవడంతో బుమ్రాపై అనేక విమర్శలు వస్తుంటాయి. అయితే బుమ్రా విషయంలో బీసీసీఐ చేసిన తప్పిదాలే ఈ పరిస్థితికి కారణం. గాయం నుంచి కోలుకున్న వెంటనే బుమ్రాని బరిలోకి దింపేవాళ్లు.. కనీసం గ్యాప్‌ కూడా ఇవ్వకుండా ఆడించేవాళ్లు. ఇలా రెండు సార్లు బీసీసీఐ చేసిన పొరపాటుకు బుమ్రా బలయ్యాడు. మూడోసారి గాయంలో బీసీసీఐ ఆ తప్పు చేయలేదు. అందుకే దాదాపు ఎడాదిన్నర పాటు బుమ్రా జట్టులో కనిపించలేదు. గతేడాది వరల్డ్‌కప్‌కు ముందు ఐర్లాండ్‌తో సిరీస్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన బుమ్రాను సెలక్టివ్‌గా సిరీస్‌లు ఆడిస్తుండడం మంచి విషయమే.


Also Read: మారుమూల కుగ్రామం నుంచి అద్భుతం.. వెస్టిండీస్ క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన జోసెఫ్!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *