మనిషి ఎంత సంపాదించిన మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్ధమే. అందుకే కొందరు తత్వవేత్తలు అంటుంటారు “ఎంత సంపాదించాం అనేది కాకుండా ఎంత సంతోషంగా ఉన్నాం అనేది ముఖ్యం” అని. అందుకే ఐక్యరాజ్యసమితి కూడా ఆ భావనలో అంతర్జాతీయ ఆనంద దినోత్సవం(International Happiness Day)నిర్వహిస్తుంది. ప్రతి మార్చి 20న ఇది జరుపుకుంటారు.
ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా, ప్రజల ఆరోగ్యం,సంక్షేమం, మెరుగైన పాలన, స్వేచ్ఛ, సమానత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు స్థాపించబడింది.
భూటాన్ మార్గదర్శకం:

భూటాన్ దేశం ప్రజల అభివృద్ధిని డబ్బుతో కాకుండా సంతోషంతో కొలుస్తుంది. దిన్నుంచి స్ఫూర్తి పొందిన ఐక్యరాజ్యసమితి 2012లో అంతర్జాతీయ ఆనందో దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది.
2013 లో మొదలై,ప్రతి ఏటా మార్చి 20న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆనంద దినోత్సవం(International Happiness Day) ని నిర్వహిస్తుంది.
ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ లో దీన్ని నిర్వహిస్తారు, అలానే ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ తో నిర్వహిస్తున్నారు.
అదే “షేరింగ్ ఈజ్ కేరింగ్( Caring &sharing ) .
కంచె సినిమాలో హీరో ఓ డైలాగ్ అంటాడు. “తుంచుకునేది పెంచుకోవడానికే” అని. అలానే ఆనందం కూడా పంచుకుంటే పెరుగుతుంది తప్ప తరగదు.
మరి ఈ సంతోషాన్ని ఎలా పంచాలి?
మన చుట్టూ ఉన్న నలుగురికి మన సంతోషాన్ని పంచాలి. మనకు తెలిసిన వాళ్ల బాధను పంచుకొని ఆ భారాన్ని దించాలి. మన అనుకున్న వాళ్ళతో నిరంతరం మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉండాలి.
అసలు ఆనందాన్ని (World Happiness Index) ఎలా కొలుస్తారు?
ప్రపంచ ఆనంద సూచిక (World Happiness Report) ను సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (SDSN) ఐక్యరాజ్యసమితి సహకారంతో విడుదల చేస్తుంది. ఈ సూచికను కొలవడానికి Gallup World Poll ద్వారా సేకరించిన డేటాను ఉపయోగిస్తారు.
ప్రధానంగా ఈ కింది ఆరు అంశాల ఆధారంగా హ్యాపీనెస్ స్కోరు నిర్ణయిస్తారు:
1. ఆర్థిక స్థితి (GDP per capita) – దేశ ప్రజల ఆదాయ స్థాయిని ఆధారంగా తీసుకుంటారు.
2. సామాజిక మద్దతు (Social Support) – అవసరంలో ఉన్నపుడు కుటుంబం, స్నేహితులు లేదా ప్రభుత్వం మద్దతు ఇస్తుందా అనే అంశాన్ని పరిశీలిస్తారు.
3. ఆయుష్య కాలం (Healthy Life Expectancy) – ప్రజలు ఆరోగ్యంగా, ఎక్కువ రోజులు జీవించే అవకాశాన్ని అంచనా వేస్తారు.
4. స్వేచ్ఛ (Freedom to make life choices) – వ్యక్తిగత జీవిత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఎంతవరకు ఉంది అన్నది గమనిస్తారు.
5. ఉదారత (Generosity) – ఇతరులకు సహాయం చేసే లక్షణాన్ని దేశస్థాయిలో పరిశీలిస్తారు.
6. అవినీతి లేకపోవడం (Perceptions of Corruption) – ప్రభుత్వ వ్యవస్థలు, వ్యాపార సంస్థల్లో అవినీతి స్థాయిని మదింపు చేస్తారు.
ప్రతీ దేశం ప్రజలు ఈ అంశాలపై ఎలా స్పందించారన్న దాని ఆధారంగా 0 నుంచి 10 వరకు స్కోరు ఇవ్వబడుతుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ లాంటి దేశాలు తరచుగా హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానాల్లో ఉంటాయి.
ఇండియా ర్యాంక్:
ఈ సూచికలో ఇండియా 2024 లో 143 దేశాల్లో 126 వ స్థానంలో ఉంది.
*భారతదేశం హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో వెనుకబడటానికి కారణాలు:
2024 గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో భారత్ 143 దేశాల్లో 126వ స్థానంలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
సామాజిక కారణాలు
ఆర్థిక అసమానతలు: ఓవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అంబానీ- అదానీ లు దేశంలో ఉండగా, అత్యధిక పేద వాళ్ల సంఖ్య కూడా ఇక్కడే ఉంది. ధనిక-పేదల మధ్య వ్యత్యాసం అధికంగా ఉంది. 1% ధనవంతులే దేశ సంపదలో అధిక భాగం కలిగి ఉన్నారు. ఓవైపు కార్పొరేట్ల సంపద వందల రేట్లు పెరిగితే, సామాన్యుల సంపాదన అంతంతమాత్రంగానే ఉంది.
ఆరోగ్య సేవల కొరత : ప్రభుత్వ ఆరోగ్య సేవలు తక్కువ ఉండటంతో ప్రజలు అధిక ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
కుల, మత,లింగ,ప్రాంతీయ వివక్షలు

దేశంలో కుల వివక్ష మీద పోరాడే వాళ్ళతో పాటు కులాన్ని దాంట్లో ఉండే వివక్షను సమర్థించే సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఇక బిజెపి అధికారంలోకి వచ్చాక మొత్తం మతతత్వం బాగా పెరిగింది. అది హిందూయేతర మతాలపై వివక్షను పెంచుతుంది. స్వయానా ఈ దేశ ప్రధానమంత్రే ఒక మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
లింగ వివక్షత ను కూడా ఈ దేశంలో తీవ్రంగా ఉంది. అత్యాచారాలు, లైంగిక వేదింపులు, మగ-ఆడ వేతనాల్లో హెచ్చుతగ్గులు, కోత్త క్రిమినల్ చట్టాల్లో మగవారి పై,ట్రాన్స్ జెండర్
ల మీద జరిగే లైంగిక దాడులకు చట్టంలో చోటు లేదు.
బెంగళూరు లో హిందీ మాట్లాడితే దాడులు, ఉత్తర రాష్ట్రాల నాయకులు దక్షిణాది రాష్ట్రాలపై స్టీరియోటైప్ వ్యాఖ్యలు. ఇక ఈశాన్య రాష్ట్ర ప్రజలపై చైనీస్ అని వివక్ష చూపడం.
రాజకీయ కారణాలు :
అవినీతి: ప్రభుత్వ పాలనా వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కరప్షన్ సూచిక(Corruption index) లో భారతదేశం 96 స్థానంలో ఉంది.
ప్రజా సమస్యలు పట్టని పాలన:
ప్రజా అవసరాలను తీర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. మత,ప్రాంతీయ, భాష, చరిత్ర, అశాస్త్రీయమైన అంశాలు పైన వ్యాఖ్యలు చేస్తూ; జనాల అవసరాలైన ఉపాధి కల్పన, ఆర్థిక అసమానతలు, అందుబాటులో నాణ్యమైన విద్య,వైద్య -ఆరోగ్యం,మౌలిక సదుపాయాలు గురించి పాలకులు మాట్లాడరు. ఇక అది జనాల నోళ్ళలో కూడా నానట్లేదు.
ఆర్థిక కారణాలు
ఉద్యోగలేమి: యువతలో నిరుద్యోగిత పెరుగుతున్నది.
ధరల పెరుగుదల: వేతనాలు పెరగక, దినసరి ఖర్చులు అధికమవడం ప్రజలను ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది.
మానసిక – ఆరోగ్య సమస్యలు
మెదడుకు మానసిక ఒత్తిడి: భారతీయులు ఎక్కువగా పని ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, సమాజ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక విద్యార్థి సరైన మార్కులు తెచ్చుకోవాలి ర్యాంకు తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఉద్యోగం తెచ్చుకొని మంచి సంపాదన ఉండాలి. పెళ్లి చేసుకోవాలి. కుటుంబానికి అన్నీ సమకూర్చాలి. ఇలా భారతదేశ మానసిక రుగ్మతలకు ప్రపంచంలో అగ్రగామిగా ఉంది.
మానసిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం: మానసిక సమస్యల్ని పబ్లిక్‌గా చెప్పడానికి సమాజంలో చాలా మంది సంకోచిస్తారు. అసలు మానసిక రుగ్మతలకు చికిత్స తీసుకోవడాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు.
మనం పైన చెప్పుకున్నట్టు ఒక మనిషి సంతోషానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు సరిగ్గా లేనప్పుడే మనిషి సంతోషం గతి తప్పుతుంది.
ఇవన్నీ కూడా ఒక మనిషి సంతోషంగా ఉండకపోవడానికి కారణాలుగా ఉంటాయి.
ప్రభుత్వాలు ఈ కారణాలపై పనిచేయాల్సిన బాధ్యత అత్యధికంగా ఉంది.
దాంతోపాటు ఇందులో కొంత మన చేతిలో కూడా ఉంది. ఎవరిపైన విపక్ష చూపకుండా, అందరినీ సమానంగా చూస్తూ.. నలుగురికి మన సంతోషాన్ని పంచుతూ, మానసికంగా – శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే నిజమైన సంతోషం వస్తుంది.











Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్‌మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Lakshmapur Elections: లగిశెట్టి మాధవి.. సామాన్యుల కోసం పనిచేసే జర్నలిస్ట్..! లక్ష్మాపూర్ ప్రజలకు మాధవి హామీ ఇదే!
Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
బిల్లా-రంగా ఎవరు? ఎలా నేరాల బాట పట్టారు? ఎలా అంతమయ్యారు?
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!