Menu

International Lefthanders Day: జనాలందు వీరు ప్రత్యేకమయా! అంతర్జాతీయ ఎడమ చేతి వాటం దినోత్సవం!!

Sumanth Thummala
internatinal left handers day

ప్రపంచంలో దాదాపు 90శాతం మంది రోజు చేసుకునే పనుల్లో ఇబ్బందులు 10శాతం మందికి ఎదురవుతాయి తెలుసా?! కుళాయి తిప్పటం, కత్తెరతో కత్తిరించడం, డోర్ హ్యాండిల్స్ తీయడం, టీ/కాఫీ కప్పు పట్టకోవడం, ఎగ్జామ్ రాయడం వగైరా పనులు. బహుశా దివ్యాంగుల గురించి ఏమో! అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ ఇబ్బందులు మరెవరికో కాదు ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళ గురించి.

ఇవాళ అంతర్జాతీయ ఎడమ చేతివాటం దినోత్సవం (International left-handers day )..ఈ ఎడమ చేతివాటం వ్యక్తులు పడే ఇబ్బందులు అవగాహన గురించి ప్రచారం చేయడానికి బ్రిటన్ లో లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ ను ఏర్పాటు వారు 1992 ఆగస్టు 13న బ్రిటన్ లో ఈరోజు జరుపుకోవడం మొదలుపెట్టారు. క్రమేపీ ఇది ప్రపంచ నలుమూలల వ్యాపించింది.

శాస్త్రజ్ఞుల ప్రకారం ఎడమ చేతివాటం అనేది పరిణామ క్రమంలో కొంత శాతం జనాభా కి అలవాటు అయ్యింది అని అంచనా వేస్తున్నారు. అలానే కుటుంబంలో జీన్స్ ద్వారా కూడా రావచ్చు.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సాధారణంగా కుడి చేతివాటం ఉన్న వాళ్లకు మెదడులో ఎడమ వైపు ప్రభావంతంగా ఉంటుంది, అదే ఎడమ చేతివాటం వాళ్లకు మెదడులో కుడివైపు ప్రభావంతంగా పనిచేస్తుంది.

దీనివల్ల ఇబ్బందులేనా? లాభాలు లేవా?

ఎడమ చేతివాటం వల్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినా దానివల్ల కొన్ని సందర్భాల్లో లాభం కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఆటల్లో చూస్తుంటాం.. ఎడమ చేతి వాటం ఆటగాళ్ల వల్ల కుడి చేతివాటం ఆటగాళ్లు ఇబ్బందులు పాలవటం. క్రికెట్లో ఎడమ చేతివాటం బౌలర్లు వసీం అక్రం, మిచెల్ స్టార్క్, జహీర్ ఖాన్ లాంటి ఎంతోమంది ఆటగాళ్లు ప్రభావవంతంగా ఉండడం చూస్తూనే ఉంటాం. టెన్నిస్ దిగ్గజాలైన రఫెల్ నాదాల్ ,మార్టిన నవ్రతిలోవా.. ఫుట్ బాల్ దిగ్గజాలు పీలే,మారడోనా, మెస్సి కూడా ఎడమ చేతివాటం గలవారే.

ఎడమ చేతివాటం గల దిగ్గజాలు, సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.

ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్,

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్

నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్,

సూపర్ స్టార్ రజనీకాంత్

హాలీవుడ్ యాక్టర్లు ప్రముఖ యాక్షన్ హీరో టామ్ క్రూజ్

ఏంజలీనా జోలి

కియాను రీవ్స్

ఇక రాజకీయాల్లో, వ్యాపారస్తుల్లో కూడా ఎడమ చేతివాటం వాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీ,అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మదర్ థెరిసా, బిల్ గేట్స్, రతన్ టాటా ఇలా ఎంతో మంది ఉన్నారు.

ఎడమ చేతి వాటం కలవారు ఈ ప్రపంచంలోనే ఒక అరుదైన వ్యక్తులు. దీనికి హేతుబద్ధతలేని మూఢనమ్మకాలు జోడించి వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వాళ్ళ ఇబ్బందుల్ని అర్థం చేసుకొని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. మీకు తెలిసిన ఎడమ చేతివాటం వాళ్ళు ఎవరైనా ఉన్నారా! ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.

Also Read: ఒలింపిక్స్‌లో ఇండియా రాణించలేకపోవడానికి కారణం ఎవరు..? అత్యధిక జనాభా ఉన్నా ఫలితం సున్నా!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *