Is Modi Sent by God? : ఇండియాలో మనుషులను దేవుళ్లగా పూజించడం సాధారణ విషయమే.. అటు తమకు తాముగా తామే దేవుళ్లమని ప్రకటించుకోవడం కూడా చాలా చిన్న విషయమే.. వారినే స్వామిజీలని, బాబాలని, నిత్యానందలని, కల్కి భగావన్‌లని, డేరా బాబాలని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వీరంతా మనుషులే.. కానీ వారందికి ఏవో దైవ శక్తులన్నాయని నమ్ముతుంటారు భక్తులు. ఇదంతా మూఢత్వం..! ఇలా సామాన్య జనాలు ఇతర సామాన్య జనాలను బురిడి కొట్టిస్తే సరేలే అనుకోవచ్చు కానీ ఏకంగా దేశ ప్రధానే తనని తానుగా దేవుడు పంపిన బిడ్డగా చెప్పుకోవడం దుర్మార్గం.
జీసస్ మళ్లీ పుట్టాడా?
ఇప్పటివరకు విశ్వగురువుగా తనని తాను ప్రమోట్ చేసుకున్న నరేంద్ర మోదీ ఇప్పుడు ఏకంగా దేవుడి బిడ్డగా చెప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మోదీ ఎక్కువగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే జీసస్ మళ్లీ పుట్టాడా అని అనిపించకమానదు. లేదా బైబిల్ చదువుకోని ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారా అని కూడా అనుమానం వస్తోంది. ఎందుకంటే జీసస్ కథనే అటు తిప్పి ఇటు తిప్పి చెప్పారు మోదీ. తన తల్లి బతికి ఉన్నప్పుడు తాను బయోలాజికల్‌గా పుట్టానని నమ్మేవాడినన్ని… ఆమె చనిపోయిన తర్వాత, తన అనుభవాలన్నీ ఆలోచించినప్పుడు, దేవుడు తనని పంపినట్టు నమ్ముతున్నానని చెప్పుకోచ్చారు ఈ విశ్వగురువు.
Remembering this hair raising speech my Narendra Modi on the day of Ram Mandir inauguration! pic.twitter.com/Yl9D150TLa
— Harshvardhan Modi (@hvmodi) May 19, 2024
ఇలా ఎవరైనా చెప్పుకుంటారా?
నిజానికి తల్లిపై ప్రేమున్న ఏ కొడుకు కూడా ఇలాంటి కామెంట్స్ చేయరు. కేవలం ఓట్ల కోసమే మోదీ ఇంత దిగజారరని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మోదీని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని రాహుల్‌గాంధీ విమర్శిస్తున్నారు. ఇక NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాటలు బైబిల్‌తో పాటు ఖురాన్‌ను గుర్తుకు తేస్తున్నాయి. దేవుడు తనను ఏదో ప్రయోజనం కోసం భూమికి తీసుకొచ్చారని చెప్పారు మోదీ.
‘ఒకసారి లక్ష్యం నెరవేరితే నా పని అయిపోతుంది. అందుకే నన్ను నేను పూర్తిగా దేవుడికి అంకితం చేసుకున్నాను..’ :- మోదీ
బైబిల్ చదివి ఇంటర్వ్యూకు..?
ఇలా ఒక మంచి కార్యం కోసం దేవుళ్లు కొందరిని భూమిపైకి పంపించడం ప్రతీ మత గ్రంథల్లో ఉండే విషయమే. అయితే ఇక్కడ మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. బీజేపీ భక్తజనం ఎక్కువగా ఆరాధించే రాముడి కథలో ఎక్కడా కూడా ఆయన్ను దేవుడు పంపినట్టు ఉండదు. రాముడు తన తల్లికే పుట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడ మోదీ మాత్రం బైబిల్‌లో కథను తీసుకొచ్చారు. హిందూమతాన్ని ఓ సెక్యూలర్ దేశానికి ప్రధానిగా ఉంటూనే ప్రమోట్ చేసే మోదీ తన గురించి చెప్పుకునే కథను మాత్రం వేరే మత గ్రంథం నుంచి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇంతకీ ఆయన ఏ దేవుడు?
ఒక మనిషి మీద ఆధారపడతున్న బీజేపీ తన గొయ్యిను తానే తవ్వుకుంటోంది. మోదీ ట్రాప్‌లో యావత్ సంఘ్ పరివార్ చిక్కుకుంది. ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీని బీజేపీ ఎలివేట్ చేసిన తీరు చూస్తే ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. రాముడు మోదీని హగ్ చేసుకుంటున్నట్టు క్రియేట్ చేసిన ఫొటోలను బీజేపీ ఐటీ సేల్ బాగా షేర్ చేసింది. మోదీ చెయ్యి పట్టుకోని రాముడు నడుస్తున్నట్టు ఎడిట్ చేసిన ఫొటో అయితే నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఇంతటితో ఆగలేదు.. రామ మందిరం ప్రారంభోత్సవం సమయంలో మోదీ ఇచ్చిన ఓ స్పీచ్‌ని తెగ షేర్ చేసింది భక్తలోకం. ఆ వీడియోలో మోదీ కనిపించలేదని.. సాక్ష్యాత్తు హనుమంతుడే మోదీలో ఆవహించాడని ప్రచారం చేసింది. ఇదంతా మోదీపై వారికున్న వెర్రీ.. అయితే మోదీకి మాత్రం మతం తన పదవికి అవసరమయ్యే ఓ సాధనం.. ఈ విషయం తెలియని అమాయకపు భక్తులు ఆయన్ను విశ్వగురువుగా, రాముడిగా, హనుమంతుడిగా.. ఇక కొత్తగా దేవుడు పంపిన బిడ్డగా ఊహించుకోని భ్రమపడుతున్నారు.
Also Read: అబద్ధాలు, విద్వేషాలే మోదీ పునాదులు! అసలు ఎలక్షన్ కమిషన్ నిద్ర లేచేనా?