Menu

Israel Nuclear : దక్షిణాఫ్రికాను ఇజ్రాయెల్‌ మోసం చేసిందా? సఫారీ దేశమే లేకపోతే ఇజ్రాయెల్‌కు దిక్కే లేదా?

Praja Dhwani Desk 7 months ago
israel southafrica nuclear deal

అణు బాంబులు మనకు రక్తపాతాన్ని గుర్తుచేస్తాయి.. కొన్ని దేశాల చేతుల్లోకి అవి ఎలా వచ్చాయన్న విషయం మనకు తెలిసినట్టే అనిపించినా
నిజం మాత్రం ఇంకెక్కడో దాగి ఉంటుంది. ఒక చిన్న దేశం.. ఇజ్రాయెల్.. ప్రపంచానికి చెప్పకుండా అణు శక్తిని ఎలా సంపాదించుకుంది? దానికి సహాయంగా వచ్చిన దక్షిణాఫ్రికా దాని సొంత అణు బాంబులను ఎలా కోల్పోయింది? ఇటు ఇజ్రాయెల్‌ అణు ఆయుధాలను ఇంకా ఎందుకు దాచిపెడుతోంది? ఇజ్రాయెల్‌ ఒకే ఒక్క పరీక్ష కూడా చేయకుండా ప్రపంచంలో అణు శక్తి ఉన్న దేశంగా ఎలా మారింది? దానికి సహాయపడిన దేశాన్ని చివరికి మోసం చేసిందా? ఇప్పటివరకు మీకు ఎవరూ చెప్పని నిజాలను నేను మీకు చెప్పబోతున్నా!

ఆఫ్రికావైపు ఇజ్రాయెల్ అడుగులు:

ఇజ్రాయెల్‌ కథ ఒక చిన్న గాయంతో మొదలైంది. అది యుద్ధం కాదు. అది బాంబుల శబ్దం కాదు. అది ఒక సమావేశానికి రాకుండా ఆపిన చిన్న నిర్ణయం. 1955లో జరిగిన బాండంగ్ కాన్ఫరెన్స్‌ సభకి మొదట ఇజ్రాయెల్‌ను ఆహ్వానించారు. కానీ ఆ ఆహ్వానం చీకట్లో మాయమైంది. ఈజిప్ట్‌, పాకిస్తాన్‌, అరబ్ దేశాలు ఒత్తిడి తెచ్చాయి. ఇండియా కూడా ఆ ఒత్తిడికి వణికింది. చివరికి నెహ్రూ తలదించుకొని ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నారు. అక్కడే ఇజ్రాయెల్‌కు నిజమైన ఒంటరితనం ప్రారంభమైంది. ఆ రద్దయిన ఆహ్వానం ఒక చిన్న ఘటనలా కనిపించవచ్చు కానీ.. అది ఇజ్రాయెల్ గుండెలో భయాన్ని నింపింది. కొత్తగా ఏర్పడిన దేశం.. చుట్టూ శత్రువులు. ఎవ్వరూ తోడు కాదని తెలిసిపోయింది. ప్రపంచం మూడో ప్రపంచ ఐక్యతగా మారుతున్న వేళ, ఇజ్రాయెల్ మాత్రం బయటపడిపోయింది. ఒక తలుపు మూసిపోతే, ఇంకో తలుపు తీయాలనే ఆవేశంతో, ఇజ్రాయెల్‌ తన దారి మళ్లించింది. మొదట ఆఫ్రికా వైపు చూసింది. అక్కడ మిత్రులను వెతికింది.. వారికి సహాయం చేసింది.. సాంకేతికత ఇచ్చింది. పక్కనే నిలబడాలని ప్రయత్నించింది కానీ… అక్కడ కూడా కలలు చెదిరిపోయాయి. అదే సమయంలో నేనున్నా అని ముందుకొచ్చింది సౌతాఫ్రికా. నిజానికి ఆ సమయంలో దక్షిణాఫ్రికా కూడా ఒంటరే. పైగా అప్పట్లో అది జాతి వివక్ష పాలనలో ఉన్న దేశమది. ఇజ్రాయెల్‌కు టెక్నాలజీ ఉంటే.. దక్షిణాఫ్రికాకు యురేనియం ఉంది. ఇద్దరికీ ఒకరికి ఒకరు అవసరముందిరు. అక్కడే చీకటి ఒప్పందం మొదలైంది. అణు బాంబుల దారిలో వేసిన మొదటి అడుగు అది.

యురేనియం రాకతో తిరిగిన ఇజ్రాయెల్ దశ

ఇక్కడ నుంచి విషయాలు మరింత లోతుగా అర్థంచేసుకోవాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్‌తో దక్షిణాఫ్రికా సంబంధం మరింత బలపడింది. ఈ రెండు దేశాలు ప్రపంచానికి విరుద్ధంగా, ఒకే రకమైన ఒంటరితనంతో, ఒకే రకమైన భయంతో బతుకుతున్నాయి. ఒక దేశానికి సరిహద్దు దేశాల నుంచి ముప్పు.. మరొక దేశానికి అంతర్గత తిరుగుబాట్ల భయం. ఇద్దరికీ ప్రపంచం మీద నమ్మకం లేదు. చుట్టూ నిషేధాలు, విమర్శలు, ఒంటరితనంలోనే ఉనికిని నిలబెట్టుకోవాలని పట్టుదల మాత్రం ఉంది. అలాంటి సమయంలోనే ఇద్దరూ ఒకే మాట పట్టుకున్నారు. అణు బాంబులు అవసరమని నిర్ణయించుకున్నారు. 1960లలోనే దక్షిణాఫ్రికా నుంచి ఇజ్రాయెల్‌కి యురేనియం రవాణా మొదలైంది. ఇక అణు ప్రయోగాల నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ఇజ్రాయెల్‌ చేతికి వచ్చేసింది. ఈ దశలో ఇద్దరూ గోప్యంగా అణు బాంబుల కలను నిజం చేసేందుకు దూకారు. దక్షిణాఫ్రికా అందించిన ముడిసరుకు, ఇజ్రాయెల్ అందించిన సాంకేతికతతో అణు ప్రపంచం విస్తరించింది.

సెల్యూట్ దక్షిణాఫ్రికా

ఇక్కడికొచ్చేసరికి అణు బాంబుల గుట్టు రట్టయింది. ఇజ్రాయెల్ నిర్మించుకున్న రహస్య అణు కేంద్రాన్ని ఒక పరిశోధన సంస్థగా ఆ దేశం ప్రకటించుకుంది. కానీ చూసినవాళ్లకు మాత్రం అది ఒక అణు ఆయుధాల కర్మాగారంగా స్పష్టమైంది. ఫ్రాన్స్ సహకారంతో నిర్మించిన ఆ కేంద్రం లోపల భూమిలో తవ్విన సొరంగాలలో అణు బాంబుల నిల్వచేశారు. అప్పటికే అమెరికా దృష్టి పడింది. కానీ అప్పటికి వాషింగ్టన్‌లో నిక్సన్ పాలన కొనసాగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్ల దగ్గర ఉన్న ముడిసరుకు, ఇజ్రాయెల్ ఇచ్చిన టెక్నాలజీతో 1970 వచ్చేనాటికి సౌతాఫ్రికా కూడా సొంతంగా అణు బాంబులు తయారుచేసే స్థాయికి చేరుకుంది. ఇంతలోనే కథ చివరకి ఊహించని మలుపు తీసుకుంది. దక్షిణాఫ్రికా, తన రాజకీయం మారిపోతుందని గ్రహించింది. కొత్త పాలన వస్తుందని తెలిసిపోయింది. అప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా మిగిలింది. చేతిలో ఉన్న అణు బాంబులను నిర్వీర్యం చేసుకుంది. ప్రపంచానికి చెప్పి మరి అణు ఆయుధాలను వదిలేసుకుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ మాత్రం తలదించలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ప్రపంచంలో అణు శక్తిగానే కొనసాగుతోంది. ఇటు దక్షిణాఫ్రికా మాత్రం శాస్త్రీయంగా అణు ఆయుధాలను వదిలేసిన తొలి దేశంగా నిలిచింది.

ALSO READ: అమెరికాకు కావాల్సింది ఇదే.. అణు బాంబుల కథ పచ్చి అబద్ధం..!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *