Menu

Moun Modia: ఎలక్టోరల్‌ బాండ్ల ఊసే లేదు.. బీజేపీ కోసం మీడియా మౌన వ్రతం!

Praja Dhwani Desk

Indian Media Silence On Electoral Bonds: సంచలనం.. సంచలనం.. సంచలనం.. ఏదైనా న్యూస్‌ఛానెల్‌ లేదా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే అందులోని టాప్‌ వార్తల్లో ప్రతీది సంచలన వార్తే! ప్రతిపక్షాన్ని అధికార పక్షం విమర్శించినా అది సంచలనమే. సీటు ఇవ్వలేదని ఎవరైనా నేత పార్టీ జంప్‌ కొట్టినా అది కూడా సంచలన నిర్ణయమే. ఎందుకో ప్రతీది సంచలనంగానే కనిపించే మీడియాకు ఎలక్టోరల్‌ బాండ్ల డేటా మాత్రం సాధారణ న్యూస్‌లానే కనిపించింది. దేశపు అతిపెద్ద కుంభకోణాన్ని మీడియా చాలా లైట్‌ తీసుకుంది. బీజేపీ చేసిన అతి పెద్ద మోసాన్ని అసలు మోసమే కాదన్నట్టు మొత్తానికి బాండ్ల న్యూస్‌ని కరివేపాకులా తీసిపడేసింది. గోరంత విషయాన్ని కొండంత చేసి చూపించే జాతీయ మీడియా సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్ల డేటా గురించి ఏదో రిపోర్టింగ్‌ చేశామా, న్యూస్‌ కవర్‌ చేశామా అన్నట్టు ప్రవర్తించాయి. ఇటు తెలుగు మీడియాలో అయితే అసలు బాండ్ల ఊసే లేదు.


స్క్రోలింగ్‌లో కూడా చోటు లేదు:
ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలులో నంబర్‌-2 పొజిషన్‌లో నిలిచింది మేఘా సంస్థ. ఈ సంస్థకు టీవీ9లో షేర్లు ఉన్నాయి. అందుకే సమాచార స్రవంతి టీవీ9 బాండ్ల డేటా విషయంలో మౌనం పాటించింది. అటు మిగిలిన తెలుగు ఛానెల్స్‌ కూడా అలానే వ్యవహరించాయి. ఎంతైనా తెలుగు మీడియా అంతటా మేఘా మాయ ఉంది కదా. అందుకే కాబోలు అసలు ఈ న్యూస్‌తో ప్రజలకు ప్రయోజనమే లేదనట్టు బాండ్ల డేటా వార్తలను సైడ్‌ చేశాయి. అటు నేషనల్‌ మీడియాలో సాధారణ విషయాలకు గొంతుచించుకోని హడావుడి చేసి రిపబ్లిక్‌ ఛానెల్‌లో అసలు ఈ న్యూస్‌ స్క్రోలింగ్‌లో కూడా కనిపించలేదు.

సగం కంటే ఎక్కువ వారిదే:
ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యంగ విరుద్ధమని సాక్ష్యాత్తు సుప్రీంకోర్టే చెప్పినా ఈ విషయంలో బీజేపీని పల్లెత్తు మాట అనని భక్తజనంలా మీడియా మారిపోయింది. 1975-ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన మీడియా నేటి మోదీ తప్పులను మాత్రం బహిర్గతం చేయదు. ఎందుకంటే దేశంలో సగం కంటే ఎక్కువ మీడియా సంస్థలు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాగో భయపెడుతుంటాయి. బీజేపీకి వ్యతిరేకంగా వార్త రాస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తాయి.. లేకపోతే ఆ న్యూస్‌కి ఫండింగ్‌ ఇచ్చింది ఏ చైనానో, పాకిస్తానో అని ప్రచారం చేస్తాయి. అంతేకానీ తప్పులను మాత్రం ఒప్పుకోవు. అందుకే రాజ్యంగవిరుద్ధమైన ఎలక్టోరల్‌ బాండ్లు మీడియాకు రాజ్యంగబద్దంగానే కనిపించినట్టు ఉన్నాయి. అసలు ఇండియాలో మీడియాను మ్యానేజ్‌ చేస్తున్నదంతా ప్రభుత్వాలే.. అయినా కూడా ఇది ప్రజాస్వామ్య దేశమే.. ఆ కమ్యూనిస్ట్‌ దేశాలకి ఎలాగో తెలివి ఉండదు.. మొత్తం మీడియాని ప్రభుత్వ అధికారిక డబ్బుతో నియంత్రిస్తారు. ఇక్కడైతే అంబానీలు,అదానీలు, మేఘాలు నియంత్రిస్తారు.. ప్రభుత్వాలకి భలేగా డబ్బులు మిగులుతాయి.

Also Read: దేశపు అతిపెద్ద స్కామ్‌.. ప్రజలకు అసలు నిజాలు తెలియాలి..! సుప్రీం తీర్పు తర్వాత ఏం జరగబోతోంది?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *