Menu

Jadeja: 15ఏళ్లగా అదే ఆత్రం.. జడేజా తొందరపాట్లకు ఇంకెంతమంది ఔట్ అవ్వాలో!

Tri Ten B
Heartbroken Sarfaraz Khan consoled by teammates in dressing room after unfortunate run-out

Jadeja and His Love Story with Runouts: ఒకసారి చేస్తే పొరపాటు.. రెండోసారి చేస్తే తప్పు.. మూడోసారి చేస్తే నేరమని సినిమాల్లో డైలాగులు వింటూనే ఉంటాం. అయితే ఒకటి, రెండు, మూడుసార్లు కాదు.. జడేజా(Ravindra Jadeja) ముప్పైసార్లు ఒకటే తప్పు చేస్తుంటాడు. తొందరపాటు, ఆత్రం అతని కెరీర్‌ మొదటి నుంచి ఉన్నాయి. టెస్టుల్లో ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆల్‌రౌండర్లలో జడేజా ఒకడు. అయితే ఇదంతా కాయిన్‌కు ఒకసైడ్ మాత్రమే. ఇంకోసైడ్‌ పూర్తిగా భిన్నం. తన కంగారు, తొందరపాటు, ఆత్రంతో సొంత జట్టు బ్యాటర్లను పదేపదే ఔట్ చేసే ప్లేయర్‌గా జడేజా కాస్త వింత పేరే ఉంది. అయితే తనే ఔట్ అవుతాడు.. లేకపోతే ఇతర ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపుతాడు.. తాజాగా ఇంగ్లండ్ పై మూడో టెస్టులో సర్ఫరాజ్‌(Sarfaraz khan)ను అలానే ఔట్ చేశాడు. పరుగు లేని చోట పరిగెత్తుకురమ్మని అరిచిన జడ్డూ.. తర్వాత వెంటనే తన్‌ కాల్‌ను ఆపేశాడు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అరెంగ్రేటం మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడి అందరి ప్రశంసలు దక్కించుకున్న సర్ఫరాజ్ సెంచరీ మిస్‌ అయ్యింది.

అది స్వార్థమే:
జడేజా ఈ విధంగా లేనిపోని ఆత్రంతో సొంత జట్టు బ్యాటర్లను ఔట్ చేయడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ అనేకసార్లు ఇలానే చేశాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్‌లో పాకిస్థాన్‌ బౌలర్లపై భీకర దాడి చేసిన పాండ్యాను జడేజానే ఔట్ చేశాడు. ఈ కుర్రాడిని ఔట్ చేయడం ఎలారా బాబు అని పాక్‌ బౌలర్లు కిందామీదా పడుతుంటే జడేజానే వారికి ఆ పని చేసి పెట్టాడు. పాండ్యా కాసేపు ఔట్ అవ్వకుండా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.. అప్పటికే 43 బంతుల్లో 76 పరుగులు చేసిన పాండ్యాను జడేజా అడ్డంగా ఔట్ చేశాడు. అది కూడా చాలా స్వార్థంగా వ్యవహారించాడు. తప్పంతా తనవైపే ఉన్నా.. ఓవైపు పాండ్యా భయంకర హిట్టింగ్ చేస్తున్నా జడేజా కనీసం తన వికెట్‌ను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడలేదు. ఇది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. నాడు జడేజా చేసింది ముమ్మాటికి స్వార్థంతో కూడిన చర్యే!


మొదటి నుంచి ఇంతే:
ఇటు టెస్టుల్లో జడేజా ఇప్పటివరకు ఏకంగా 10మందిని రన్‌ ఔట్ చేశాడు. జడేజా ఆత్రుతకు బలైన ప్లేయర్లలో ధోనీ, కోహ్లీతో పాటు రహానే కూడా ఉన్నాడు. ముందుగా రన్‌ కోసం కాల్ ఇవ్వడం.. వెంటనే పిచ్‌ మధ్యలో ఆగిపోవడం.. ఇతర బ్యాటర్‌ ఔట్ చేయడం జడేజా నైజం. అయితే ఇలా కేవలం సొంత జట్టు ప్లేయర్‌ను ఔట్ చేయడమే కాదు.. తాను కూడా మ్యాచ్‌ కీలక సమయాల్లో రన్‌ ఔట్ అవుతుంటాడు. అది కూడా ఆత్రంతోనే. అక్కడా రన్‌ ఉండదు.. అయినా పరిగెడతాడు.. ఆవేశపడి పరుగులు తియ్యాల్సిన అవసరం ఉండదు.. అయినా క్రీజు దాటి అప్పనంగా వికెట్ సమర్పించుకుంటాడు. 2009 హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే మ్యాచ్‌ నుంచి నిన్నగాక మొన్న అదే హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టు మ్యాచ్‌ వరకు జట్టుకు అవసరమైన వేళ అనవసర పరుగుకు ప్రయత్నించి ఓటమికి గల కారణాల్లో ఒకడుగా నిలిచాడు. 2009 హైదరాబాద్‌ వన్డేలో 350 పరుగుల టార్గెట్‌ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం మూడు పరుగుల తేడాతోనే ఓడిపోయింది. రీచ్‌ అవ్వాల్సిన టార్గెట్‌లో సచిన్ సగం పరుగులు(175) చేసినా రైనా అర్థసెంచరీతో రాణించినా.. చివరకు జడేజా తొందరపాటు రనౌట్‌తో మ్యాచ్‌ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది. ఇటు ఇంగ్లండ్‌పై తొలి టెస్టులోనూ ఆదుకోవాల్సిన జడ్డూ.. ఆత్రంతో క్రీజు దాటి స్టాక్స్‌ డైరెక్ట్‌ హిట్‌కు పెవిలియన్‌ చేరి టీమిండియా ఓటమిని ఖాయం చేశాడు. ఇలా 15ఏళ్లుగా జడేజా ఆత్రం కొనసాగుతూనే ఉంది.. టెస్టుల్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నా ఈ లక్షణం మాత్రం పోలేదు.


Also Read: స్నేహానికన్న మిన్న ఏమున్నది రా కన్నా! సాయం చేసిన వారిని మరువని ధోని !!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *