Menu

Nagababu: ‘న్యూటన్‌ నాగబాబు..’ సైన్స్ పంతులు.. చంద్రబాబుకు చురకలు.. ఆ ట్వీట్ల అర్థం ఇదే!


మెగా బ్రదర్‌ నాగబాబు తాజాగా ట్విట్టర్‌లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. న్యూటన్‌ మూడు నియమాలను ఆయన పోస్ట్ చేశారు. ఈ మూడు నియమాలను ఉన్నట్టుండి పోస్ట్ చేయడానికి లోతైన కారణం ఉందని తెలుస్తుంది.


Tri Ten B

చిరంజీవి తమ్ముడు నాగబాబు కాస్త డిఫరెంట్‌.. ఆయన రియాక్ట్ అయ్యే విధానం వెరైటీగా ఉంటుంది. ఏ విషయంలోనైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్పందన ఉంటుంది. జబర్దస్త్‌లో ‘హహ’ అని నవ్వాలన్నా.. ఫ్యాన్స్‌ను ‘హీహీ’ అని నవ్వించాలన్నా.. ప్రత్యర్థులకు సర్రమనేలా మంట పెట్టాలన్న మెగా బ్రదర్‌ యూనిక్‌గా ఉంటారు. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి జనసేన తరుఫున ప్రచారం చేస్తూ జగన్‌కు ఎప్పటికప్పుడూ తనదైన శైలిలో పంచ్‌లు విసిరే నాగబాబు ఈ సారి చంద్రబాబుకు గురిపెట్టారు. టీడీపీ-జనసేన పొత్తులో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి. నిన్న రిపబ్లిక్‌డే సందర్భంగా చంద్రబాబు పొత్తు ధర్మం తప్పారంటూ పవన్‌కల్యాణ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు చెప్పకుండా రెండు సీట్లు చంద్రబాబు ప్రకటించడాన్ని తప్పుబట్టిన పవన్‌.. తాను కూడా రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. దీనిపై నాగబాబు తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు.


నాగబాబు ఏం అన్నారంటే:
న్యూటన్‌ మూడో నియమం ప్రకారం చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఒక చర్యకు ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకదిశలో సమానమైన ప్రతిచర్య ఉంటుందని న్యూటన్‌ చెప్పాడు. ఇప్పుడదే నాగబాబు చెబుతున్నాడు. న్యూటన్‌ మూడో నియమాన్ని నాగబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబు రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే పవన్‌ కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నాగబాబు ఈ ట్వీట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.


గుమ్మడి కాయల దొంగ ఎవరు?
అంతటితో ఆగలేదు నాగబాబు.. న్యూటన్‌ రెండో నియమాన్ని కూడా పోస్ట్ చేశారు. దానికి ఒక క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ‘నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను,ఇవ్వాల Physics laws యే చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను… ( వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు)’ అని నాగబాబు క్యాప్షన్‌ ఇచ్చారు. పరోక్షంగా గుమ్మడికాయల దొంగ టీడీపీ అని నాగబాబు చెప్పినట్టుగా ఉంది. నిజానికి న్యూటన్‌ రెండో గమన నియమం ద్రవ్యరాశికి, బరువుకూ మధ్య తేడాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే నిన్నటి జనసేనని నిర్ణయం పవన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నాగబాబు చెప్పారా?


ఒత్తిడితోనే చంద్రబాబు ఆ పని చేశారా?
ఇక న్యూటన్‌ రెండు నియమాలు పెట్టిన నయా సైన్స్ టీచర్‌ నాగబాబు మిగిలిన ఒక నియమాన్ని కూడా వదలడం ఎందుకని భావించినట్టు ఉన్నారు. న్యూటన్‌ మొదటి నియమాన్ని కూడా పోస్ట్ చేశారు. న్యూటన్‌ మొదటి గమన నియమం ప్రకారం ఒక వస్తువు పైన ఏదైనా ఒత్తిడి పనిచేస్తే తప్పించి అప్పటి వరకూ అది ఉన్న స్థితిలో స్థిరంగా లేదా ఒక సరళరేఖపై ప్రయాణిస్తున్న విధంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినది ఒత్తిడి అనే విషయాన్ని. నిన్న పవన్‌ మీటింగ్‌లో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటే తనపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒత్తిడి కారణంగానే చంద్రబాబు చెప్పపెట్టకుండా సీట్లు ప్రకటించారని పవన్‌ ఆలోచన కావొచ్చు. ఒక వస్తువుపై ఎలాంటి ఒత్తిడి లేకపోతే సరళరేఖపై ప్రయాణిస్తుందని.. లేకపోతే దిశ మార్చుకుంటుందని చంద్రబాబుకు ఈ నియమం వర్తిస్తుందని నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.

Also Read:  పొత్తులో అలకలు, లుకలుకలు.. చిన్నపిల్లల గొడవలని తలపిస్తోన్న టీడీపీ-జనసేన సీట్ల పంపకాల రచ్చ!

 


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *