భారత్లో ఉద్యోగుల కోసం ఒక కొత్త నియమం వచ్చింది. ఓ ఎంప్లాయ్ ఆఫీసు వదిలిపెట్టిన రెండు రోజుల్లోగా కంపెనీలు చివరి జీతం ఇవ్వాలి. ఇది కొత్త కార్మిక చట్టం(New Labour Codes)లో ఉంది. ఉద్యోగి రాజీనామా చేసినా, కంపెనీ తొలగించినా ఈ నియమం వర్తిస్తుంది. గతంలో లాస్ట్ మంత్ శాలరీ ఇవ్వడానికి చాలా రోజులు పట్టేది.. ఇప్పుడు మాత్రం ఆ పని రెండు రోజుల్లోనే పూర్తవ్వాలని రూల్ అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త నియమం వల్ల ఉద్యోగం వదిలేసే వాళ్లకు వెంటనే డబ్బు దొరుకుతుంది. ఆఫీస్కు సంబంధించిన అన్ని చెల్లింపులు వెంటనే వస్తాయి. గతంలో 40-45 రోజుల సమయమంటూ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను చాలా ఇబ్బందులు పెట్టేవి. కొత్త ఉద్యోగానికి వెళ్తున్నవాళ్లకు లేదా ఏదైనా ఊహించని కారణాలతో ఉద్యోగం మానేసినవాళ్లకు ఈ రూల్ వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక రెండు రోజుల్లో బ్యాలెన్స్ జీతాలను ఉద్యోగికి ఇవ్వడం HR వ్యవస్థకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ విషయానికి పెద్దగా ప్రియారిటీ ఇవ్వని కంపెనీలు ఇకపై లాస్ట్ మంత్ శాలరీ విషయంలో ఫోకస్డ్గా ఉండి తీరాల్సిందే. జీతాలు చెల్లించే వాళ్లు, మేనేజర్లు, కంప్యూటర్ విభాగం అందరూ కలిసి వేగంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఈ నియమం భారత్లో ఉద్యోగం వదిలే విషయంలో కొత్త ప్రమాణం అవుతుంది. ఇప్పటివరకు కంపెనీలు ఇష్టం వచ్చినప్పుడు లాస్ట్ మంత్ శాలరీ ఇచ్చేది. ఇప్పుడు చట్టం ప్రకారం తప్పకుండా రెండు రోజుల్లోనే ఇవ్వాలి.
ALSO READ: ఆఫీస్ ఫ్రెండ్షిప్ మీ జాబ్ శాటిస్ఫాక్షన్ను ఎలా పెంచుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయ్?

Office Work Culture: ఆఫీస్ ఫ్రెండ్షిప్ మీ జాబ్ శాటిస్ఫాక్షన్ను ఎలా పెంచుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయ్?
New Labour Codes: శాలరీలో చేతికి సగమే ఇస్తారా? మీ జేబుకు ప్రభుత్వం పెద్ద సైజు చిల్లు పెట్టిందా?
Work Culture: ఫేవరటిజం, పక్షపాతం, కార్పొరేట్ ఆఫీసుల్లో టాక్సిక్ వర్క్ కల్చర్..! పెద్దల అహంకారానికి హద్దే లేదా?
Mental Health: ‘నాకేం నేను బాగానే ఉన్నాను’ అనే మాయలోనే బ్రతికేస్తున్నారా? అసలు నిజం తెలుసుకుంటే ఫ్యూజులౌట్!
Work Culture in India: మన తోటి ఉద్యోగిని బానిసగా కాదు… అవకాశమిచ్చి కూర్చొనిద్దాం…!
CEOs-Employees: పని తక్కువ.. పెత్తనాలు ఎక్కువ..! జీతాలు కూడా దోచుకుంటున్న ఆఫీస్ పెద్దలు!