Menu

Investment Ideas: SIPలో ఏది బెస్ట్? నెలకు రూ.5,000 లేదా? ఏడాదికి రూ.60,000? ఏది లాభం?

Archana 3 months ago
personal finance news

సామాన్య ఉద్యోగులు సేవింగ్స్ అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పిల్లల కోసమో లేదా దేనికైనా డబ్బు దాచిపెట్టాలనుకుంటారు. వారికీ వచ్చే శాలరీలో ఇంటి ఖర్చులు, కరెంటు బిల్లులు, స్కూల్ ఫీజులు ఇలా అన్నీ ఖర్చుపెట్టి మిగిలినవి దాచాలనుకుంటారు. దాని కోసం పెట్టుబడులు మొదలుపెడతారు. కొంతమంది సరైన కంపెనీ కోసం వెతుకి అందులో జాయిన్ అవుతారు. నిజానికి పెట్టుబడి పెట్టె ముందు మనం చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఎలా మోసం చేస్తారో తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ప్రతి నెలా 5వేల రూపాయలు స్థిరంగా పెట్టుబడి పెట్టామనుకుందాం.. మరోవైపు సంవత్సరానికి 60 వేల రూపాయలు ఒకేసారి పెట్టామనుకుందాం.. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎవరి డబ్బు ఎక్కువగా పెరిగి ఉంటుంది? వెల్త్ క్రియేషన్ ప్రపంచంలో ఒక పెద్ద సస్పెన్స్ ఉంది. ఈ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాథ్స్ ప్రకారం గెలుస్తుందా? లేదా సిప్ ఎక్కడో ఒక రహస్య శక్తితో ముందుంచబడుతుందా?

ఎంత రిటర్న్స్ వస్తాయి?

ఇక మీరు ప్రతి నెల 5వేల రూపాయలు సిప్‌(SIP)లో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల్లో మొత్తం 6 లక్షలు పెట్టుబడి అవుతుంది. 12 శాతం వార్షిక రిటర్న్స్‌తో ఇది సుమారు 11.5 లక్షల రూపాయలుగా పెరిగి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం ప్రారంభంలో 60 వేల రూపాయలు లంప్ సమ్‌గా పెడితే కూడా మొత్తం 6 లక్షలే పెట్టుబడి. కానీ అది 11.8 లక్షల వరకు పెరుగుతుంది. కనీసం 30 వేల రూపాయలు ఎక్కువ! ఎందుకంటే ప్రతి రూపాయి ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటూ కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందుతుంది. కానీ వాస్తవ జీవితం ఇంత సులభంగా ఉంటుందా? ఇక్కడే ట్విస్ట్ మొదలవుతుంది.

లంప్‌ సమ్ కష్టమా?

ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ వెనుక ఒక పెద్ద మత్‌లబ్‌ ఉంది. లంప్ సమ్ చేయడానికి మీ వద్ద సంవత్సరం ప్రారంభంలోనే 60 వేల రూపాయలు రెడీగా ఉండాలి. చాలా మంది శాలరీ వస్తున్న వారికి ఇది సాధ్యమే కాదు. మీరు నెలవారీగా 5 వేలు సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టి కలిగి సంవత్సరాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే… అంతకు ముందు ఆ డబ్బు కేవలం 34 శాతం ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తుంది. మార్కెట్ రిటర్న్స్ కోల్పోతారు. అందుకే చాలా మంది ఆ డబ్బును మెడికల్ బిల్.. ఫెస్టివల్ షాపింగ్ లేదా చిన్న ట్రిప్‌కు ఖర్చు చేసేస్తారు. ఫలితంగా లంప్ సమ్ ప్లాన్ కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఇక్కడ సిప్ బలం మెరుస్తుంది. అది ఆటోమేటిక్. ప్రతి నెల మీ శాలరీ వచ్చిన వెంటనే డబ్బు మార్కెట్‌కు వెళ్లిపోతుంది. మీరు ఆలోచించకముందే ఖర్చు చేయకముందే ఇన్వెస్ట్ అయిపోతుంది. ఇది మీ డిసిప్లిన్‌ను బలపరుస్తుంది, ఇంకాస్త డబ్బు పెరగడానికి సహాయపడుతుంది.

మరోవైపు మీరు ఒకేసారి పెట్టినప్పుడు మార్కెట్ డౌన్ అయితే పెద్ద లాస్. ఉదాహరణకు 2020 ప్రారంభంలో 60 వేల పెట్టినవాడు పాండమిక్ వచ్చేసరికి అది 36 వేలకు పడిపోయింది. కానీ సిప్ చేస్తున్నవాడు ఫిబ్రవరి..మార్చిలో తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్స్ కొన్నాడు. రికవరీ సమయంలో అది బాగా ప్రయోజనం చేసింది. ఇది రూపీ కాస్ట్ అవరేజింగ్ అంటారు ధరలు తగ్గినప్పుడు ఎక్కువ కొని పెరిగినప్పుడు తక్కువ కొని సగటు కాస్ట్‌ను తగ్గించడం. ఇది సిప్‌కు సహజమైన అడ్వాంటేజ్. లంప్ సమ్‌లో టైమింగ్ రిస్క్ ఎక్కువ మీరు మార్కెట్‌ను టైమ్ చేయలేరు.

ఇక లంప్ సమ్ పూర్తిగా చెడ్డది కాదు. మీ వద్ద బోనస్..ఇన్‌హెరిటెన్స్ లేదా ప్రాపర్టీ సేల్ నుంచి పెద్ద మొత్తం వచ్చినప్పుడు అది వెంటనే పెట్టుబడి పెట్టడం బెస్ట్. అలాంటి సమయంలో ‘పర్ఫెక్ట్ డిప్’ కోసం వెయిట్ చేస్తే మార్కెట్ అప్ అయి మీరు మిస్ అవుతారు. ఒక క్లయింట్ 10 లక్షలు పొంది కరెక్షన్ కోసం వెయిట్ చేశాడు. మార్కెట్ 15 శాతం పెరిగేసరికి 1.5 లక్షలు మిస్ అయ్యాయి. కాబట్టి మీ దగ్గర డబ్బు ఉంటే 10 సంవత్సరాల హారిజాన్ ఉంటే వెంటనే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ టైమింగ్ ట్రై చేయకండి.

మరోవైపు లాంగ్ టర్మ్ చూస్తే 20 సంవత్సరాల్లో ఈ గ్యాప్ చాలా తగ్గుతుంది. 5 వేల సిప్ 50 లక్షలకు పెరుగుతుంది లంప్ సమ్ 53 లక్షలు. కేవలం 3 లక్షలు తేడా! ఈ చిన్న మ్యాథ్స్ అడ్వాంటేజ్ మనిషి డిలే చేస్తూ ఓవర్‌థింక్ చేస్తూ మిస్ అవుతుంది. చాలా మంది హైబ్రిడ్ అప్రోచ్ చేస్తారు బోనస్‌లో కొంత లంప్ సమ్ మిగతా సిప్‌ను బూస్ట్ చేసి ఇది డిసిప్లిన్‌ను కాపాడుతూ విండ్‌ఫాల్స్‌ను స్మార్ట్‌గా ఉపయోగిస్తుంది.మీ ఇన్‌కమ్ స్టెడీగా ఉంటే సాలరీ రూటీన్‌లో సిప్ సులభం. అది మీ ఇంపల్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మీ వద్ద సర్ప్లస్ ఫండ్స్ ఉంటే లంప్ సమ్ బెటర్. కానీ ఏది ఎంచుకున్నా ఇప్పుడే మొదలుపెట్టండి.

ALSO READ: పరాన్నజీవికి చెక్‌ పెట్టే సంజీవని.. ఇక మలేరియా ఖేల్ ఖతమేనా?

 


Written By

S. Archana is an SEO specialist and sub-editor known for her strong adaptability and dedicated work ethic. A committed professional and an eager everyday learner, she continually sharpens her skills to deliver thoughtful, effective results.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *