Menu

Sarfaraz: అభిమానుల మద్దతుతో వచ్చిన ఆటగాడు.. సర్ఫరాజ్‌ తండ్రి కన్నీళ్లే సాక్ష్యం..!


అతను ఔటైతే అభిమానులు బాధపడ్డారు..అతని సెంచరీ కోసం డిక్లేర్ చేయవద్దని వేడుకున్నారు.. వేరొకరి తప్పిదం వల్ల అతను రనౌట్ అయితే అది చూసి కెప్టెన్‌ కోపంతో ఏకంగా క్యాప్‌నే విసిరిపడేశాడు. కాలం ఎంత త్వరగా మారిపోయింది..? సర్ఫరాజ్‌పై ప్రేమలో ఎంత తేడా?


Tri Ten B

Sarfaraz Khan In First Test: 20ఓవర్ల పాటు సాగే ఐపీఎల్‌ మ్యాచ్‌లో పట్టుమని పది నిమిషాలు బ్యాట్‌ ఝులిపిస్తే చాలు ఎక్కడలేని ఫేమ్‌ వస్తుంది. ఓవర్‌నైట్‌ స్టార్‌గా కూడా మారిపోవచ్చు. టాలెంట్‌ వెలికితియ్యడంలో ఐపీఎల్‌ కూడా ఒక కొలమానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది ఒక్కటే కొలమానమనే పరిస్థితులు రావడం నిజంగా బాధాకరం. దేశవాళి మ్యాచ్‌ల్లో ఏనాటి నుంచో అదరగొడుతున్న ఆటగాళ్లకు టీమిండియాలో ప్లేస్‌ రావడం గగనమైపోయింది. ఐపీఎల్‌ ముందువరకు భారత్‌ జట్టులో స్థానం సంపాదించాలంటే రంజీ సీజన్‌(Ranji Trophy)లో ఆటను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరానీ ట్రోఫి, దులిప్‌ ట్రోఫి లాంటివి ఎలానో ఉన్నాయి. కానీ ఐపీఎల్‌(IPL) మాత్రమే సెలక్టర్లకు కనపడేది.. ఎందుకంటే ఫ్యాన్స్‌ ఎక్కువగా ఫాలో అయ్యేది ఇదే కాబట్టి. అందుకే టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి సర్ఫరాజ్‌(Sarfaraz Khan)కు ఏళ్లు పట్టింది.


వెక్కిరించిన దురదృష్టం:
అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా ఒడిసి పట్టుకున్న ఈ ముంబై ఆటగాడు ఆడిన తొలి మ్యాచ్‌లో తానెంటో ప్రపంచానికి చూపించాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా డిక్లెర్‌ చేసింది కానీ లేకపోయి ఉంటే సర్ఫరాజ్‌ ఖాతాలో సెంచరీ కూడా పడి ఉండేది. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన రాంగ్‌ కాల్‌కు సర్ఫరాజ్‌ బలయ్యాడు. ఇలా అతడిని దురదృష్టం తొలి ఇన్నింగ్స్‌లోనూ వెక్కిరించింది. అయితే అభిమానులు మాత్రం సర్ఫరాజ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. నిజానికి సర్ఫరాజ్‌ నాలుగేళ్లుగా దేశవాళి మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నా ఫ్యాన్స్‌ నుంచి మద్దతులేదు. కానీ ఎప్పుడైతే టీమిండియా బ్యాటర్‌ ఆర్డర్‌ వీక్‌ అయ్యిందో అప్పుడు అభిమానులకు కూడా అసలు విషయం తెలిసి వచ్చింది. సర్ఫరాజ్‌ను జట్టులోకి తీసుకోవాలని సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అన్నివైపుల నుంచి బీసీసీఐపై ఒత్తిడి పెరగడంతో ఇంగ్లండ్‌తో మూడు,నాలుగు,ఐదు టెస్టుల కోసం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు.


అప్పుడు వివక్ష.. ఇప్పుడు అండ:
గతంలో సర్ఫరాజ్‌ని సెలక్ట్‌ చేయకపోవడానికి బీసీసీఐ చెప్పినవి సాకులే. ఫిట్‌నెస్‌ అని ఒకసారి.. ఫీల్డింగ్‌ చేయలేడని ఒకసారి.. శరీర బరువు అని ఇంకోసారి సర్ఫరాజ్‌ను అవమానించేలా మాట్లాడింది బీసీసీఐ. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో డాన్‌బ్రాడ్‌మాన్‌గా పేరు తెచ్చుకున్న సర్ఫరాజ్‌ని శరీర బరువు సాకుతో పక్కనపెట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ సైతం ఇదే కారణంతో సర్ఫరాజ్‌ను పక్కన పెట్టింది. ఇటు ఫ్యాన్స్‌ కూడా ఇదే పెద్ద కారణంగా చూశారు. మరి ఇంజిమామ్‌, సెహ్వాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా ఆడారో వీళ్లందరికి తెలియనది కాదు.. ఇదంతా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఈగోను సెటిస్‌ఫై చేసుకునే ఒక సాకే తప్పా ఇంకేమీ కాదు. స్పెషల్‌ స్కిల్ ఉన్న ఆటగాళ్లకు కొన్ని మినహాయింపులు కచ్చితంగా ఉంటాయి. శరీరం మొత్తం ఫిట్‌గా ఉంచుకోని పరుగులు చేయలేక బౌలర్ల కంటే దారుణంగా బ్యాటింగ్‌ చేసిన ఆటగాళ్లను కూడా ఆదరిస్తున్నప్పుడు సర్ఫరాజ్‌ విషయంలో మాత్రమే ఎందుకీంత వివక్షతో బీసీసీఐ వ్యవహారించేదో. తొడగొట్టాడని ఒకసారి.. బిహేవియర్‌ పేరిట ఇంకోసారి ఏదో ప్రచారం చేశారు. ప్రవర్తన గురించి జట్టు సెలక్షనే నిజమైతే టీమిండియా రన్‌మెషీన్లు ఏనాడో ఇంటిముఖం పట్టేవి. ఇదంతా రాజకీయమంతే.. ఇంతటి రాజకీయం నుంచి కూడా సర్ఫరాజ్‌ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు..అది కూడా అభిమానుల మద్దతుతో.. కుంబ్లే నుంచి టెస్ట్‌ క్యాంప్‌ అందుకున్న కొడుకుని చూసి ఆనందంతో ఏడ్చేసిన సర్ఫరాజ్‌ తల్లిదండ్రుల కన్నీళ్లే ఇందుకు సాక్ష్యం..!

Also Read: 15ఏళ్లగా అదే ఆత్రం.. జడేజా తొందరపాట్లకు ఇంకెంతమంది ఔట్ అవ్వాలో!

 

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *