Menu

Jammu Kashmir: అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ తంటాలు.. కశ్మీర్‌లో అమాయకుల చావులకు కారణం ఎవరు?

Praja Dhwani Desk
jammu kashmir security failure

అది ఆగస్టు 5, 2019..
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిపించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దైన రోజు..
జమ్ముకశ్మీర్‌కు అటానమస్‌ స్టేటస్‌ రద్దు చేస్తూ బీజేపీ చెప్పిన కల్లిబొల్లి కబుర్లను యావత్‌ దేశం నమ్మిన రోజు..
ఇక జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదమే ఉండదని.. అంతా ప్రశాంతతే ఉంటుందని కాషాయదళాలు ప్రచారం చేశాయి. జమ్ముకశ్మీర్‌లో స్థలాలు కొనుగోలు చేయవచ్చని బీజేపీ తెగ హడావుడి చేసింది. మరికొందరైతే కశ్మీర్‌ అమ్మాయిను పెళ్ళి చేసుకోవచ్చని అతిగా స్పందించారు. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో పూర్తిగా విలీనమైన ఆ రోజు దేశ ప్రజల స్పందన దాదాపు బీజేపీ మాటాల్లానే అనిపించాయి. జమ్ముకశ్మీర్‌ను మ్యాప్‌లో ఓ తలకాయిగా భావించిన భారతీయులు అక్కడి స్థలానికి విలువ ఇచ్చేరే కానీ మనుషులకు ఇవ్వలేదని ఆ రోజే అర్థమైంది. జమ్ముకశ్మీర్‌ మనది అని భారతీయులు చెప్పుకున్నారే కానీ కశ్మీర్‌ వాళ్లు మా వాళ్లు అని అనలేకపోయారు. అక్కడ మనుషుల ఆలోచనలకు భారత ఇచ్చిన విలువ నైతికతకు చాలా దూరంలో నిలిచింది.


స్వయంప్రతిపత్తి రద్దుతో ఒరిగిందేంటి?
సీన్‌ కట్‌ చేస్తే ఆర్టికల్‌ 370 రద్దు జరిగి ఐదేళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొని ఉండాలి. అంతా ప్రశాంతతే రాజ్యమేలాలి. కానీ అక్కడ జరుగుతున్నది వేరు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా అలానే ఉంది. ఈ మూడు రోజుల్లో( జూన్ 09,10,11) మూడు ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. రయసీలో హిందూ భక్తులు ప్రయాణిస్తున్న వాహనంపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ తర్వాత కతువా, డొడా ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగాయి. ఓ ముష్కరుడిని పోలీసులు చంపేశారు. రయసి ఘటనకు కారణమైన ఉగ్రవాది కోసం వేట కొనసాగిస్తున్నారు.

ఈ వైఫల్యం కేంద్రానికి కాదా?
బీజేపీ చెప్పినదాని ప్రకారం జమ్ముకశ్మీర్‌ ఇప్పటికీ శాంతికి నిలయంగా మారి ఉండాలి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యంగా జమ్ములో ఉగ్రవాదం హెచ్చుమీరింది. గతంలో కశ్మీర్‌ కేంద్రంగా జరిగిన ఉగ్రదాడులు ఈ ఐదేళ్లలో జమ్ము ప్రాంతాల కేంద్రంగా సాగుతున్నాయి. జైష్‌-ఏ-మహ్మద్‌ అండర్‌లో పనిచేసే కశ్మీర్‌ టైగర్స్‌ దళాలు జమ్ములో ఉగ్రదాడులకు ఎక్కువగా కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అటు పూంచ్‌ ప్రాంతంలో గత 31 నెలల్లో ఉగ్రదాడుల్లో 21మంది జవాన్లు చనిపోయారు. ఈ వైఫల్యం ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది కాదా?

రయసి దాడి భద్రతా లోపాలను ఎత్తిచూపింది. ఇది అనేక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. తీర్థయాత్ర మార్గాలకు తగిన రక్షణ ఉందా? యాత్రికుల భద్రత కోసం మరింత గస్తీ, అదనపు చెక్‌పోస్టులు, అధునాతన నిఘా అవసరాన్ని ఈ దాడి ఎత్తిచూపడంలేదా?

సమస్యను పక్కదారి పట్టిస్తోన్న బీజేపీ ఐటి సెల్:
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, తిరిగి ఎవరూ ప్రశ్నించకుండా తమ ఐటీ సెల్‌ను రంగంలోకి దింపింది. ALL EYES ON REASI అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ చేస్తూ అసలు సమస్యను సైడ్‌ ట్రాక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ALL EYES ON RAFAH అని పోస్టు పెట్టినవారంతా రయసి ఘటన గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఓ టైప్‌ ఆఫ్‌ హెట్రెడ్‌ పాలిటిక్స్‌. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు, కశ్మీర్‌లో ఉగ్రదాడులకు ఏ మాత్రం సంబంధం లేదు. ఓ జాతి మొత్తాన్ని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేలా చేయడమే ఇజ్రాయెల్‌ లక్ష్యం. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 2023 అక్టోబర్‌ 7 నుంచి జూన్ 12, 2024వరకు 36వేల కంటే ఎక్కువ మంది సామాన్య పౌరులు చనిపోయారు. అక్కడి ఘటనలకు కశ్మీర్‌లోని ఘటనలకు ఏ మాత్రం సంబంధం లేదు..! కశ్మీర్‌ సమస్యలో కశ్మీర్‌ పౌరులే అణచివేతకు గురయ్యారు. ఈ అణచివేత నుంచే అనేక తీవ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఈ సమస్యను మూలల నుంచి పరిష్కరించడం అవసరం. అది చేయకుండా స్వయంప్రతిపత్తి రద్దుతో ఒరిగిందేమీ ఉండదని బీజేపీ ఇప్పటికైతే తెలుసుకుంటే మంచిది!

Also Read: దేశ చరిత్రలో తొలిసారి.. ముస్లింలపై ఎందుకింత అక్కసు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *