Menu

Musk vs Williams: జ్ఞానానికి, వ్యాపారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారు?

Tri Ten B 11 months ago
elon musk vs sunitha williams

ఎలన్ మస్క్.. వ్యాపార ప్రపంచంలో ఒక విప్లవం! సునీతా విలియమ్స్… అంతరిక్ష పరిశోధనలో ఒక చరిత్ర. ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే అంశంపై ఎదురెదురుగా నిలిచారు. అదే International space station.. అంటే ISS అని పిలుస్తారు. ఇద్దరూ ఈ స్పేస్ స్టేషన్ గురించే మాట్లాడుతున్నారు. ఒకరు దాన్ని త్వరగా మూసేయాలంటున్నారు. మరోకరెమో అంత తొందరేందుకని ప్రశ్నిస్తున్నారు. ISS రిటైర్‌ అవ్వాల్సిన సమయం వచ్చిందని మస్క్‌ చెబుతుండగా.. అందుకు ఇది సరైన సమయం కాదని సునీతా విలియమ్స్‌ అంటున్నారు. నిజానికి ISS అంటే కేవలం ఒక స్పేస్ స్టేషన్ కాదు. అది మానవ జాతికి ఒక విజ్ఞాన భాండాగారం. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మార్గదర్శకంగా నిలిచిన విప్లవం.

ఎందుకీ తొందర?

1998లో మొదలైన ISS ప్రయాణం, దశాబ్దాలుగా భూమిపై ఉన్న సమస్యలకు సమాధానం చెప్పేందుకు మార్గం చూపింది. ఇప్పుడు మనం చూస్తున్న క్యాన్సర్ మందులు, కొత్త జన్యు చికిత్సలు, ఆహార ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు.. ఇవన్నీ ISS వల్లే సాధ్యమయ్యాయి. ఇంకా చెప్పాలంటే… ISS ప్రయోగాల కారణంగా భూమిపై కంటి చూపు కోల్పోయిన వేల మందికి తిరిగి చూపు వచ్చే విధానాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తున్న ISSని మస్క్ ఎందుకు తొందరగా రిటైర్ చేయాలని కోరుకుంటున్నాడు?

మస్క్ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారా?

మస్క్ వ్యూహం వేరు.. అతను వ్యాపారవేత్త. ఆయనకు అంతరిక్ష ప్రయాణం అంటే కల కాదు, ఒక బిజినెస్ మోడల్. ISS కోసం NASA 25 వేల కోట్ల ఖర్చు చేస్తోంది. ఈ డబ్బుని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నది మస్క్ ఆలోచన. నాసా ఖర్చు చేసే ప్రతి డాలర్ SpaceX ప్రయోగాల్లోకి మళ్లితే, ప్రైవేట్ అంతరిక్ష వ్యాపారం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ISS మానవతకు ఉపయోగపడుతుంది కానీ.. ఇది ఖరీదు ఎక్కువ, నిర్వహణ భారమైందని మస్క్ భావిస్తున్నారు. ISSకి బదులుగా మార్స్, చంద్రుడిపై నివాసం కోసం, కొత్త అంతరిక్ష స్టేషన్ల కోసం నిధులు మళ్లించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. కానీ నాసా దీనికి సిద్ధంగా లేదు. ISSని 2030 వరకు కొనసాగించాలనుకుంటోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. ISS కేవలం అమెరికాకి మాత్రం చెందిన స్టేషన్‌ కాదు. ఇది రష్యా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా లాంటి 15 దేశాలు ISSలో భాగంగా ఉన్నాయి. ISSలాంటి స్టేషన్ల ద్వారా అమెరికాకు అంతర్జాతీయ సహకారం అందుతోంది. మరోవైవు మస్క్‌ వాదన వెనుక రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేవారున్నారు. నాసాకు ఎక్కువగా నిధులు కేటాయించకూడదనే అమెరికా ప్రభుత్వంలో ఉన్న కొందరి వాదనకు మస్క్ సహకరిస్తున్నాడట. అందుకే ISS నిధులను కుదించి, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష పరిశోధనను చేపట్టాలని మస్క్ కోరుతున్నాడట. ఇదే విషయాన్ని మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు చెబితే అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఇప్పుడేమో అధికారంలో ట్రంప్ ఉన్నారు. ఆయనకు మస్క్ ఎంత చెబితే అంతే..!

పోరాటానికి ముగింపు ఎలా ఉండనుంది?

అటు సునీత విలియమ్స్ లాంటి సైంటిస్టులకు ఈ రాజకీయాలతో పని ఉండదు.. వారి జీవితం విజ్ఞానానికే అంకితం. అందుకే కాబోలు ISSను త్వరగా మూసి వేయ్యాలన్న మస్క్‌ అభిప్రాయాన్ని ఆమె ఖండించారు. ISSలో నాసా ప్రయోగాలు మాత్రమే చేయడంలేదని మానవజాతికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు సునీత. బుచ్ విల్మోర్, సునీతా విలయమ్స్‌ 9 నెలలగా ISSలోనే ఉండిపోయారు. అక్కడ నుంచే ఆమె ఈ కామెంట్స్‌ చేశారు. మరి చూడాలి ISS కొనసాగుతుందా లేదా మస్క్ వ్యూహం గెలుస్తుందా? ఈ పోరాటానికి ముగింపు ఏంటి? ట్రంప్‌ను అడ్డం పెట్టుకోని మస్క్‌ ISSను త్వరగా సాగనంపితే మాత్రం అది నాసా సైంటిస్టులకు ఘోర అవమానంగానే చెప్పాలి. ఎందుకంటే ఇది మస్క్ వర్సెస్‌ విలియమ్స్ కథ మాత్రమే కాదు. విజ్ఞానానికి, వ్యాపారానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ..!

ఇది కూడా చదవండి: Stupid అంటూ జెలెన్‌స్కీపై నోరుపారేసుకున్న అగ్రరాజ్య అహంకార ప్రెసిడెంట్‌.. నెక్ట్స్‌ ఏం జరగనుంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *