పెళ్లి…
మళ్ళీ మంచి టాపిక్‌తో వచ్చేశా… హహా! ఇది మంచి విషయమో కాదో మీరే చెప్పాలి మరి. కొత్తగా కొంచెం హ్యుమర్‌తో కలిపి రాయాలి అనుకుని కూర్చున్నాను. ఇక రాసేద్దామా మరి 😁
పెళ్లి అనగానే చాలా మంది రియాక్షన్ “ఒరేయ్ బాబూ పెళ్లి చేసుకోద్దురా బాబూ!”
‘ఎందుకు బాబూ’
ఈ పెళ్లి(Marriage) చేసుకుంటే పెళ్లాం చంపేస్తుందని ఒకరు, మొగుడు చంపేస్తున్నాడని ఇంకొకడు.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ 😅.. నవ్వొస్తుందా? లేక భయమేస్తుందా?? కన్ఫూజన్ వస్తుందా 😅, కూల్ కూల్ ఏది వచ్చినా సరే వెళ్లిపోవాల్సిందే లేండి 😅..
పెళ్లి చేసుకోని హ్యాపీగా ఉన్నవాళ్లు ఉన్నారు లేండి? అలాగే రోజూ బాధలు పడే వాళ్లు కూడా ఉన్నారు. పెళ్లాం వద్దు అన్న కూడా తాగేసి వచ్చి కొట్టే వాళ్లు ఉన్నారు, అలాగే వద్దురా బాబు తాగి వస్తే నా పెళ్లాం నన్ను తంతది అని భయపడే వారు కూడా ఉన్నారు 😅, ఏంటి నిజమేనా? ఏంటి ఒకవైపే మాట్లాడినట్టు అనిపిస్తుందా??? లేదు అసలు నేను చెప్పాలి అనుకున్న విషయం వేరు.
ఒక 25ఏళ్లు వస్తే చాలు పెళ్లి చేసుకోవా అనేవాళ్లు ఎక్కువ అయిపోతారు. ఒకరు సరిగ్గా లేకపోయినా సరే వాళ్లని దారిలోకి తేవడానికి పెళ్లి చేయండిరా బాబు ఒక దారిలోకి వస్తారు అంటారు. ఏ దారి? రహదారా? గోదారా??😅😅 ఏమో మరి ఆ దారి వాళ్లకే తెలియాలి లేండి.. నేను పెళ్లిని కించపరిచి రాయడంలేదు. అలానే పెళ్లిని సమర్థించడం కూడా ఏ మాత్రం నా ఉద్దేశ్యం కాదు. చాలా మందికి పెళ్లి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అది ఒకరి తోడు కోసం కావొచ్చు.. ధైర్యం కోసం కావొచ్చు, ఒంటరిగా ఉండలేక కావొచ్చు, తల్లిదండ్రుల కోసం కావొచ్చు, సోసైటిలో గౌరవం కావొచ్చు. ఐదైనా అయి ఉండొచ్చు. కానీ పెళ్లి చేసుకున్నాక ఏంటి? మీరు అనుకున్నవి జరగకపోతే? మీకు నచ్చిన లైఫ్ మీకు దక్కకపోతే? ఇలా ఎంతమందికి అనిపించి ఉంటుంది? ఇవేం మనం చెప్పలేం.. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొలా ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకోని హ్యాపీగా ఉండేవాళ్లు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక రిగ్రట్ ఫీల్ అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. అరేంజెడ్ మ్యారేజ్ చేసుకోని హ్యాపీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. పేరెంట్స్ కోసం అడ్జెస్ట్ అయ్యి బతికే వాళ్లు కూడా ఉన్నారు. నా పేరెంట్స్ పరువు ఏమౌతారని కొందరు.. వాళ్ల సెల్ఫ్-రెస్పాక్ట్ వాళ్ల ఇండిపెండెన్స్ పోతుందని కొందరు.. ఇలా ఆలోచించేవాళ్లు చాలా మంది ఉన్నారు.
మరి అప్పట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు హ్యాపీగా లేరా అని మీకు డౌట్ రావొచ్చు, అందరి పేరెంట్స్ ఎలా ఉంటున్నారు అని కూడా అడగొచ్చు, అప్పటికి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు ఆడవారికి ఇష్టం ఉన్న లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఆడవారంటే చులకన, చదవనివ్వరు ,నచ్చిన బట్టలు వేసుకోకూడదు ,నచ్చిన సినిమా చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు ,ఎవరితో మాట్లాడకూడదు , ఆడది వంటింటి కుందేలు.
ఆడవారి మనుసులో ఒక భయం, చేతిలో చదువు లేదు, స్వేచ్ఛ లేదు, రక్షణ లేదు.. అలాంటప్పుడు ప్రశ్నించేతనం ఎలా వస్తుంది? ఏం మాట్లాడినా తప్పే, తెచ్చింది తినటం, చెప్పింది వినటం, ఇదేగా చేసేది, ఇప్పటికి ఏం మారింది? మగవాడు ఎంత తిరిగినా పట్టించుకోని సమాజం, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని సమాజం, ఆడది నైట్ షిఫ్ట్స్ చేస్తే ఎదో తప్పుడు పనులు చేస్తుంది. అని మాట్లాడుకుంటారు.. ఏదో ఒక రకంగా తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత ఎదిగినా లోకువే, ‘మగాడు తిరగక చెడుతాడు, ఆడది తిరిగి చేస్తుంది’ ఈ పనికిమాలిన సామెతలు దేనికి? మీరు ఎవరిని లోకువ చేస్తున్నారు? ఈ సామెతలు మదమెరిగిన మగజాతి కనిపెట్టిన సామెతలు కాదా?
దీనికి పెళ్లి అనే బంధం దేనికి ?? ఒక పడక సుఖం కోసం పెళ్లి దేనికి ?? డబ్బులు ఇచ్చి మరీ ఒక ఆడదాని దగ్గరకి వెళ్లి పడుకొని ఆమెని వేశ్య అంటారే , అదే కట్నం తీసుకున్న వాళ్ళనేం అనాలి ???
మగవారి సుఖం కోసమా పెళ్లి ,లేదా ఆడదాని రక్షణ కోసమా ?? పిల్లలు అనేది దేనికోసమో ఎవరికైనా తెలుసా ??? తెలియదు అందరు చేసుకుంటున్నారు మనం కూడా చేసుకోవాలి అంతే కదా . ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు ?? జెన్యూన్‌గా ఉండలేని వాళ్ళకి పెళ్లి ఎందుకు? ఒకరు సరిపోని వాళ్ళకి పెళ్లి ఎందుకు ? బాధ్యత లేని వాళ్ళకి పెళ్లి ఎందుకు ?? పిల్లలని కనటానికి పెళ్లి ఎందుకు ?? సమాజంలో గౌరవం కోసం పెళ్లి ఎందుకు ??
వీటికి సమాధానాలు మీ మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించండి..పెళ్లి దేనికో తెలిసిన రోజు పెళ్లి చేసుకోండి.. అప్పటివరకు ****
ఉంటా మరి..!
ఇంకా చదవండి: ప్రేమ శాశ్వతం కాదా? తీపి కలల నుంచి కల్లోల సముద్రపు కన్నీరు వరకు సాగే ప్రయాణం!

Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?
Relationship Tips: మీ లైఫ్ పార్ట్నర్తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!